View

జ్యోతిలక్ష్మీ మూవీ రివ్య్వూ

Friday,June12th,2015, 07:57 AM

చిత్రం - జ్యోతిలక్ష్మీ
నటీనటులు - చార్మి, సత్య, వంశీ, అజయ్ ఘోష్, ప్రియదర్శిని రామ్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం - సునీల్ కశ్యప్
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
కెమెరా - పి.జి.విందా
సమర్పణ - చార్మి
బ్యానర్స్ - సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ట్రై.లిమిటెడ్, శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్
కో-ప్రొడ్యూసర్ - బి.ఎ.రాజు
నిర్మాతలు - శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి. రావు
డైలాగ్స్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - పూరి జగన్నాథ్
విడుదల తేదీ - 12.6.2015

 

మాస్ పల్స్ పూరి జగన్నాథ్ కి బాగా తెలుసు. అందుకే, ఆ తరహా చిత్రాలు తీసి, బాక్సాఫీస్ పరంగా 'మంచి పైసా వసూల్' డైరెక్టర్ అనిపించుకున్నాడు. సినిమా తీసే నిర్మాత, కొనుక్కనేవాళ్లు కోరుకునేది లాభాలే కాబట్టి, పూరి జగన్నాథ్ వాళ్ల పాలిట బంగారు బాతు అనే చెప్పాలి. ఎందుకంటే, ఏళ్ల తరబడి సినిమాలు తీయడు. నిర్మాతతో డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెట్టించడు. దాదాపు సేఫ్ ప్రాజెక్ట్ చేస్తాడు పూరి. ఎప్పుడో 45 ఏళ్ల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'జ్యోతిలక్ష్మి' నవల ఆధారంగా సినిమా తీయాలన్నది పూరి 25 ఏళ్ల కల. అంటే.. అతను ఎంతగా ఈ కథను ఇష్టపడి ఉంటాడో ఊహించచ్చు. పూరి అంతగా ఇష్టపడిన 'జ్యోతిలక్ష్మీ' సినిమాలో టైటిల్ రోల్ చేసి, నిర్మించింది చార్మి. నిర్మాతగా ఈ ముద్దుగుమ్మకు ఇది మొదటి సినిమా. నటిగా ఎప్పుడో ప్రూవ్డ్. మరి.. నిర్మాతగా చార్మీకి ఆర్థికంగా ఎలాంటి అనుభవం మిగులుతుంది? కో-ప్రొడ్యూసర్ బీఏ రాజు, మరో నలుగురు నిర్మాతలు ఆర్థిక లాభాలు చవి చూసే విధంగా ఈ చిత్రం ఉంటుందా?..

 

 

 

à°•à°¥
జ్యోతిలక్ష్మీ (చార్మి) ఫేమస్ ఫిగర్. నారాయణ పట్వారి (అజయ్ ఘోష్) ఆధ్వర్యంలో నడుస్తున్న గంగూభాయ్ వ్యభిచార కంపెనీలో జ్యోతిలక్ష్మీ వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తుంటుంది. ఆమె కోసం వెతుక్కుంటూ ఆ వ్యభిచార గృహానికి వస్తాడు సత్య (సత్య). జ్యోతిలక్ష్మీ కోసం రోజూ డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యభిచార గృహానికి వస్తున్న సత్య ఆమెను కనీసం తాకనైనా తాకకుండా, తనను ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జ్యోతిలక్ష్మీ లైట్ తీసుకుంటుంది. కానీ అతను ఆమె వెనకాలే పడి, ఆ వ్యభిచార గృహం నుంచి బయటికి వచ్చేయమని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో క్రేజ్ తో జ్యోతిలక్ష్మీ అంగీకరిస్తుంది. ఓ రోజు తన ఫ్రెండ్ సహాయంతో జ్యోతిలక్ష్మీని వ్యభిచార గృహం నుంచి బయటికి తీసుకువస్తాడు సత్య. వ్యభిచార గృహం నడుపుతున్న వారు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. తన అక్క అంగీకారం, పోలీసుల అండతో జ్యోతిలక్ష్మీని పెళ్లి చేసుకుంటాడు సత్య.
అసలు వ్యభిచారి అయిన జ్యోతిలక్ష్మీని వెతికి పట్టుకుని మరీ సత్య ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న జ్యోతిలక్ష్మీని నారాయణ పట్వారి మనుషులు సుఖంగా కాపురం చేసుకోనిస్తారా? తనలాగే వ్యభిచారంలో అడుగుపెట్టిన ఎంతోమంది అమ్మాయిలను నారాయణ పట్వారి కబంధ హస్తాల నుంచి జ్యోతిలక్ష్మీ ఎలా బయట పడేసింది? ఆమెకు సత్య ఏ విధంగా అండగా నిలిచాడు? అనేదే ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రం మొత్తం జ్యోతిలక్ష్మీ పాత్ర పైనే సాగుతుంది. ఈ పాత్రలో నటన పరంగా చార్మి విజృంభించింది. ఒక వేశ్య శారీరక భాష ఎలా ఉంటుంది? వాళ్ల హావభావాలు ఎలా ఉంటాయి? అనేది అద్భుతంగా ఆవిష్కరించింది. చూడచక్కగా కూడా ఉంది. ఓ వేశ్యగా మగవాణ్ణి రెచ్చగొట్టే సన్నివేశాల్లో ఎంత బాగా నటించిందో, ప్రత్యర్థులను రఫ్ఫాడించడానికి బైక్ మీద వెళ్లడం, వాళ్లని తుక్కు తుక్కుగా చితకబాదడం.. వంటి సన్నివేశాల్లోనూ చార్మి అంతే బ్రహ్మాండంగా నటించింది. పోలీసాఫీసర్ పాత్ర చేసిన ప్రియదర్శిని రామ్ ఆ పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు చేసిన సత్య ఈ చిత్రంలో హీరో రోల్ చేసాడు. హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. నటనపరంగా భేష్ అనిపించుకున్నాడు. సత్యకి మంచి భవిష్యత్తు ఉంది. ఇతర పాత్రలు చేసిన అజయ్ ఘోష్, బ్రహ్మానందం తదితరులు తమ నటన ద్వారా కథ నడిపించడానికి ఉపయోగపడ్డారు. పెద్దగా గుర్తింపు లేని తారలు కూడా ఈ చిత్రంలో నటించారు. వాళ్లు కూడా గుర్తుండిపోతారు.


సాంకేతిక వర్గం
మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా పూరి ఈ చిత్రం తీశాడు. స్ర్కీన్ ప్లే బాగా రాసుకున్నాడు. కథకు తగ్గట్టు షాట్ అండ్ స్వీట్ డైలాగ్స్ రాశాడు. టెక్నీషియన్ గా మరోసారి మెరిశాడు పూరి. సునిల్ కశ్యప్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. 'జ్యోతిలక్ష్మి...' పాట మాత్రమే కాదు.. మిగతా పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పీజీ విందా కెమెరా పనితనం సూపర్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఓ వేశ్య కథ చుట్టూ తిరిగే చిత్రం ఇది. మామూలుగా ఇలాంటి కథలంటే చూడలేని సన్నివేశాలు, భరించలేని సంభాషణలు ఉంటాయని చాలామంది ఊహిస్తారు. కానీ, స్టార్టింగ్ టు ఎండింగ్ అలాంటి సీన్స్ కానీ, సంభాషణలు లేకపోవడం ఓ రిలీఫ్. 'జ్యోతిలక్ష్మీ' కథను చాలా హుందాగా తెరకెక్కించినందుకు పూరీని అభనందించాలి. వేశ్యను పెళ్లాడాలని యువకుడు ఎందుకు అనుకున్నాడు? అనే విషయాన్ని చూపించే, ఫ్లాష్ బ్యాక్ టచింగ్ గా ఉంది. అలాగే, సెక్స్ రాకెట్ గ్రూప్ ని చార్మి ఎదిరించే సన్నివేశాలు చాలా బాగున్నాయి. 'ఆడదాని పరువు తీస్తారు... మగవాడి పరువు దాస్తారు..', 'మల్టీస్టారర్ ని మడతపెట్టి మీ మంచం మీదకి తీసుకురాలేను'..., 'మగవాడి ఫెయిల్యూర్ వల్లే ఆడవాళ్లు...' వంటి సంభాషణలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అక్కడక్కడా రిలీఫ్ గా సాగుతూ, అప్పుడప్పుడూ కంట తడిపెట్టిస్తూ.. ఇలా రకరకాల ఎమోషన్స్ కి గురి చేస్తూ సినిమా సాగుతుంది. ఫస్టాప్ చాలా బాగుంది. సెకండాఫ్ లో ఎక్కడో డ్రాప్ అవుతుందేమో అనిపించే సమయానికి ఓ మంచి సీన్ వచ్చి, సినిమా పుంజుకుంటుంది.
ఫైనల్ గా చెప్పాలంటే.. చార్మీని నమ్మి పూరీ ఆమెకు నిర్మాణ బాధ్యతలన్నీ అప్పజెప్పాడు. పూరీ మీద నమ్మకంతో అతనితో సినిమా నిర్మించింది చార్మి. ఈ ఇద్దరి నమ్మకాలూ వమ్ము కావు. 'జ్యోతిలక్ష్మీ' పూరీ మార్క్ పైసా వసూల్ సినిమా.. డౌట్ లేకుండా చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !