View

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మూవీ రివ్య్వూ

Friday,June19th,2015, 08:30 AM

చిత్రం - కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
నటీనటులు - సుధీర్ బాబు, నందిత, గిరిబాబు, పోసాని కృష్ణమురళి, చైతన్య కృష్ణ, అభిజీత్, ప్రగతి తదితరులు
సంగీతం - హరి
మాటలు: మహమ్మద్ ఖదీర్ బాబు
సినిమాటోగ్రఫీ - కె.యస్.చంద్రశేఖర్
ఎడిటింగ్ - రమేష్ కొల్లూరి
నిర్మాత - శ్రీమతి, శ్రీ లగడపాటి శిరీషాశ్రీధర్
రచన, దర్శకత్వం - ఆర్.చంద్రు
విడుదల - 19.6.2015

'సినిమా తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. సినిమా తీస్తుంటే నేను దాన్నే పెద్ద పండగలా ఫీలవుతాను' అని లగడపాటి శ్రీధర్ చెబుతుంటారు. సినిమాలంటే ఆయనకెంతో మమకారం. తన సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలనుకుంటారాయన. ఇక, అప్ కమింగ్ హీరో సుధీర్ బాబుకి కూడా సినిమాలంటే చాలా ప్రేమ. వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. సినిమాలంటే పేషన్ ఉన్న లగడపాటి, సుధీర్ బాబు.. ఈ ఇద్దరి కాంబినేషన్లో కన్నడంలో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'చార్మినార్'కి ఇది రీమేక్. మరి.. ఇక్కడ కూడా ఈ చిత్రం విజయవిహారం చేస్తుందా? టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ఖాతాలో మరో హిట్ చేరుతుందా? ఇందులో మూడు కోణాలున్న పాత్రను చేసిన సుధీర్ బాబు నటుడిగా భేష్ అనిపించుకుంటాడా? చూద్దాం.


à°•à°¥
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయిన కృష్ణ (సుధీర్ బాబు)కు తన స్కూల్ మేట్స్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలుసుకోబోతున్నామని చెప్పి, తప్పకుండా రావాలని కృష్ణను ఫ్రెండ్స్ ఇన్వయిట్ చేస్తారు. తప్పకుండా వస్తానని ఫ్రెండ్స్ దగ్గర చెబుతాడు కృష్ణ. తన సొంత ఊరు కృష్ణాపురం, స్కూల్ ఫ్రెండ్స్, చదువు నేర్పిన గురువులను కలుసుకోబోతున్నాననే సంతోషంలో ఉన్న కృష్ణ... తను జీవితంలో ఓ టార్గెట్ తో ముందుకెళ్లేలా చేసిన తన ప్రేయసి రాధ (నందిత)ను కలుసుకోబోతున్నాననే ఎగ్జయిట్ మెంట్ తో అమెరికా నుంచి ఇండియా బయలుదేరతాడు కృష్ణ. విజయవాడ చేరుకున్న కృష్ణ ఫ్య్లాష్ బ్యాక్ లోకి వెళతాడు.


స్కూల్ లో తన క్లాస్ మేట్ అయిన రాధ అంటే కృష్ణకు చాలా ఇష్టం. రాధను ఇంప్రెస్ చేయడానికి బాగా చదువుకుంటాడు. ఆ ఇష్టం పెరిగి, ప్రేమగా మారుతుంది. స్కూలింగ్ అయిపోయి కాలేజ్ లోకి వచ్చిన కృష్ణ తన ప్రేమను ఓ లెటర్ రూపంలో రాసి రాధకు ఇస్తాడు. ఆ లెటర్ రాధ తల్లికి అందుతుంది. ఆమె కాలేజ్ ప్రిన్సిపాల్ కి కంఫ్లయింట్ ఇస్తుంది. దాంతో జీవితంలో స్థిరపడిన తర్వాతే ప్రేమ, పెళ్లి అని ప్రిన్సిపాల్ చెప్పడంతో చదువుపై దృష్టి సారించి ఇంజనీరింగ్ లో చేరాలనే టార్గెట్ తో ముందుకుదూసుకెళతాడు. ఆ రకంగా రాధకు కొంచెం దూరమైనప్పటికీ, మానసికంగా రాధకు చాలా దగ్గరగా ఉంటాడు. ఇంజనీరింగ్ చదవడం కోసం హైదరాబాద్ వెళతాడు కృష్ణ. హైదరాబాద్ లోనే ఉమెన్స్ కాలేజ్ లో ఉంటున్న రాధను ఒకటి, రెండుసార్లు కలుస్తాడుగానీ, తన ప్రేమ విషయం చెప్పడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే చెప్పాలనుకుంటాడు. చదువు పూర్తయిపోయి జాబ్ లో జాయిన్ అయిన కృష్ణకు అమెరికా వెళ్లే ఆఫర్ వస్తుంది. అప్పుడు రాధకు తన ప్రేమను తెలియజేయాలని తమ ఊరు వస్తాడు. అప్పుడు కూడా రాధ తల్లి అడ్డం పడటంతో తన ప్రేమను తెలియజేయకుండానే అమెరికా వెళ్లిపోతాడు. స్కూల్ ఫ్రెండ్సందరం మీట్ అవ్వబోతున్నామని ఫ్రెండ్స్ ఫోన్ చేయడంతో రాధను కలుసుకుని తన ప్రేమను తెలియజేయాలనే నిర్ణయంతో అమెరికా నుంచి సొంత ఊరుకు వస్తాడు కృష్ణ.


ప్రజెంట్ లోకి వస్తే... స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్న కృష్ణ... రాధ అక్కడకు రాకపోవడంతో ఆమెను కలవలేకపోతాడు. చివరిసారిగా ఆమెను కలవాలన్న కోరికతో రాధ ఇంటికి వెళతాడు కృఫ్ఱ. రాధ పరిస్థితి చూసి షాకవుతాడు. రాధకు ఏం జరిగింది? ఆమెకు పెళ్లయ్యిందా? కృష్ణ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే మిగతా కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
కృష్ణ పాత్రను సుధీర్ బాబు అద్భుతంగా చేశాడు. నటనపరంగా సవాల్ అనిపించే పాత్ర. టీనేజ్ కుర్రాడి పాత్రలో బ్రహ్మాండంగా ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం మీసాలు తీసేశాడు. నున్నగా దువ్వుకున్న తల, సాదా సీదా బట్టలు వేసుకున్నాడు. కానీ, వేషధారణ మార్చినంత మాత్రాన థర్టీ ప్లస్ యువకుణ్ణి కుర్రాడిలా అంగీకరించేస్తామా? అతని హావాభావాలు, నడక, మాట తీరు, టీనేజ్ లో ఉండే సహజమైన అమాయకత్వం కనిపించాలి. అవన్నీ అద్భుతంగా ఆవిష్కరించాడు సుధీర్ బాబు. ఆ తర్వాత పాతికేళ్ల వయసులో ఉండాల్సిన మెచ్యుర్టీ, ఉద్యోగం చేసేటప్పుడు కనబర్చాల్సిన హుందాతనం.. అన్నింట్లోనూ భేష్ అనిపించుకున్నాడు. సుధీర్ బాబులో మంచి నటుడు ఉన్నాడని నిరూపించిన సినిమా. రాధ పాత్రలో నందిత అరవిరిసిన మందారంలా అందంగా ఉంది. అభినయం పరంగా విజృంభించే స్కోప్ పెద్దగా లేకపోయినా... ఉన్నంతలో బాగా చేసింది. సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర చేసిన విక్రమ్ సహిదేవ్ లో ఫ్యూచర్ హీరో కనిపించాడు. అలాగే, నందిత చిన్నప్పటి పాత్ర చేసిన ఆని కూడా బాగా నటించింది. గిరిబాబు, ప్రగతి, సుధ, పోసాని కృష్ణమురళి.. చిత్రంలో ఉన్న తారాగణమంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం
కన్నడ చిత్రం 'చార్మనార్'కి ఇది రీమేక్. కన్నడ వెర్షన్ కి దర్శకత్వం వహించిర చంద్రు దర్శకత్వంలోనే ఈ చిత్రం నిర్మించారు లగడపాటి శ్రీధర్. ముందు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచన లగడపాటికి రావడం అభినందనీయం. ప్రేమకు భాషతో సంబంధం లేదు కాబట్టి, ఈ ప్రేమకథ ఏ భాషలవారికైనా నప్పుతుంది. దర్శకుడు చంద్రు ఇప్పటివరకూ కన్నడంలో ఆరేడు సినిమాలు తీస్తే.. అన్నీ హిట్టే, తెలుగులో ఆయనకిది తొలి చిత్రం. తెలుగు పరిశ్రమలో ఉన్న ఉత్తమాభిరుచి గల దర్శకుల్లో ఒకరిగా చేరిపోయారు చంద్రు. ప్లాస్టిక్ నవ్వులు, కమర్షియల్ ప్రేమల జోరు ఎక్కువగా ఉన్న నేటి ప్రపంచానికి స్వచ్ఛమైన ప్రేమను చూపించారు. ఈ సినిమాకి ఓ బలం కథ, ఆ కథను తెరకెక్కించిన విధానం అయితే మరో బలం మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన సంభాషణలు. 'ప్రపంచంలో ఎవరెవర్నో ఏవేవో చేసేస్తారు.. వాళ్లు మాత్రం వాళ్లుగానే మిగిలిపోతారు'..'నమ్మకానికి కులం, మతం లేదు..', సొంత ఊరికి వెళుతూ హీరో 'నా దగ్గరకు నేను వెళుతున్నా..' వంటి పలు సంభాషణలు ఖదీర్ బాబు కలానికి ఉన్న బలాన్ని తెలియజేశాయి. ఛాయాగ్రహణం కనులకు పండగే. పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సూపర్. తొలి సినిమా 'ఎవడి గోల వాడిది' అప్పట్నుంచీ లగడపాటి శ్రీధర్ కథ ఎంత డిమాండ్ చేస్తే అంత ఖర్చు పెట్టేస్తారు. సినిమా మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. టార్చ్ వేసి వెతికినా ఇబ్బందిపడే సన్నివేశాలు కనిపించవు. సంభాషణల్లో ఎక్కడా ద్వందార్థాలు వినిపించవు. కుటుంబ సమేతంగా హాయిగా చూడొచ్చు. ప్రేమలో ఉన్నవారికి నచ్చే సినిమా. ప్రేమలో పడాలనుకునేవాళ్లకి ఆ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉండాలో చెప్పే సినిమా. విడిపోయిన ప్రేమికులకు గతాన్నిగుర్తు చేసే ప్రేమకథ. వెరసి.. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్.. అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది.


ఫైనల్ గా చెప్పాలంటే.. 'మంచి సినిమాలు రావడంలేదు' అని అంటుంటారు. ఇది మంచి సినిమానే. ఆదరిస్తారనే నమ్మకంతో లగడపాటి శ్రీధర్ తీశారు. ఈ సినిమాలో 'మన నమ్మకాన్ని కృష్ణమ్మ నిజం చేస్తుందనే' డైలాగ్ ఉంటుంది. శ్రీధర్ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేస్తే.. మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అయితే.. ఒకటి మాత్రం బలంగా చెప్పగలం.. థియేటర్ నుంచి బయటికొచ్చే ప్రేక్షకుడు 'బాగాలేదు' అని మాత్రం చెప్పలేడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !