View

రాక్షసుడు మూవీ రివ్య్వూ

Friday,May29th,2015, 01:28 PM

చిత్రం - రాక్షసుడు
నటీనటులు - సూర్య, నయనతార, ప్రణీత, ప్రేమజీ అమరన్, పార్తీపన్, సముద్రఖని తదితరులు
సంగీతం - యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ - ఆర్.డి.రాజశేఖర్
ఎడిటింగ్ - ప్రవీణ్ కె.యల్
సమర్పణ - జ్ఞానవేల్ రాజా
నిర్మాతలు - మిరియాల రాజబాబు (కృష్ణారెడ్డి), మిరియాల రవిందర్ రెడ్డి
దర్శకత్వం - వెంకట్ ప్రభు
విడుదల తేదీ - 29.5.2015

'గజని'లాంటి హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య ఆ తర్వాత 'యముడు' చిత్రంతో మరింత దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత సూర్య హీరోగా రూపొంది తెలుగులో డబ్ అయిన 'సికందర్' తదితర చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. తెలుగులో మంచి మార్కెట్ కైవసం చేసుకోవాలనుకుంటున్న సూర్యకు నిరాశ తప్పలేదు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన చిత్రం 'మాస్ ఎన్ గిర మాసిలామణి'. ఈ చిత్రాన్ని తెలుగులో 'రాక్షసుడు' టైటిల్ తో డబ్ చేసారు. ఈ చిత్రం తన కెరియర్ కి మంచి మలుపు అవుతుందనే నమ్మకంతో సూర్య ఉన్నాడు. తమిళ్, తెలుగు భాషల్లో ఒకసారి ఈ చిత్రం విడుదలయ్యింది. తను ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ చేసానని, ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని సూర్య ఈ సినిమా ప్రమోషన్ లో చెప్పుకుంటూ వచ్చారు. మరి సూర్య చెప్పినట్టు ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉందానే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥
మధుసూదన్ అలియాస్ మాస్ (సూర్య), అతని స్నేహితుడు (ప్రేమ్ జీ అమరన్) కలిసి చిన్న చిన్న మోసాలు చేస్తూ బ్రతుకుతుంటారు. ఓ సిట్యువేషన్ లో బైక్ పై తప్పించుకుని పారిపోతున్న మాస్ యాక్సిడెంట్ కి గురవుతాడు. ఆ యాక్సిడెంట్ లో మాస్ రెండు సెకన్ల పాటు చచ్చిపోయి, మళ్లీ బ్రతుకుతాడు. అప్పట్నుంచి మాస్ కి ఆత్మలు తారసపడుతుంటాయి. వాటి సమస్యలను తీర్చమని కూడా మాస్ ని ఆత్మలు కోరతాయి. ఇలాంటి సందర్భంలో మాల (నయనతార)ని ప్రేమిస్తాడు మాస్. అలాంటి సమయంలో మాస్ జీవితంలోకి శివకుమార్ (సూర్య) ఎంట్రీ ఇస్తాడు. దాంతో మాస్ కి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలేంటీ... వాటిని మాస్ ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్రం కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్
సూర్య ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేస్తాడన్న విషయం అతని గత చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమాలో రెండు పాత్రల్లో సూర్య అద్భుతంగా నటించాడు. రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేసాడు. శివకుమార్ పాత్రలో సూర్య చాలా స్టైలిష్ గా ఉన్నాడు. సెకండాఫ్ లోని ఎమోషనల్ సీన్స్ లో సూర్య నటన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.నయనతార బాగుంది కానీ, నటించడానికి స్కోప్ లేదు. ప్రణీతది నిడివి తక్కువ పాత్ర అయినప్పటికీ సినిమాకి కీలకం. తన పాత్ర పరిధి మేరకు నటించింది. పార్తీపన్, సముద్రఖని మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
వెంకట్ ప్రభు ఎంపిక చేసుకున్న కథ ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో చేయాల్సిన కథ కాదు. అయినా సరే స్ర్కీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఆసక్తిగా ఉండేది. హారర్ కామెడీ ఫార్మూలా సినిమా అయినప్పటికీ, రివేంజ్ డ్రామా ఎక్కువ అవ్వడంతో కాస్త గందరగోళం అనిపిస్తుంది. ఆత్మల ఘోష ఎక్కువ్వవడం కూడా విసుగు తెప్పిస్తుంది. యువన్ శంకర్ రాజా ట్యూన్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేసాడు. స్మశానంలో సాంగ్, ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్. రాజశేఖర్ ఫోటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ పెట్టడం వల్ల నిర్మాణపు విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఓ చిన్న పాయింట్ ని తీసుకుని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో సినిమా చేయడం వెంకట్ ప్రభు స్టైల్. ఈ సినిమాని అలానే ప్లాన్ చేసాడు. పక్కాగా వెంకట్ ప్రభు ఫార్మూలా సినిమా ఇది. సినిమా ఆరంభమైన తర్వాత ముఫై నిముషాల పాటు పాత్రలను పరిచయం చేసిన విధానం, ఆసక్తికరమైన సీన్స్ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో శివకుమార్ పాత్రను పరిచయం చేయడంతో ఆడియన్స్ థ్రిల్ కి గురవుతారు. మాస్, శివకుమార్ రిలేషన్ షిప్ ని ప్రేక్షకులు ఊహించలేరు. ఆ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుంది. సెకండాఫ్ వచ్చే మూడు, నాలుగు సిట్యువేషన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. 5నిముషాల పాటు వచ్చే బ్రహ్మానందం ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తుంది. కామెడీ, ట్విస్ట్ లు, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్... ఇలా అన్నిమసాలాలను దట్టించడంతో దర్శకుడు పూర్తిగా సఫలీకృతులయ్యారు. కాబట్టి సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. ఈ సినిమా ఈ మధ్య కాలంలో విడుదలైన 'వారధి' సినిమాని తలపిస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ, సినిమాకి చాలా కీలకమైన ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ చాలా సింపుల్ గా ఉండడం వలన కథ తేలిపోతుంది.

ఫైనల్ గా చెప్పాలంటే సూర్య నటన, సినిమా మొదలైన ముఫై నిముషాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకులను అలరిస్తాయి. ఓవరాల్ గా సినిమా బోర్ కొట్టదు కాబట్టి ఓసారి ఈ 'రాక్షసుడు'ని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !