యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "దేవర" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు బాలీవుడ్ ఎంట్రీ కి కూడా ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నాడు. "వార్ 2" చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతున్న ఎన్టీఆర్ .. హృతిక్ రోషన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోతున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే...
"వార్ 2" లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పైనలైజ్ అయ్యిందని తెలుస్తోంది. బంటీ ఔర్ బబ్లీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శార్వరి వాఘ్ "వార్ 2" లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతోంది. ఈ అఫర్ పట్ల అమ్మడు చాలా ఎగ్జయిట్ అయ్యిందట. మరో మాట మాట్లాడకుండా ఎన్టీఆర్ తో రొమాన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ బ్యూటి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారక ప్రకటన వెలువడనుందని బాలీవుడ్ టాక్.