View

24 మూవీ రివ్య్వూ

Friday,May06th,2016, 11:07 AM

చిత్రం - 24
బ్యానర్ - 2D ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - సూర్య, సమంత, నిత్యామీనన్, గిరీష్ కర్నాడ్, అజయ్, శరణ్య తదితరులు
సంగీతం - ఏ.ఆర్.రహమాన్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ - తిరు
నిర్మాత - సూర్య
రచన, దర్శకత్వం - విక్రమ్ కుమార్


సూర్య, సమంత జంటగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '24'. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు (6.5.2016) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ముందుండే సూర్య, ఏకంగా ' 24' చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ‘గజిని’ లాంటి ప్రయోగాత్మక చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో, సూర్య చాలానే కొత్త పాత్రలు ప్రయత్నించాడు. ‘సెవెన్త్ సెన్స్’లో బోధిధర్ముని వంటి పాత్రలో నటించాడు. ‘బ్రదర్స్’లో అవిభక్త కవలలుగా, ‘రాక్షసుడు’లో దెయ్యంలా, ‘సూర్యా s/o కృష్ణన్’లో తండ్రీ, కొడుకులుగా నటించి మెప్పించాడు సూర్య. మూడు తరాల కథతో 'మనం' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఇప్పుడు విక్రమ్, సూర్య కలిసి చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం '24'. మరి ఈ ప్రయోగాత్మక చిత్రం ఆడియన్స్ ని మెప్పించేలా ఉందా... ఈ ప్రయోగం సూర్య, విక్రమ్ కుమార్ లకు భారీ సక్సెస్ ని తెచ్చి పెడుతుందా తెలుసుకుందాం.


కథ
శివకుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్. కాలాన్ని నియంత్రించగల వాచ్ ని తయారు చేయడానికి కృషి చేస్తుంటాడు. ఓ రోజు అతని కృషి ఫలించి కాలాన్ని నియంత్రించగల వాచ్ పర్ ఫెక్ట్ గా యాక్టివేట్ అవుతుంది. ఈ వాచ్ ని తన సొంతం చేసుకుని ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే దురాశతో ఉంటాడు శివకుమార్ కవల సోదరుడైన ఆత్రేయ (సూర్య). వాచ్ యాక్టివేట్ అయిన వెంటనే ఆ వాచ్ ని దక్కించుకోవడానికి శివకుమార్, అతని భార్య ప్రియను బంధిస్తాడు. అప్పటికే వాచ్ ని ఓ బాక్స్ లో పెట్టి తన కొడుకు పక్కన పెట్టేసి ఉంటాడు శివకుమార్. ఆత్రేయకు ఈ విషయం తెలుస్తుంది. దాంతో ప్రియను చంపేస్తాడు. శివకుమార్ ని చంపేలోపు తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి ఎస్కేస్ అవుతాడు శివకుమార్. ఆత్రేయ వదలకుండా శివకుమార్ వెంటపడతాడు. ఆ ఛేజింగ్ లో ట్రైన్ ఎక్కిన శివకుమార్ తన చిన్న కొడుకును సత్యభామ (శరణ్య) చేతిలో పెట్టి కాపాడమని చెబుతాడు. అదే ట్రైన్ ఎక్కిన ఆత్రయే చిన్న పిల్లాడు శివకుమార్ చేతిలో లేకపోవడంతో అతనిని చంపేస్తాడు. అదే సిట్యువేషన్ లో ప్రమాదానికి గురైన ఆత్రేయ తన కాళ్లను పోగొట్టుకుని వీల్ ఛైర్ కి పరిమితమవ్వడంతో పాటు 26 యేళ్ల పాటు కోమాలో ఉండిపోతాడు. కట్ చేస్తే...


సత్యభామ దగ్గర శివకుమార్ కొడుకు మణి (సూర్య) పెరిగి పెద్దవాడవుతాడు. వాచ్ లను రిపేర్ చేస్తుంటాడు. ఓ రోజు తనకు దొరికిన తాళం చెవితో, చిన్నప్పట్నుంచి తన దగ్గర ఉన్న బాక్స్ ని ఓపెన్ చేస్తాడు మణి. ఆ బాక్స్ లో వాచ్ ఉంటుంది. ఆ వాచ్ కి కాలాన్ని నియంత్రించగల శక్తి ఉందని తెలుసుకుంటాడు మణి. మరోవైపు 26యేళ్ల తర్వాత కోమాలోంచి బయటికి వచ్చిన ఆత్రేయ తన మిత్రుడు మిత్ర సహాయంతో వాచ్ కోసం వెతుకులాట మొదలుపెడతాడు. వాచ్ ని కనిపెట్టడం కష్టమని భావించి, శివకుమార్ ప్రయోగశాలను తన వశం చేసుకుని కాలాన్ని నియంత్రించగల వాచ్ ని తయారు చేయాలని ఫిక్స్ అవుతాడు ఆత్రేయ. అందుకోసం పాత వాచ్ ల నమోనాలను తమకు తీసుకువచ్చి ఇస్తే 5కోట్ల ప్రైజ్ మనీ ఇస్తామని పేపర్లో ప్రకటింపజేస్తాడు. ఆ ప్రకటన చూసిన మణి తన దగ్గర ఉన్న వాచ్ తో ఎవరికో చాలా అవసరం ఉందని, అసలు వారెవ్వరనే విషయం తెలుసుకోవడానికి పేపర్లో ప్రకటన ఇచ్చిన కంపెనీకి వస్తాడు. అక్కడ ఆత్రేయను, మిత్రను చూస్తాడు మణి. సేమ్ టు సేమ్ తనలానే ఉన్నా ఆత్రేయను చూసి షాక్ అవుతాడు. ఆత్రేయ కూడా తనలాగా, శివకుమార్ లాగా ఉన్న మణిని చూస్తాడు. మణి దగ్గర ఉన్న వాచ్ ని దక్కించుకోవాలని డిసైడ్ అయిన ఆత్రేయ... మణి దగ్గర శివకుమార్ లా నటిస్తాడు.


మరి మణి తన తల్లిదండ్రులను చంపింది ఆత్రేయ అన్న విషయం తెలుసుకుంటాడా... బ్రతికి ఉన్నది ఆత్రేయ అని తెలుసుకున్న మణి ఏం చేసాడు. తన గతాన్ని తెలుసుకున్న తర్వాత తన తండ్రి కనిపెట్టిన వాచ్ తో మణి ఏం చేసాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
శివకుమార్, ఆత్రేయ, మణి.. ఈ మూడు పాత్రల్లో నటించిన సూర్య తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఇప్పటిదాకా హీరో పాత్రలను చేసిన సూర్య, ఈ సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రను చేసాడు. ఈ పాత్ర ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప, మిగతా సన్నివేశాల్లో వీల్ చైర్ కే పరిమితమవుతుంది. అయినా సరే తను క్రూరమైన విలన్ అనే భావనను ఎక్స్ ప్రెషన్స్ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు సూర్య. సైంటిస్ట్ శివకుమార్ గా కూడా ఓ డిఫరెంట్ గెటప్ తో, సాఫ్ట్ మెంటాలిటీ వ్యక్తిగా చక్కగా నటించాడు. 26 యేళ్ల కుర్రాడు మణిగా కూడా సూర్య చక్కగా ఒదిగిపోయాడు. ప్రియ పాత్రలో నిత్యామీనన్ బాగా నటించింది. తన కళ్లముందు తన భర్తను హింస్తుంటే ఓ భార్యగా తను పడే తపన, తమ పిల్లాడిని కాపాడుకోవాలనే తాపత్రయం, భయం...అన్ని ఎక్స్ ప్రెషన్స్ ని అద్భుతంగా పలికించి మరోసారి తన సత్తా చాటుకుంది. సమంత క్యారెక్టర్ కి పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. పాటల్లో చాలా గ్లామర్ గా ఉంది సమంత. ఆత్రేయ ఫ్రెండ్ మిత్రగా అజయ్ బాగున్నాడు. పెళ్లి చేసుకోకండానే, ఇచ్చిన మాట కోసం ఓ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసిన తల్లిగా శరణ్య అద్భుతమైన నటనను కనబర్చింది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేయాలనే తాపత్రయం ఉన్న డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ ని తీసుకుని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో సినిమాని తెరకెక్కించాడు విక్రమ్ కుమార్. కొన్ని సెంటిమెంట్ సీన్స్ ని బాగా వర్కవుట్ చేసాడు. లవ్ సీన్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఏ.ఆర్.రహమాన్ అందించిన పాటలు బాగున్నాయి. కానీ పదే పదే వినాలనేంతగా అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. కథకు కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చి నిర్మాతగా సూర్య కాంప్రమైజ్ అవ్వడు అనిపించేలా సినిమా ఉంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
కాలాన్ని కాసేపు ఆపగలిగితే... అనే థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక ఏకంగా కాలాన్ని నియంత్రించగలిగితే మనిషి జీవితంలో ఏం చేయగలడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ శక్తి చెడ్డవాడికి ఉంటే ప్రపంచాన్నే గుప్పెట్లో పెట్టుకుని ఆడించగలడు. ఈ థాట్ తోనే డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాని మలిచారు. అద్భుతమైన కాన్సెఫ్ట్. రొటీన్ కి భిన్నంగా ఉండే ఇలాంటి స్టోరీ లైన్స్ ని విజువల్ గా తెరపై చూస్తుంటే చాలా థ్రిల్ అనిపిస్తుంది. ఈ థ్రిల్ ని ఆడియన్స్ కి కలిగించాలనే ఉద్ధేశ్యంతో విక్రమ్ కుమార్, సూర్య ఈ చిత్రాన్ని అటెంప్ట్ చేసారు. లాజిక్ లు వెతక్కుండా సినిమాని చూస్తే నిజంగా థ్రిల్ గానే ఉంటుంది. కానీ లాజిక్స్ వెతుక్కుంటూ, సినిమాని చూస్తే ఎంజాయ్ చేయలేరు. సూర్య నటన, కాన్సెఫ్ట్, స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. కాలాన్ని నియంత్రిస్తే బాగుంటుందనే ఆలోచన అందరికీ వస్తుంది. ఆ ఆలోచనకు ఓ రూపకల్సన ఇచ్చి చేసిన సినిమా కాబట్టి, ప్రతి ఒక్కరూ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !