View

'మనం' రివ్వ్యూ

Friday,May23rd,2014, 08:06 AM

చిత్రం - మనం

నటీనటులు - డా. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, శ్రియ సరన్, సమంత, నీతూచంద్ర, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం తదితరులు

గెస్ట్ అఫియరెన్స్ - అమితాబ్ బచ్చన్, అమల, అఖిల్

సంగీతం: అనూప్ రూబెన్స్

కెమెరా: పి.ఎస్. వినోద్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాణం: అక్కినేని కుటుంబం

దర్శకత్వం: విక్రమ్ కుమార్.

ఒకే కుటుంబానికి చెందిన మూడు తరం నటులు కలిసి నటించడం ఓ అరుదైన రికార్డ్. ఆ రికార్డ్ ని బాలీవుడ్ లో ఒక్క రాజ్ కపూర్ కుటుంబం మాత్రమే దక్కించుకుంది. 'మనం' చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఆ ఘనతను అక్కినేని కుటుంబం సొంతం చేసుకుంది. పైగా ఏయన్నార్ నటించిన చివరి సినిమా ఇదే కావడంతో ఇది మన సినిమా అని, మిస్ కాకూడదని తెలుగు ప్రేక్షకులు నిర్ణయించుకున్నారు. 'మనం' బ్రహ్మాండంగా ఉంటుందనే అంచనాలను ప్రచార చిత్రాలు కలగజేశాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమా్కీ రానంత క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది. మరి. మనందర్నీ ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా..? ఆ విషయంలోకే వెళదాం...

à°•à°¥

రాధామోహన్ (నాగచైతన్య), కష్ణవేణి (సమంత) వివాహంతో కథ ఆరంభమవుతుంది. అన్యోన్య దాంపత్యానికి చిరునామా అన్నట్లుగా వీరి వైవాహిక జీవితం సాగుతుంది. ఇద్దరికీ పండంటి బిడ్డ పుడతారు. ఈ బుడతడి ముద్దు పేరు బిట్టు. అసలు పేరు నాగేశ్వర్ (నాగార్జున). రాధామోహన్, కృష్ణవేణి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో అనుకోని విధంగా మనస్పర్థలు వస్తాయి. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలనుకుంటారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా ఇద్దరూ చనిపోతారు. కట్ చేస్తే...

నాగేశ్వర్ పెరిగి, పెద్దవాడవుతాడు. వ్యాపార రంగంలో తిరుగులేని వ్యక్తిగా చలామణీ అవుతుంటాడు. ఓ సందర్భంలో తన తండ్రి పోలికలతో ఉన్న నాగ్ (నాగచైతన్య) అనే వ్యక్తితో పరిచయమవుతుంది నాగేశ్వర్ కి. ఇతనే తన తండ్రి అని, తల్లి కృష్ణవేణి కూడా ఎక్కడో పుట్టే ఉంటుందని నమ్ముతాడు. ఆ నమ్మకం నిజమవుతుంది. కృష్ణవేణి పోలికలతో ఉన్న ప్రియ (సమంత) తారసపడుతుంది నాగేశ్వర్ కి. తన తల్లి, తండ్రినీ కలపాలనుకుంటాడు. ఓ సంఘటన ద్వారా తన తండ్రి నాగ్ కి దగ్గరవుతాడు నాగేశ్వర్. మరి.. తను అనుకున్నట్లే అమ్మా, నాన్నని కలపగలిగాడా?

తల్లిదండ్రులను కలపడానికి నాగేశ్వర్ ప్రయత్నాలు మొదలుపెడతాడు. à°ˆ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైన చైతన్య (నాగేశ్వరరావు)ను కాపాడటానికి నాగేశ్వర్ కారుని వాడుకుటుంది డాక్టర్ అంజలి (శ్రియ). ఆమెను చూడగానే నాగేశ్వర్ హృదయంలో ఏదో అలజడి. అంజలికి కూడా అదే భావన. చైతన్య ని హాస్పటల్ à°•à°¿ తీసుకెళ్లి చికిత్స చేస్తుంది అంజలి. రక్తం అవసరమైతే నాగేశ్వర్ ఇస్తాడు. స్పృహలోకొచ్చిన చైతన్య.. నాగేశ్వర్, అంజలిని చూసి షాకవుతాడు. వాళ్లిద్దరూ తన తల్లిదండ్రులు సీతారామ్, రామలక్ష్మిల్లా  à°‰à°¨à±à°¨à°¾à°°à°¨à°¿ అనుకుంటాడు. à°† తర్వాత చైతన్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు?

రాధామోహన్, కష్ణవేణిని నాగేశ్వర్ కలిపాడా? చైతన్య భావించినట్లు నాగేశ్వర్, అంజలి అతని తల్లిదండ్రులేనా?.. ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల వాళ్లు చనిపోయి, మళ్లీ జన్మించారా? తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 'మనం' చూడాల్సిందే.

ఫిల్మీబజ్ విశ్లేషణ

నటీనటులు

అక్కినేని నాగేశ్వరరావు తనదైన శైలిలో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన తెరపై కనిపించినది కాసేపే. à°† కాసేపు ప్రేక్షకులు కనురెప్ప వాల్చకుండా చూస్తారనడం అతిశయోక్తి కాదు. సీతారామ్, నాగేశ్వర్ పాత్రలను నాగార్జున బాగా చేశాడు. ఇక, నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తనలో à°Žà°‚à°¤ మంచి నటుడు ఉన్నాడో నిరూపించిన సినిమా ఇది. రాధాకృష్ణ, నాగార్జున పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయాడు నాగచైతన్య. à°ˆ పాత్రల్లోని రెండు కోణాలకు న్యాయం చేశాడు. సంభాషణలు పలికే తీరు పరంగా, నటన పరంగా à°—à°¤ చిత్రాలకన్నా నాగచైతన్యలో చాలా బెటర్ మెంట్ కనిపించింది. నాగచైతన్య కామెడీ టైమింగ్ కూడా బాగుంది. రామలక్ష్మి, అంజలి పాత్రలను శ్రియ, కృష్ణవేణి, ప్రియ పాత్రలను సమంత అద్భుతంగా చేశారు. à°ˆ ఇద్దరి అభినయం  à°•à±‚à°¡à°¾ మనసుల్లో నిలిచిపోతుంది. డాక్టర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ ఇలా కనిపించి, అలా మాయమవుతారు. à°† పాత్ర హుందాగా ఉంది. ఇంకా బ్రహ్మానందం, పోసాని, అలీ  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± తమ పాత్రలకు న్యాయం చేశారు. à°“ సన్నివేశంలో అమల కనిపిస్తుంది. క్లయిమాక్స్ లో అఖిల్ కనిపిస్తాడు. సినిమాలో తను ఎంట్రీ అయ్యే సీన్ కీలకంగా నిలుస్తుంది.

సాంకేతిక నిపుణులు

ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులపై à°•à°¥ అల్లడం సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ à°•à°¥ కుదిరినా, దాన్ని తెరకెక్కించడం à°…à°‚à°¤ తేలికైన విషయం కాదు. దర్శకుడు విక్రమ్ కుమార్ à°ˆ కథను అద్భుతంగా తెరకెక్కించాడు. నాగచైతన్య, సమంత రెండు కథల్లో, నాగార్జున, శ్రియ రెండు కథల్లో కనిపిస్తారు. అయినా, ప్రేక్షకుడు కన్ ఫ్యూజ్ కాడు. à°…à°‚à°¤ క్రిస్టల్ క్లియర్ à°—à°¾ విక్రమ్ కుమార్ à°ˆ సినిమాని తెరకెక్కించాడు. సినిమాలో నాగార్జునకు నాగచైతన్య తండ్రయితే, నాగేశ్వరరావుకి నాగార్జున తండ్రి. ఇది చాలా క్లిష్టమైన ముడి. ఏమాత్రం కన్విన్సింగ్ à°—à°¾ తీయకపోయినా సినిమా జోక్ అయిపోతుంది. కానీ, à°ˆ ముడిని ప్రేక్షకులు చాలా సీరియస్ à°—à°¾ తీసుకుని కథలో లీనమైపోతారు. à°ˆ కథకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్  à°—తం, వర్తమానాన్ని చక్కగా ఆవిష్కరించింది. అలాగే వినోద్ కెమెరా పనితనం à°•à°¥ తాలూకు మూడ్ ని కరెక్ట్ à°—à°¾ క్యారీ చేసింది. టోటల్ à°—à°¾ వంక పెట్టలేని సినిమా ఇది.

ఫైనల్ గా చెప్పాలంటే...

కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా.. à°—à°¤ 20, 30 ఏళ్లల్లో ఇలాంటి అద్భుతమైన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. 'మనం'దరం చూడాల్సిన సినిమా. చూడకపోతే à°“ అద్భుతాన్ని మిస్సయినట్లే. 

à°“ చిన్న మాట... అక్కినేని నాగేశ్వరరావుగారికి గౌరవమైన వీడ్కోలు à°ˆ చిత్రం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !