View

టైగర్ మూవీ రివ్య్వూ

Friday,June26th,2015, 06:43 AM

చిత్రం - టైగర్
బ్యానర్ - ఎన్.వి.ఆర్ సినిమా
నటీనటులు - సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, తనికెళ్ల భరణి, సప్తగిరి, తాగుబోతు రమేష్, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్, సుప్రీత్, ప్రవీణ్ తదితరులు
మాటలు - అబ్బూరి రవి
కెమెరా - ఛోటా.కె.నాయుడు
సంగీతం - తమన్
ఎడిటింగ్ - ఛోటా.కె.ప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ - జి.నాగేశ్వరరావు
సమర్పణ - ఠాగూర్ మధు
నిర్మాత - ఎన్వీ ప్రసాద్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వి.ఐ.ఆనంద్

 

"భవిష్యత్తులో మరో పదేళ్ల తర్వాత నేను గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో ఖచ్చితంగా 'టైగర్' ఉంటుంది'' అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ అన్నాడు. 'టైగర్' కథను అంత నమ్మి, ఈ చిత్రం చేశాడు. సందీప్ సంగతి అటుంచితే మంచి కథలను ఎంపిక చేయడంలో నిర్మాత 'ఠాగూర్' మధు కి కూడా చక్కని జడ్జిమెంట్ ఉంది. వి.ఐ. ఆనంద్ చెప్పిన ఈ కథ నచ్చి, ఎన్వీ ప్రసాద్ తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అని, తెరకెక్కించడం అంత సులువు కాదని, దర్శకుడు ఆనంద్ బాగా తీశారని సందీప్ అన్నాడు. మరి... ప్రేక్షకులు కూడా అలానే అంటారా? ఎంతో నమ్మి, సందీప్ చేసిన ఈ చిత్రం అతని నమ్మకాన్ని నిజం చేసే విధంగా ఉందా?... తెలుసుకుందాం.

 


à°•à°¥
విష్ణును ఓ రౌడీ గ్యాంగ్ చేజ్, చేసి యాక్సిడెంట్ చేస్తారు. చావు, బ్రతుకుల మధ్య ఉన్న విష్ణును ఓ వ్యక్తి గవర్నమెంట్ హాస్పటల్లో చేర్చుతాడు. క్రిటికల్ కండీషన్ లో ఉన్న విష్ణు ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లకు ఓ ఫోన్ నెంబర్ చెప్పి స్పృహ కోల్పోతాడు. ఆ ఫోన్ నెంబర్ తన ఫ్రెండ్ టైగర్ ది. కట్ చేస్తే... (ఫ్లాష్ బ్యాక్ ) ఆరంభమవుతుంది.


టైగర్ (సందీప్ కిషన్), విష్ణు (రాహుల్ రవీంద్రన్) ఇద్దరూ అనాథలు. తనికెళ్ల భరణి ఆధ్వర్యంలో నడుస్తున్న అనాధ శరణాలయంలో ఈ ఇద్దరూ ఉంటారు. కొడుకును ఓ యాక్సిడెంట్ లో పోగొట్టుకున్న ఓ భార్య, భర్త విష్ణును దత్తత తీసుకుంటారు. విష్ణు వాళ్ల ఇంటికి వెళ్లినప్పటికీ, టైగర్ ని కలుస్తూనే ఉంటాడు. ఈ ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతారు. వీరి మధ్య స్నేహం కూడా చెదిరిపోకుండా అలానే ఉంటుంది. చిన్నప్పటి నుండి తనకన్నా కూడా తన మిత్రుడు బాగుండాలని కోరుకునే మనస్తత్వం టైగర్ ది. స్నేహితుడి కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. తనకు విష్ణు ఒక్కడుంటే చాలు... కానీ, విష్ణుకు తల్లిదండ్రులతో పాటు అన్ని బంధాలు ఉండాలని కోరుకుంటాడు టైగర్.


వారణాసికి చెందిన గంగ (సీరత్ కపూర్) ని ఓ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్ లో కలుసుకుంటాడు విష్ణు. ఆమెను ప్రేమిస్తాడు. తన కుటుంబం, ఊరు, కట్టుబాట్లు సంగతి తెలిసిన గంగ ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటుంది. కానీ విష్ణు ప్రేమలో పడిపోయిన గంగ, అతనితోనే ముందుకు సాగాలనుకుంటుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటారు. గంగ తమ ఊరు కాదు... తమ కల్చర్ కాదు... ఆమెతో పెళ్లి వద్దు... ప్రేమ వద్దు అని వారిస్తాడు టైగర్. ఓ వైపు గంగకు కూడా టైగర్ అంటే అసలు పడదు. గంగ వల్ల టైగర్, విష్ణుకు మధ్య గొడవలు జరుగుతాయి. దాంతో తనకు గంగ ముఖ్యం అని, స్నేహం వద్దని టైగర్ పై విరుచుకుపడతాడు విష్ణు. ఎప్పటికీ కలవద్దంటాడు. ఆ విధంగా టైగర్, విష్ణు విడిపోతారు. కట్ చేస్తే...


గంగ, విష్ణు ప్రేమ గురించి తెలుసుకున్న గంగ తల్లిదండ్రులు ఆమెను వారణాసి తీసుకుని వెళ్లిపోతారు. గంగ కోసం వారణాసి వెళ్లిన విష్ణు ఆమెను ఇంట్లో నుంచి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకున్న గంగ కుటుంబం విష్ణు, ఆమెను చంపేయాలనుకుంటుంది. తమను కాపాడుకునే దిశలో ఓ చోట గంగను దాచేసి, ఆ గ్యాంగ్ తో తలపడతాడు విష్ణు. ఆ ప్రయత్నంలో భాగంగానే విష్ణుకు యాక్సిడెంట్ అయ్యేలా చేస్తారు రౌడీ గ్యాంగ్. హాస్పటల్లో స్పృహ కోల్పోయేముందు ఇక తనను, గంగను టైగర్ మాత్రమే కాపాడగలడని అతని ఫోన్ నెంబర్ ఇస్తాడు విష్ణు. (ఫ్లాష్ బ్యాక్ ఎండ్).


విష్ణు హాస్పటల్లో ఉన్న సంగతి ఫోన్ ద్వారా తెలుసుకున్న టైగర్ వారణాసి వస్తాడు. విష్ణును ఎలా కాపాడుకుంటాడు? గంగతో విష్ణు పెళ్లి చేస్తాడా? గంగ కుటుంబ సభ్యుల మూర్ఖత్వానికి ఫుల్ స్టాప్ పెడతాడా? అనేదే మిగతా కథ.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
టైగర్ పాత్రను సందీప్ కిషన్ బ్రహ్మాండంగా చేశాడు. మాస్ కుర్రాడి పాత్ర ఇది. సినిమా మొదలైన 15, 20 నిమిషాల తర్వాతే సందీప్ పాత్ర తెర మీదకొస్తుంది. అప్పట్నుంచీ సినిమా చివరి వరకూ సాగే ఈ పాత్ర థియేటర్ నుంచి బయటికొచ్చాక కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అంత అద్భుతంగా చేశాడు సందీప్. తనలో మంచి నటుడు ఉన్నాడని ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. రాహుల్ రవీంద్రన్ నటన కూడా గుర్తుండిపోతుంది. తన టాలెంట్ ని పూర్తిగా ఆవిష్కరించుకునే అవకాశం ఇప్పటివరకూ రాహుల్ కి రాలేదనే ఫీల్ ని ఈ చిత్రంలోని పాత్ర కలగజేస్తుంది. ముఖ్యంగా బలహీనంగా కొట్టుకున్న నాడితో కొన ఊపిరితో ఉన్న సన్నివేశాల్లో రాహుల్ కనురెప్ప వాల్చకుండా నటించిన వైనం బాగుంది. సీరత్ కపూర్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి, భేష్ అనిపించుకుంది. సప్తగిరి, తాగుబోతు రమేష్ నవ్వించారు. తనికెళ్ల భరణి నటన గుర్తుండిపోతుంది. ఓవరాల్ గా చిత్రంలో ఉన్న తారలంతా బాగా నటించారు.

 

సాంకేతిక వర్గం
ఒక డిఫరెంట్ స్టోరీతో ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్ర్కీన్ ప్లే పకడ్బందీగా ఉంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులు కదలకుండా చూసేంత బలమైన స్ర్కీన్ ప్లే. ఆనంద్ లో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించిన చిత్రం. అబ్బూరి రవి కలం మెరిసింది. సంభాషణలు చాలా బాగున్నాయి. ఛోటా కెమెరా పనితనం సుపర్బ్. వారణాసి ప్రాంతాన్ని, రాజమండ్రి నగరాన్ని తన కెమెరాలో అద్భుతంగా చూపించారు. తమన్ స్వరపరచిన పాటలు ఓకే. ఎడిటింగ్ బాగుంది. సినిమా ఎక్కడా ల్యాగ్ లేకుండా సాగుతుంది.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇలాంటి కథను ఎంపిక చేసుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే, ఏ మాత్రం తేడాగా తీసినా ఘోరపరాజయంపాలవుతుంది. కానీ, దర్శకుణ్ణి నమ్మ సందీప్ ఈ కథను ఎంపిక చేసుకున్నాడు. పైగా సినిమాలో తన పాత్ర మొదలయ్యేది దాదాపు 20 నిమిషాల తర్వాతే. హీరోయిన్ కూడా లేదు. డ్యుయెట్స్ లేవు. 'పాథ్ బ్రేకింగ్' అంటారు.. ఈ పాత్రను ఎంపిక చేసుకుని,, సందీప్ నిజంగానే పాథ్ బ్రేక్ చేశాడు. అందుకే, ఈ చిత్రం తన కెరీర్ కి మరో మంచి బ్రేక్ అవుతుంది. ఈ చిత్రంతో ఆనంద్ ఇక్కడ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కావడం ఖాయం. ఈ కథను నమ్మిన నిర్మాతలను కూడా ప్రత్యేకంగా అభినందించాలి. మామూలుగా ఏ సినిమా అయినా కొంతమందికి నచ్చుతుంది... కొంతమందికి నచ్చదు. కానీ, ఈ సినిమా చూసినవాళ్లందరూ 'సూపర్' అంటున్నారు. ఎ,బి,సి.. ఏదో ఒక సెంటర్ కాదు.. మాస్, క్లాస్, హారర్, సస్పెన్స్.. ఇలా ఏదో ఒక జానర్ కాదు.. అన్ని సెంటర్స్ వారికీ ఈ చిత్రం నచ్చుతుంది. పిల్లలు, యూత్, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయదగ్గ చిత్రం.


ఫైనల్ గా చెప్పాలంటే... యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ 'టైగర్' విజయ విహారం చేయడం ఖాయం. కంగ్రాట్స్ టు ది టీమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !