View

Basanthi Review

Friday,February28th,2014, 10:29 AM

చిత్రం - బసంతి

నటీనటులు - రాజా గౌతమ్, అలీషా బేగ్, తనికెళ్ల భరణి, షయాజీ షిండే, రణధీర్, నవీన్, ధనరాజ్ తదితరులు

సంగీతం - మణిశర్మ

సినిమాటోగ్రఫీ - అనిల్ బండారి

దర్శకత్వం - ఉదయ్ చైతన్య దంతులూరి

నిర్మాత - ఉమ

విడుదల తేదీ - 28.2.2014

'బాణం' సినిమా చూసిన ఎవరికైనా ఆ చిత్రదర్శకుడు చైతన్య దంతులూరి మీద ఓ అభిమానం ఏర్పడుతుంది. తొలి సినిమా అయినా బాగా తీశాడని, దర్శకునిగా ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని ఫిక్స్ అవుతారు. ఆ అభిమానంతో అతని తాజా చిత్రం 'బసంతి'ని చూడటానికి వెళతారు. 'పల్లకిలో పెళ్లి కూతురు' చిత్రంలాంటి ఫెయిల్యుర్ తో కెరీర్ ఆరంభించిన బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కొంత గ్యాప్ తీసుకుని, నటన పరంగా కసరత్తులు చేసుకుని చేసిన చిత్రం 'బసంతి'. ఈ చిత్రంతో గౌతమ్ కి మంచి బ్రేక్ చాలా అవసరం. మరి.. దర్శకునిగా మలి ప్రయత్నంతో చైతన్య మళ్లీ భేష్ అనిపించుకుంటాడా? నటనపరంగా గౌతమ్ బెటర్ అయ్యాడా? ప్రేక్షకులకు 'బసంతి' ఎలాంటి అనుభూతిని మిగులుస్తుంది? తదితర విషయాలను తెలుసుకుందాం...

à°•à°¥

అర్జున్ (గౌతమ్) బసంతి కాలేజీలో చదువుకుంటాడు. తన స్నేహితులు, కుటుంబం తప్ప వేరే ప్రపంచం తెలియదు. తన వయసు కుర్రాళ్లలానే సరదా సరదాగా ఉంటాడు. తొలి చూపులోనే రోషిణి (అలీషా బేగ్ తో) ప్రేమలో పడిపోతాడు. కానీ, ఆ విషయం తనకు చెప్పడు. పై చదువుల కసం రోషిణి లండన్ వెళ్లాలనుకుంటుంది. దాంతో తన ప్రేమను బయటికి చెప్పకుండా ఆగిపోతాడు అర్జున్. రోషిణికి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్ట్ కి వెళతాడు. అదే సమయంలో తన కాలేజీలో ఫేర్ వెల్ పార్టీ కూడా ఏర్పాటు చేస్తారు స్టూడెంట్స్. అందరూ పార్టీ సన్నాహాల్లో ఉండగా, తీవ్రవాదులు కాలేజీలోకి చొరబడతారు. కొంతమంది స్టూడెంట్స్ ని బంధిస్తారు. తమ నాయకుడు బబర్ ఖాన్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. ఎయిర్ పోర్ట్ నుంచి కాలేజీకి వచ్చిన అర్జున్.. రోషణి తండ్రి, పోలీసాఫీసర్ (షయాజీ షిండే) ద్వారా రోషిణి కూడా బంధీ అయిన విద్యార్థుల్లో ఉందని తెలుసుకుంటాడు. సాహసించి తను కూడా లోపలికి వెళ్లి, తీవ్రవాదులకు పట్టుబడతాడు. అరగంటకో విద్యార్థిని చంపడం మొదలుపెడతారు తీవ్రవాదులు. అర్జున్ స్నేహితుణ్ణి కూడా చంపేస్తారు. కాలేజీ చుట్టూ బాంబులు ఉన్నందున పోలీసులు లోపలికి వెళ్లడానికి సంశయించి, బాబర్ ఖాన్ని విడుదల చేయడానికి అంగీకరిస్తారు. తీవ్రవాదిని వదిలేస్తారా? తన స్నేహితుడి మరణం అర్జున్ లో కొత్త ఆలోచన రేకెత్తించిందా? రోషిణి తో తన ప్రేమను చెప్పగలుగుతాడా? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ

ఇది చాలా సాదాసీదా కథ. ఇలాంటి కథలు మనం డాక్యుమెంటరీస్ లో చూశాం. 'గగనం'లాంటి కొన్ని సినిమాల్లోనూ చూశాం. కాకపోతే, వాటి నేపథ్యాలు వేరు. ఇది కాలేజీ నేపథ్యంలో సాగుతుంది. అంతే తేడా. ఈ కథలో గౌతమ్ కి నటుడిగా నిరూపించుకోవడానికి పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో యాక్ట్ చేశాడు. నటుడిగా పరిణతి చెందాడనుకున్నాం కానీ, అది ఊహే. ఇంకా చాలా చాలా బెటర్ కావాల్సి ఉంది. డాన్సులు సోసోగా చేశాడు. దానికి కారణం కొంచెం బొద్దుగా ఉండటమే. ప్రతి హీరోకీ సిక్స్ ప్యాక్ ఉండాలని ప్రేక్షకులు ఎదురుచూడరు కానీ, సినిమా హీరో అంటే స్లిమ్ గా, ఫిట్ గా ఉండాల్సిందే. ఆ పరంగా చూస్తే గౌతమ్ ఇంకా తగ్గాలి. నటుడిగా ఎదగాలి. అలీషా బేగ్ యావరేజ్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. సరైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేకపోయింది. అబ్బాస్ గా రణధీర్ బాగా నటించాడు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు రణధీర్. తనికెళ్ల భరణి, ధనరాజ్, షయాజీ షిండే, నవీన్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక, చైతన్య దంతులూరి తను ఎన్నుకున్న చిన్న కథను బలంగా చూపించలేకపోయాడు. ప్రేమ సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. తీవ్రవాదులు, పోలీసులు మధ్య జరిగే సంభాషణ, ఆ డ్రామా మొత్తం సాదాసీదాగా సాగుతుంది. అందులో డెప్త్ ఉండదు. ఈ సినిమా మొత్తం మీద ఏదీ మనసుని తాకుతున్నట్లు అనిపించదు. లైటర్ వీన్ గా సాగడంతో ప్రేక్షకుడు కూడా లైట్ గానే తీసుకుంటాడు. తీవ్రవాదులకు సామాన్యలు పట్టుబడటం అంటే చిన్న విషయం కాదు. కానీ, అందులో డెప్త్ ఉండదు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కథతో పాటు సాగుతాయి. కెమెరా పనితనం బాగుంది. కానీ కథనం బలహీనంగా ఉండటంతో మిగతా ప్లస్ పాయింట్స్ ఏవీ ఎలివేట్ కావు.

ఫైనల్ గా చెప్పాలంటే..

ఈ సినిమా ప్రచారం కోసం చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటివాళ్లని వాడుకున్నాడు బ్మహ్మానందం. అందరూ కాదనుకుండా గౌతమ్ ని, సినిమాని ప్రమోట్ చేస్తూ పాజిటివ్ గా నాలుగు మంచి మాటలు చెప్పారు. అవి ఈ సినిమాని థియేటర్ వరకు ప్రేక్షకులను తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పే నాలుగు మాటలు మాత్రం పాజిటివ్ గా ఉండవు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !