View

Biryani Review

Friday,December20th,2013, 11:26 AM

నటీనటులుః కార్తీ, హన్సిక, నాజర్, ప్రేమ్ జీ అమరన్, రాంకీ తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: శక్తి శరవణన్,నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం : వెంకట్ ప్రభు

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ తదితర చిత్రాల ద్వారా తెలుగులో కార్తీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 'బిర్యానీ' అంటూ స్పైసీ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. హైదరాబాద్ 'బిర్యానీ' ఎంత బాగుంటుందో ఈ సినిమా అంతే బాగుంటుందని చెప్పుకుంటూ వచ్చాడు. మరి.. ఈ సినిమా ఆ మాటలను నిజం చేసే విధంగా ఉందా? ఈ తమిళ హీరో మరోసారి తెలుగు ప్రేక్షకులతో 'భేష్' అనిపించుకుంటాడా? అనే విషయాల్లోకి వెళదాం.

కథః కార్తీ (సుధీర్), అతని స్నేహితుడు పరసు (ప్రేమ్జీ అమరన్) ఓ ట్రాక్టర్ కంపెనీలో పని చేస్తుంటారు. అదే కంపెనీలో సుధీర్ బావ పని చేస్తుంటాడు. సుధీర్ ఓ ప్లేబోయ్. ఎలాంటి అమ్మాయిని అయినా పడగొట్టేసే సత్తా ఉన్న కుర్రాడు. టీవీ చానల్ రిపోర్టర్ ప్రియాంక (హన్సిక)తో ప్రేమలో పడతాడు సుధీర్. జీవితం హాయిగా సాగుతున్న సమయంలో అనుకోని విధంగా సుధీర్, అతని స్నేహితుడు ఓ కేసులో ఇరుక్కుంటారు. బిర్యానీ తిందామని ఓ రెస్టారెంట్కి వెళ్లే ఈ ఇద్దరూ సెక్సీ లేడీ (మాండ్యా) వలలో చిక్కుకుంటారు. ఆమెతో పాటు ఓ రాత్రంతా హోటల్ రూమ్లో ఉండే ఈ ఇద్దరూ పీకల దాకా తాగుతారు. ఉదయం మత్తు వదిలి నిద్ర లేచేసరికి ఓ హత్య, కిడ్నాప్ కేసులో ఇరికించబడతారు. అసలు మాండ్యకి, ఈ స్నేహితులిద్దరికీ సంబంధం ఏంటి? ఈ ఇద్దరి మీద కుట్ర పన్నిన వరదరాజులు (నాజర్), వెంకటకృష్ణ (రామ్కీ) ఎవరు? సుధీర్ని ఎందుకు పావులా వాడుకున్నారు? తాము దోషి అని నిరూపించుకోవడానికి సుధీర్ ఏం చేశాడు? తదితర అంశాలతో ఈ కథ సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ

ఈ కథ బాగుంది. కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఈ కథకు హీరోగా కార్తీ అయితేనే యాప్ట్ అనిపిస్తుంది. సుధీర్ పాత్రను అంత బాగా చేశాడు కార్తీ. అమాయకత్వం, వినోదం, రొమాన్స్, యాక్షన్.. అన్నిటినీ చక్కగా పండించాడు. హన్సిక పాత్ర గ్లామర్కే పరిమితమైంది. ఇక, ఇతర పాత్రలు కథని నడిపించడానికి ఉపయోగపడ్డాయి. నాజర్, రామ్కీ తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు. శశాంక్ అందించిన మాటలు ఓ ఎస్సెట్.యువన్ శంకర్ రాజా అందించిన పాటలు మామూలుగా ఉన్నాయి. కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. శక్తి శరవణన్ కెమెరా పనితనం చెప్పుకోదగ్గ విధంగా ఉంది. నిర్మాణ విలువలు మెచ్చుకోదగ్గ విధంగా ఉన్నాయి. కథను ఆసక్తకికరమైన మలుపులతో మలిచాడు దర్శకుడు. అతని టేకింగ్ బాగుంది. మాండ్యా ఉన్న సన్నివేశాలు స్పైసీగా ఉన్నాయి. ఈ చిత్రానికి ఓ మంచి మసాలా దినుసు మాండ్యా పాత్ర. కథలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలున్నా, సినిమా బోర్ కొట్టకుండా సాగుతుంది కాబట్టి అదేం మైనస్ కాదు. ఇది నిస్సందేహంగా టైమ్ పాస్ 'బిర్యానీ'. నిక్షేపంగా ఆస్వాదించవచ్చు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !