View

వినవయ్యా రామయ్య మూవీ రివ్య్వూ

Friday,June19th,2015, 10:24 AM

బ్యానర్ - సరస్వతి ఫిలిమ్స్
నటీనటులు - నాగ అన్వేష్, కృతిక, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, యం.యస్.నారాయణ, నరేష్, రామరాజు, షకలక శంకర్, సప్తగిరి, తులసి, రమాప్రభ తదితరులు
సంగీతం - అనూప్ రూబెన్స్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ - రసూల్ ఎల్లోర్
కథ - ఎలిల్
మాటలు - సింధూరపువ్వు కృష్ణారెడ్డి, వీరబాబు బాసిన
పాటలు - రామజోగయ్య శాస్ర్తి
ఫైట్స్ - రన్ జాషూవా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కడప గోపి
నిర్మాత - సింధూరపువ్వు కృష్ణారెడ్డి
దర్శకత్వం - జి.రాంప్రసాద్

 

పాతిక, ముప్ఫయ్ ఏళ్ల క్రితం విడుదలైన చిత్రాలను ఓసారి రివైండ్ చేసుకుంటే.. 'సిందూర పువ్వు' గుర్తు రాక మానదు. రామ్ కీ, నిరోషా నటించిన ఆ ప్రేమకథా చిత్రం సూపర్ హిట్. అప్పట్లో అలాంటి మంచి చిత్రాన్ని అందించిన కృష్ణారెడ్డి ఇప్పుడు తన తనయుడు నాగ అన్వేష్ ని హీరోగా పరిచయం చేస్తూ, నిర్మించిన చిత్రవ 'వినవయ్యా రామయ్య'. జి. రాంప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నాగ అన్వేష్ కి హీరోగా ఇది తొలి చిత్రం. కానీ, బాలనటుడిగా ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు, సాహస బాలుడు విచిత్ర కోతి తదితర చిత్రాల్లో నటించాడు. బాల నటుడిగా మెరిసిన నాగ అన్వేష్ హీరోగా కూడా భేష్ అనిపించుకుంటాడా? చూద్దాం...

 

à°•à°¥
చంటి (నాగ అన్వేష్), జానకి (కృతిక) పక్క పక్క ఇళ్లలో ఉంటారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కృతిక తండ్రి చౌదరి (ప్రకాష్ రాజ్)కి కూతురు అంటే చాలా ఇష్టం. కూతురు చిన్నప్పుడే భార్యను కోల్పోయిన చౌదరి మరో పెళ్లి చేసుకోకుండా, కూతురికి తల్లిలేని లోటు తెలీనివ్వకుండా పెంచుతాడు. చిన్నప్పటి స్నేహితురాలు జానకిను పీకల్లోతు ప్రేమిస్తాడు చంటి. అయితే జానకి మాత్రం చంటిని మంచి స్నేహితుడిగానే భావిస్తుంది. చంటి తన ఫ్రెండ్స్ దగ్గర జానకి కూడా తనను ప్రేమిస్తుందని చెబుతాడు. ఈలోపు జానకికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం, ఓ సంబంధం కుదుర్చుకోవడం జరిగిపోతుంది. జానకి తనకు దూరమవుతుందన్న బాధలో ఉన్న చంటిని చూసి, ఎలాగైనా తనకు హెల్ప్ చేయాలని ఫ్రెండ్స్ అనుకుంటారు.

 

కరెక్ట్ గా పెళ్లి రోజున జానకికి మత్తు మందు ఇచ్చి పెళ్లి పీటల మీద నుంచి తీసుకువచ్చేస్తాడు చంటి ఫ్రెండ్ అలీ. మద్యం మత్తులో ఉన్న చంటిని, మత్తుగా ఉన్న జానకిని ఆ ఊరు నుంచి బయటికి తీసుకువచ్చేస్తాడు అలీ. మత్తు దిగిన జానకి తను అసలు చంటిని ప్రేమించలేదని.. పెళ్లి పీటల మీద నుంచి తీసుకువచ్చేసి నాన్న పరువు, ఇంటి పరువు తీసేసారని చంటి, అతని ఫ్రెండ్ అలీపై కోపగించుకుంటుంది. ఇంట్లో వాళ్ల కోపం చల్లారిన తర్వాత ఇంటికి తీసుకెళతామని చెప్పి కేరళలోని తన తాత ఇంటికి చంటి, జానకిని తీసుకెళతాడు అలీ.


అక్కడికెళ్లిన తర్వాత చంటి ప్రేమను జానకి అర్ధం చేసుకుందా? చిన్నప్పటి స్నేహితుడు తనకు మంచి భర్త కాగలడని తెలుసుకుందా? జానకి తండ్రి వీరి ప్రేమకు అంగీకరించాడా అనేదే ఈ చిత్ర కథ.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
చంటి పాత్రను నాగ అన్వేష్ బాగా చేశాడు. ముఖ్యంగా డాన్సులు చేసిన విధానం సూపర్. అల్లు అర్జున్ అంటే తనకిష్టం అని ఓ ఇంటర్వ్యూలో నాగ అన్వేష్ చెప్పాడు. నిజంగానే అన్వేష్ డాన్స్ చేస్తుంటే అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. అంత బాగా చేశాడు. ఎమోషన్ సన్నివేశాల్లో కూడా బాగా నటించాడు. మంచి నటుడు అనిపించుకోవాలనే తపన తనలో కనిపిస్తోంది. 'దృశ్యం'లో వెంకటేశ్ కి కూతురిగా నటించిన కృతిక ఇందులో కథానాయికగా చేసింది. కొంచెం బొద్దుగా అనిపించినా ముద్దుగానే ఉంది. నటనపరంగా ఇంకొంచె బెటర్ కావాల్సిన అవసరం ఉంది. తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ కూతురి పట్ల తన ప్రేమను అద్భుతంగా వ్యక్తపరిచారు. పైల్వాన్ పాత్రలో బ్రహ్మానందం నవ్వించారు. ఈ మధ్యకాలంలో ఆయన మూస పాత్రలకు పరిమితమవుతున్నారేమో అనే ఫీల్ కలుగుతోంది. కానీ, ఈ చిత్రంలో చేసిన పాత్ర డిఫరెంట్ గా ఉంది. అలీ, సప్తగిరి, సీనియర్ నరేశ్, తులసి తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
ఈ కథ కొత్తగా ఉంది. ఆ పరంగా దర్శకుణ్ణి అభినందించవచ్చు. కానీ, స్ర్కీన్ ప్లే బలంగా లేదు. దానివల్ల కథలో ఉన్న కొత్తదనం సరిగ్గా ఎలివేట్ కాలేదు. సంభాషణలు, పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. దాదాపు ఎంజాయ్ బుల్ గా ఉంది. సెకండాఫ్ కథ ఏదేదో మలుపులు తిరుగుతుంది. అదే మైనస్ అని చెప్పాలి. మైనస్సులు పక్కన పెడితే, కొత్త్ హీరోతో చేసిన ప్రయత్నం కాబట్టి, ఓసారి చూడొచ్చు. అచ్చ తెలుగు ఊర సినిమా ఇది. జయాపజయాల గురించి పక్కన పెడితే... నాగ అన్వేష్ హీరో మెటీరియల్ అని ప్రూవ్ చేసే సినిమా. సో.. నటనపరంగా మరింత బెటర్ అయ్యి, మంచి కథలు, పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ వెళుతూ అన్వేష్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !