View

Pandavulu Pandavulu Thummedha Review

Friday,January31st,2014, 01:27 PM

చిత్రం - పాండవులు పాండవులు తుమ్మెద

నటీనటులు - మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, రవీనా టాండాన్, హన్సిక, ప్రణీత, గుర్లిన్ చోప్రా, బ్రహ్మానందం, సునీల్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీత దర్శకులు - బప్పా లహరి, అచ్చు

సినిమాటోగ్రఫి – పళని కుమార్

ఎడిటింగ్ – ఎమ్.ఆర్.వర్మ

à°°à°šà°¨ – బివిఎస్ రవి

స్క్రీన్ ప్లే – కోన వెంకట్, గోపి మోహన్

మాటలు – డైమండ్ రత్నం

బ్యానర్ – శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

సమర్పణ – అరియాన, వివియాన

దర్శకత్వం - శ్రీవాస్

నిర్మాతలు - మంచు విష్ణు, మంచు మనోజ్

విడుదల తేదీ - 31st జనవరి, 2014

మంచు మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. కొంత గ్యాప్ తర్వాత కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నటించడం అది కూడా ఆయన ఇద్దరు తనయులతో కలిసి నటించడంతో ఈ చిత్రం ఆరంభమైనప్పట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' చిత్రాల విజయంతో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. మనోజ్ సైతం 'పోటుగాడు' హిట్ తో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. వీరికి మోహన్ బాబు కూడా తోడయ్యారు కాబట్టి ఈ సినిమా మోహన్ బాబు కుటుంబానికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయ్యింది. మరి ఈ మంచు మల్టీస్టారర్ ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥

నాయుడు (మోహన్ బాబు) బ్యాంకాక్ లో టూర్టిస్ట్ గైడ్. నాయుడు ముగ్గురు అనాధ పిల్లలు అజయ్, వరుణ్, లక్కీ (మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్) తన సొంత కొడుకులులాగా చిన్నప్పట్నుంచి పెంచుతుంటాడు. వారికి తాము అనాధలు అనే విషయం తెలియదు. మోసం చేయకుండా నీతిగా బ్రతకాలని కొడుకులకు చెబుతుంటాడు నాయుడు. అదే బ్యాంకాక్ లో సత్య (రవీనా టాండాన్) ఇద్దరు కొడుకులు విజ్జు(విష్ణు), వెన్నెల కిషోర్ లతో ఉంటుంది. వీళ్లతో పాటు పేయింగ్ గెస్ట్ గా హనీ (హన్సిక), ఆమె ఫ్రెండ్ (గుర్లిన్ చోప్రా) ఉంటారు. అజయ్, విజ్జు మధ్య జరిగిన గొడవతో నాయుడు, సత్య కలుసుకోవాల్సిన పరిస్థతి నెలకొంటుంది. తాను ప్రేమించిన సత్యను చూసిన నాయుడు తామిద్దరూ పెళ్లి చేసుకోకుండా విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటాడు.

సత్య తండ్రి సుబ్బారావు (దాసరి నారాయణరావు) డబ్బులు లేని వ్యక్తి నాయుడికిచ్చి తన కూతురిని పెళ్లి చేయడానికి నిరాకరిస్తాడు. సత్య మాత్రం నాయుడితోనే తన పెళ్లి జరగాలనుకుంటుంది. దాంతో 5 లక్షలు సంపాదించుకుని వస్తే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని నాయుడికి చెప్తాడు సుబ్బారావు. ఆ రకంగా సత్య, నాయుడు పెళ్లి జరగదు.

నాయుడు డబ్బులు సంపాదించుకుని వచ్చేసరికి సత్య కుటుంబం అక్కడ ఉండదు. దాంతో అతను ముగ్గురు అనాధ పిల్లలను చేరదీసి కన్నతండ్రిలా పెంచుతూ బ్యాంకాక్ వచ్చేస్తాడు. సత్య తండ్రికి బిజినెస్ లో నష్టం రావడం, ఆయన చనిపోవడం జరుగుతుంది. తన తండ్రి దగ్గర పని చేస్తున్న వ్యక్తి కూడా చనిపోవడంతో ఆయన ఇద్దరు కొడుకులను తన సొంత కొడుకుల్లా పెంచుతూ బ్యాంకాక్ వచ్చేస్తుంది సత్య.

నాయుడు, సత్య ఫ్లాష్ బ్యాక్ లను తెలుసుకున్న హనీ విడిపోయిన ఈ ప్రేమికులను కలపాలని నిర్ణయించుకుంటుంది. వీరి దగ్గర పెరుగుతున్న కొడుకులకు నచ్చజెప్పి నాయుడు, సత్య పెళ్లి చేస్తుంది. కానీ వీరందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు అజయ్, విజ్జు గొడవపడతారు. లక్కీ తామందరూ అనాధ పిల్లలమని, తల్లిదండ్రులై సత్య, నాయుడు పెంచుతున్నారని తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని అందరితో చెబుతాడు. దాంతో ఇకపై సత్య, నాయుడిని కష్ట పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని డిసైడ్ అవుతారు. ఈ సమయంలోనే విజ్జు తన ప్రేమను హనీకి తెలియజేస్తాడు. హనీ కూడా విజ్జును ప్రేమిస్తుంది. హనీ తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడానికి సత్య, నాయుడు, మిగతా వారందరినీ ఓ రెస్టారెంట్ కి రమ్మని చెబుతుంది. తన గురించి వీరందరికీ చెప్పేముందే కొంతమంది రౌడీలు వచ్చి హనీ ని తీసుకెళ్లిపోతారు. హనీ ఫ్రెండ్ ద్వారా హనీ ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుని నాయుడు, సత్య తన కొడుకులందరినీ తీసుకుని హనీని కాపాడటానికి బయలుదేరతాడు.

పాండవపురం, కౌరవపురంకు మధ్య జరిగిన బెట్టింగ్లో హనీ తండ్రి ఓడిపోవడంతో సుయోధన కొడుకును హనీ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే హనీ బ్యాంకాక్ కి వెళుతుంది. మోసం చేసి సుయోధన బెట్టింగ్ లో గెల్చుకున్నాడని తెలుసుకున్న నాయుడు అదే మోసంతో సుయోధనకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. సుయోధన ఇంట్లోకి గ్రహరాజు అవతారంతో కాలు పెడతాడు నాయుడు. మిగతా వాళ్లను కూడా వేరే వేరే అవతారంలో ఆ ఇంట్లోకి అడుగుపెట్టేలా చేస్తాడు నాయుడు. మోహిని అవతారమెత్తి అజయ్ (మంచు మనోజ్) ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు. మోహిని వేషంలో ఉన్న అజయ్ ని సుయోధన ముగ్గురు కొడుకులు ఇష్టపడతారు. సుయోధన బావమరిది (బహ్మానందం) కూడా తన కూతురు కుచలక్ష్మీ (ప్రణీత)తో కలిసి సుయోధన ఇంట్లోనే ఉంటాడు. ఫైనల్ గా నాయుడు వేసిన ప్లాన్ తో విజ్జు, హనీ పెళ్లి జరిగిందా? నాయుడు తన కుటుంబ సభ్యులతోనే మారు వేషంలో తన ఇంట్లోకి అడుగుపెట్టాడని సుయోధన తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్ ఫామెన్స్

ప్రధాన పాత్రలు పోషించిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ తమ పాత్రలను చక్కగా పోషించారు. నాయుడు, గ్రహరాజు పాత్రల్లో వేరియేషన్ చూపిస్తూ, తనదైన శైలిలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు మోహన్ బాబు. కొంత గ్యాప్ తర్వాత మోహన్ బాబు మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

విష్ణు ఫస్టాప్ లో విజ్జుగా, సెకండాఫ్ లో గ్యాంబ్లర్ గా చక్కగా నటించాడు. ఈ రెండు పాత్రలకు బాడీ లంగ్వేజ్ లో డిఫరెన్స్ చూపించాడు. డ్యాన్స్, ఫైట్స్ కూడా చాలా బాగా చేసాడు. హన్సికతో విష్ణు చేసిన సీన్లు బాగున్నాయి. ఈ ఇద్దరి జంట బాగుంది.

మనోజ్ ఫస్టాప్ లో అజయ్ గా, సెకండాఫ్ లో మోహినిగా నటించాడు. ఈ రెండు పాత్రల్లోనూ అలరించాడు మనోజ్. ఫస్టాప్ లో అజయ్ పాత్ర చేసే కొన్ని కామెడీ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఆడియన్స్ ఈ సీన్స్ లో రిలాక్స్ అవుతారు. ఇక సెకండాఫ్ లో మోహినిగా మనోజ్ నటన సూపర్బ్. మోహిని గెటప్ లో మనోజ్ చేసిన సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా చెప్పాల్సిందే. ప్రేక్షకులను ఈ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మనోజ్ షో స్టీలర్.

తనీష్ మూగవాడిగా చక్కగా నటించాడు. తను నటించిన సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

వరుణ్ సందేశ్, రవీనా టాండాన్, ముఖేష్ రుషి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం మరోసారి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మనసులను గెల్చుకోవడం ఖాయం.

టెక్నికల్ గా...

స్టోరీ లైన్ పాతదే అయినప్పటికీ, డైరెక్టర్ కథను నరేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కువ పాత్రలు ఉన్నప్పటికీ, చాలా క్లారటీగా ప్రజెంట్ చేసే విషయంలో డైరెక్టర్ శ్రీవాస్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మంచు కుటుంబం ప్రెస్టేజియస్ సినిమాగా భావిస్తున్న ఈ సినిమాని రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, బి.వి.యన్.యస్.రవితో చక్కగా కో ఆర్డినేట్ అయ్యి సక్సెస్ చేయడంలో వంద శాతం పాసయ్యాడు శ్రీవాస్. పాటలు, రీ-రికార్డింగ్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చక్కగా కుదిరాయి. టెక్నికల్ గా చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చెప్పుకోదగ్గ విధంగా ఉన్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ

రెగ్యులర్ స్టోరీ లైన్ అయినప్పటికీ, చక్కటి స్ర్కీన్ ప్లే, ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించదు. ఎలాంటి బోర్ ఫీలవ్వకుండా రెండున్నర గంటలు కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయగల హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మంచు అభిమానులను పూర్తిగా తృప్తిపరిచే చిత్రం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !