View

Bheemavaram Bullodu Review

Friday,February28th,2014, 12:27 PM

చిత్రం - భీమవరం బుల్లోడు

బ్యానర్ - సురేష్ ప్రొడక్షన్స్

నటీనటులు - సునీల్, ఎస్తర్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం - అనూప్ రూబెన్స్

డైలాగ్స్ - శ్రీధర్ సీపాన

దర్శకత్వం - ఉదయశంకర్

విడుదల తేదీ - 28.2.2014

కమెడీయన్ గా తెలుగు ప్రేక్షకుల మనసులను గెల్చుకున్న సునీల్ 'అందాల రాముడు' చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో సునీల్ ఇక హీరోగానే కొనసాగాలని ఫిక్స్ అయిపోయాడు. అప్పట్నుంచి హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా 'భీమవరం బుల్లోడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం రూపొందింది. ఉదయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హీరోగా తనను మరో మెట్టు ఎక్కిస్తుందని సునీల్ భావిస్తున్నాడు. మరీ ముఖ్యంగా తన సొంత ఊరు 'భీమవరం' ని తన సినిమా టైటిల్ గా పెట్టుకుని 'భీమవరం బుల్లోడు' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావడం సునీల్ ని చాలా ఎగ్జయిటింగ్ కి గురి చేసింది. ఎన్నో అంచనాలతో ఈ సినిమా చేసాడు సునీల్. మరి ఈ చిత్రం సునీల్ ని మరో మెట్టు ఎక్కిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥

భీమవరంలో నివసించే కుర్రాడు రాంబాబు(సునీల్). ఆ ఊరిలోని వారికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. రాంబాబు ఏ అమ్మాయినైనా పెళ్లి చూపులు చూస్తే ఆ అమ్మాయికి రాంబాబుతో పెళ్లి అవ్వదుకానీ, వేరే అబ్బాయితో పెళ్లయిపోతుంది. ఈ సెంటిమెంట్ ని బలంగా నమ్మే ఆ ఊరి ప్రజలు తమ ఆడపిల్లలను ఓసారి వచ్చి చూసి పొమ్మని రాంబాబును బ్రతిమలాడుతుంటారు. తన మనవడుకు పెళ్లి అవ్వడంలేదని రాంబాబు బామ్మ తెగ బాధపడిపోతుంటుంది. ఇలాంటి సమయంలో ఓ చిన్న ప్రమాదంలో రాంబాబు గాయపడతాడు. హాస్పటల్ కు వెళ్లిన రాంబాబుకు బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్లు చెబుతారు. దాంతో జీవితంపై విరక్తి చెందిన రాంబాబు కాన్సర్ పేషంట్ (తనికెళ్ల భరణి) వల్ల మనసు మార్చుకుని తను బ్రతికే 10రోజులైనా సమాజానికి మంచి చేయాలని ఫిక్స్ అవుతాడు. తన వాళ్లకు దూరంగా ఉండాలని బావించి భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు. ప్రజలను ఇబ్బందిపెడుతున్న అక్కడ రౌడీలందరినీ ధైర్యంగా ఏరిపారేస్తుంటాడు. ఆ సమయంలో నందిని (ఎస్తర్) రాంబాబుకు తారసపడుతుంది. ఆమె అతనిని ప్రేమిస్తుంది. చనిపోయే తనకు ప్రేమ ఎందుకని నందినిపై ప్రేమ ఉన్నా బయటపడడు. కానీ రిపోర్ట్స్ మారిపోవడం వల్లే తనకు బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్లు చెప్పారని తెలుసుకున్న రాంబాబు తన ప్రేమను గెలిపించుకోవాలనుకుంటాడు. అప్పటికే రాంబాబుకు శ్రతువుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక నందిని తండ్రికి ప్రేమ పెళ్లిళ్లు అంటే అసలు ఇష్టముండదు. శత్రువుల నుంచి తనని తాను కాపాడుకుంటూ, వారిని అంతమొందిస్తూ, నందిని తండ్రిని పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాడు రాంబాబు.

ఫిల్మీబజ్ విశ్లేషణ

భీమవరంకు చెందిన కుర్రాడు రాంబాబుగా సునీల్ పూర్తిగా తన పాత్రలో లీనమై నటించాడు. డైలాగులను తనదైన శైలిలో చెప్పాడు. కామెడీ సీన్స్ లో ప్రేక్షకులను నవ్వించడానికి తనవంతు కృషి చేసాడు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసాడు. ఎస్తర్ కాస్త బొద్దుగా ఉంది. కానీ సునీల్ పక్కన బాగుంది. కీలక పాత్రలు చేసిన పోసాని కృష్ణమురళి అద్భుతంగా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, తాగుబోతు రమేష్ సెకండాఫ్ లో అక్కడక్కడా బాగా నవ్వించారు.

డైరెక్టర్ ఎంచుకున్న కథ చాలా పాతది. కథ పాతది అయినా సరే ట్రీట్మెంట్ బాగుంటే ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది. ఆ విషయంలో డైరెక్టర్ ఉదయశంకర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. స్ర్కీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా లేదు. సునీల్ కామెడీ హీరో. ఈ విషయాన్ని డైరెక్టర్ పక్కాగా గుర్తు పెట్టుకోవాలి. సునీల్ తో మంచి కామెడీ సీన్స్ వర్క్ వుట్ చేయాలి. కానీ ఈ సినిమాలో చాలా ఎక్కువ ఫైట్ సీక్వెన్స్ లు ఉన్నాయి. సునీల్ లాంటి నటుడికి అన్ని ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టడం అనేది చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్ మ్యూజిక్. అనూప్ ఇచ్చిన ట్యూన్స్ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఆ పాటలు వచ్చిన ప్లేస్ లు కూడా బాగోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం ఈ చిత్రానికి మైనస్. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. శ్రీధర్ సీపాన అందించిన డైలాగుల్లో పంచ్ లేదు. సునీల్ నుంచి మంచి పంచ్ ఇచ్చే కామెడీ డైలాగులు ప్రేక్షకులు ఆశిస్తారు. అవి లేకపోవడం నిరాశకు గురవ్వాల్సి వస్తోంది.

ఫైనల్ గా చెప్పాలంటే... ఈ బుల్లోడు భీమవరం వాసులను కూడా ఆకట్టుకునే విధంగా లేడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !