చిత్రం - 2 అవర్స్ లవ్
నటీనటులు - శ్రీ పవార్, క్రితి గార్గ్, తనికెళ్ల భరణి, అశోక్ వర్ధన్, నర్సింగ్ యాదవ్ తదితరులు
సంగీతం - గ‌్యాని సింగ్
సినిమాటోగ్రఫర్ - ప‌్రవీణ్ వనమాలి
ఎడిటర్ - శ్యాం వడవల్లి
నిర్మాతలు - శ‌్రీనిక క్రియేటివ్ వర్క్స్
దర్శకత్వం - శ‌్రీపవార్
శ్రీ పవార్, కృతి గర్గ్ హీరోహీరోయిన్ గా శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా '2 అవర్స్ లవ్'. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విదంగా తెలుసుకుందాం.
కథ
దొంగతనం కోసం ఓ ఇంటికి వెళ్లిన దొంగ (అశోక్) కి అక్కడ ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో ఓ ప్రేమకథ రాసి ఉంటుంది. ఆ ప్రేమకథ అదిత్ (శ్రీపవార్), నయనా (కృతి గర్గ్) లకు సంబంధించింది. ఆ కథతో ఓ పుస్తకం రాస్తాడు ఆ దొంగ. మార్కెట్లోకి విడుదలైన ఆ పుస్తకానికి విపరీతమైన క్రేజ్ వస్తుంది. రెండు గంటలు మాత్రమే ప్రేమించుకుందామనే కండీషన్ తో అదిత్, నయనా ల ప్రేమకథ సాగుతుంది. అసలు రెండు గంటలు మాత్రమే ప్రేమించుకోవాలనే కండీషన్ ఎందుకు పెట్టడం జరిగింది. ఆ కండీషన్ ఎవరు పెట్టారు. మరి ఆ కండీషన్ ప్రకారం రెండు గంటలు మాత్రమే అదిత్, నయనాలు ప్రేమించుకున్నారా... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పర్ ఫామెన్స్...
అదిత్య పాత్రలో శ్రీ పవార్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. పెర్ ఫామెన్స్ పరంగా వావ్ అనిపించాడు. శ్రీ పవార్ కి ఫస్ట్ సినిమా అయినప్పటికీ అలాంటి ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ఎనర్జిటిక్ గా నటించాడు. రొమాంటిక్ సీన్స్ లో అతని నటన యూత్ ని కట్టిపడేస్తుంది. నయనా పాత్రలో కృతి అద్బుతంగా నటించింది. ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ లో బాగా నటించింది. దొంగ క్యారెక్టర్ చేసిన అశోక్ పాత్ర ఆడియన్స్ కి చాలా రిలీఫ్ ఇస్తుంది. అక్కడక్కడా ఈ పాత్ర ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
టెక్నీకల్ గా...
ఫస్ట్ టైమ్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు శ్రీ పవార్. ఇంట్రస్టింగ్ పాయింట్ ని తీసుకుని ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా సినిమాని తెరకెక్కించడంలో శ్రీ పవార్ సక్సెస్ అయ్యాడు. రొమాంటిక్ సీన్స్ ని చక్కగా డీల్ చేసాడు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లై హైలైట్ గా నిలుస్తుంది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
కండీషనల్ లవ్ స్టోరీస్ చాలా ఎంజాయ్ బుల్ గా ఉంటాయి. ఇంట్రస్టింగ్ గా ఆ లవ్ ని స్టోరీ తెరకెక్కిస్తే, యూత్ ని చాలా ఈజీగా ఈ సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చెయ్యొచ్చు. డైరెక్టర్ శ్రీ పవార్ ఈ మ్యాజిక్ నే '2 అవర్స్ లవ్' కి అప్లై చేసాడు. ఓ అమ్మాయి తన డైలీ టైం టేబుల్ ని చెప్పేసి, తను ఖాళీగా ఉండే 2 గంటలు మాత్రమే ప్రేమించుకోవడానికి కేటాయిస్తే, ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయి ఎలాంటి సిట్యువేషన్స్ ని ఫేస్ చేస్తాడు... ఈ పాయింట్ ని చాలా బాగా తెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్. డైలాగ్స్ బాగా కుదిరాయి. సాంగ్స్ లో లిప్ లాక్ సీన్స్ యూత్ ని కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ యూత్ ని ఆకట్టుకుంటాయి. లవ్ స్టోరీస్ కి యూత్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమాకి కూడా యూత్ సపోర్ట్ పక్కాగా ఉంటుంది.
ఫైనల్ గా చెప్పాలంటే ... ఈ వీకెండ్ ని ఈ లవ్ స్టోరీతో ఎంజాయ్ చెయ్యొచ్చు. సో... డోంట్ మిస్ ఇట్.
ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5