మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా హీరోయిన్ త్రిష కు సపోర్ట్ చేసారు. హీరోయిన్ కోసమే కాదు.. ఏ మహిళ గురించి అయినా ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఖండించి తీరుతానని తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో... సరైన సమయంలో స్పందించినందుకు అందరూ చిరంజీవి ని మెచ్చుకుంటున్నారు. అసలు త్రిష కు ఎందుకు సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందనే విషయంలోకి వెళితే...
లియో చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ కూడా నటించాడు. కాగా ఓ ఇంటర్య్వూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ - లియో సినిమాలో త్రిష తో రేప్ సీన్ ఉంటుందని భావించాను. నా చేతులతో త్రిష ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లే సీన్ ఉంటుందని ఊహించాను అని చెప్పాడు.
ఈ మాటలను త్రిష ఖండిస్తూ... ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. ఇకపై మన్సూర్ అలీఖాన్ నటించే సినిమాల్లో నేను నటించను అని చెప్పింది. త్రిషకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారు చాలామంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. మన్సూర్ అలీఖాన్ మాటలను ఖండిస్తున్నారు.
తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా త్రిష కు సపోర్ట్ చేసారు. చిరు స్పందించారు కాబట్టి... తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి త్రిష కు పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.