View

బస్తీ మూవీ రివ్య్వూ

Friday,July03rd,2015, 07:55 AM

చిత్రం - బస్తీ
బ్యానర్ - వజ్మన్ ప్రొడక్షన్స్
నటీనటులు - శ్రేయాన్, ప్రగతి, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, అభిమన్యుసింగ్, సప్తగిరి, సత్య, స్నిగ్థ తదితరులు
మాటలు - వడ్డాలపు ప్రభాకర్
కెమెరా - వి.కె.గుణశేఖర్
సంగీతం - ప్రవీణ్ ఇమ్మడి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వాసు మంతెన

సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండూ లేనివాళ్లు హీరో, హీరోయిన్ గా పరిచయం అయితే ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ, సహజ నటి జయసుధ తనయుడు పరిచయ సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాల నడుమ తెరకొచ్చాడు శ్రేయాన్. పైగా 'బస్తీ' అనే మాస్ టైటిల్ తో. కుర్రాడు ఒడ్డూ, పొడవూ బాగుంటాడు కాబట్టి, ఈ టైటిల్ తో చిత్రదర్శకుడు వాసు మంతెన ఓ మంచి యాక్షన్ విత్ లవ్ ఎంటర్ టైనర్ సినిమా తీసి ఉంటాడని, తెలుగు తెరకు మంచి మాస్ హీరో దొరికి ఉంటాడని చాలామంది ఊహించారు. మరి.. 'బస్తీ' ఎలా ఉంది? సహజ నటి తనయుడు కాబట్టి, తల్లిలానే శ్రేయాన్ మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటాడా? చూద్దాం...


à°•à°¥
అమ్మిరాజు (ముఖేష్ రుషి), భిక్షపతి (కోట శ్రీనివాసరావు) ఇద్దరూ వైర వర్గానికి చెందిన వారు. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంతటి వైరం ఉంటుంది. అమ్మిరాజును పెంచిన వెంకటపతిరాజు (శ్రీహరి) చనిపోతూ గొడవలు ఆపేయాలని తన కొడుకు విజయ్ అలియాస్ చిన్నా (శ్రేయాన్)ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలని చెబుతాడు. దాంతో అమ్మిరాజు గొడవలు ఆపేస్తాడు. బిజినెస్ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతాడు. కానీ భిక్షపతి కొడుకు భవాని (అభిమన్యుసింగ్) మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుంటాడు. అమ్మిరాజు దగ్గర పని చేస్తున్న ఓ వ్యక్తి చెల్లెల్ని రేప్ చేసి చంపేస్తాడు భవాని. అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని భిక్షపతి కూతురు, భవాని చెల్లెలు స్రవంతి (ప్రగతి)ని కిడ్నాప్ చేయించి తన ఇంట్లోని స్టోర్ రూమ్ లో బంధీ చేస్తాడు అమ్మిరాజు.


గొడవలకు దూరంగా ఉంచాలని సొంత తమ్ముడిలా భావించే విజయ్ ని ఫారిన్ లో చదివిస్తుంటాడు అమ్మిరాజు. సడెన్ గా ఫారిన్ నుంచి వచ్చి అమ్మిరాజుకు షాక్ ఇస్తాడు విజయ్. తమ ఇంట్లో బంధీగా ఉన్న బిక్షపతి కూతురు స్రవంతిని చూసి, ఆమెను స్టోర్ రూమ్ నుంచి తన రూమ్ కి తీసుకువచ్చి... తన వాళ్లతో మాట్లాడి ఆమెను ఇంటికి పంపిచేస్తానని చెబుతాడు. అలా ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. తన ప్రేమ విషయాన్ని తన అన్నయ్య అమ్మిరాజుకు చెప్పి పెళ్లి చేయమని కోరతాడు విజయ్. మరి.. అమ్మిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? భిక్షపతి, అతని కొడుకు భవాని.... స్రవంతి ప్రేమను అంగీకరిస్తారా? విజయ్ తన ప్రేమను ఎలా గెల్చుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
శ్రేయాన్ చూడచక్కగా ఉన్నాడు. మంచి హైట్. ఆ హైట్ కి తగ్గ ఫిజిక్ తో ఓ హీరోకి కావాల్సిన లక్షణాలతో ఉన్నాడు. కానీ, నటన పరంగా మాత్రం సోసో అనే చెప్పాలి. మొదటి సినిమా కాబట్టి, అద్భతుమైన నటన కనబర్చాలని ఆశించలేం. కానీ, మినిమమ్ యాక్టింగ్ స్కిల్స్ అయినా కనబర్చి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకోకుండా ఉండలేరు. ఈ విషయంలో శ్రేయాన్ ని మాత్రమే అనడానికి లేదు.. అనుభవం ఉన్న దర్శకుడైతే ఎలాంటివాళ్లతో అయినా నటించజేయగలుగుతాడు. కానీ, దర్శకుడికి కూడా ఇది తొలి సినిమా కాబట్టి, శ్రేయాన్ నుంచి నటన రాబట్టలేకపోయాడు. హీరోయిన్ ప్రగతి ఓకే. తన యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. ఇక, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి వంటి సీనియర్స్ గురించి చెప్పక్కర్లేదు. తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాలో ఇతర పాత్రధారులు ఓకే అనిపించుకున్నారు.


సాంకేతిక వర్గం
ఈ చిత్రకథ గురించి చెప్పడానికి ఏమీలేదు. ఆర్డినరీ లవ్ స్టోరీ. ఆర్డినరీలను ఎక్స్ ట్రార్డినరీగా చూపించే సత్తా మంచి స్ర్కీన్ ప్లే కి ఉంటుంది. కానీ, ఇక్కడ స్ర్కీన్ ప్లే కూడా పేలవం. దర్శకుడు వాసు మంతెన అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన పాటలు సుమారుగా ఉన్నాయి. కథ, కథనం పేలవంగా ఉన్నట్లే సంభాషణలు కూడా సోసోగా ఉన్నాయి. కెమెరా పనితనం, ఎడిటింగ్.. ఇలా ఏదీ బ్రహాండంగా లేదు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
పెట్టుడు సన్నివేశాలు, పేలవమైన కామెడీ, బలం లేని ప్రేమకథతో సాగే ఈ చిత్రం ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ బోరింగే. ఫస్టాఫ్ బలంగా లేదు కదా.. సెకండాఫ్ లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి, ఆసక్తికరంగా మలిచి ఉంటారేమో అనుకుంటే ఆశాభంగమే. హీరో, హీరోయిన్ మధ్య గాఢమైన ప్రేమ పెరగడానికి కావల్సిన బలమైన సన్నివేశాలు లేవు. అసలు ఇద్దరి మధ్య మంచి కెమిస్ర్టీయే లేదు. ఇక, ఆ ప్రేమకథ ఎవరి మనసుని మాత్రం టచ్ చేస్తుంది? పైగా పెంచిన అన్నయ్య చనిపోయినా, కళ్లెదుటే తండ్రి చనిపోయినా హీరో, హీరోయిన్ బాధపడినట్లు చూపించకపోవడం, అతుకుతుల బొంతలా ఉన్న అలీ పాత్ర, పండని సప్తగిరి, సత్య, స్నిగ్ధల కామెడీ.. ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. 'బస్తీ' టైటిల్ కి పెద్ద జస్టిఫికేషన్ ఉండదు. ఏ హీరోకైనా పరిచయ చిత్రం ఎలా ఉండాలంటే.. అతనితో డ్యాన్స్ చేయించాలి, కొన్ని ఎమోషనల్ సీన్స్ చేయించాలి, ఫైట్స్ చేయించాలి. ఈ చిత్రంలో శ్రేయాన్ డ్యాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఫైట్స్ అస్సలు పెట్టలేదు. తీసుకున్న కథే బలంగా లేకపోవడంతో ఎమోషనల్ సన్నివేశాలు లేవు. ఇలాంటి చిత్రం ద్వారా శ్రేయాన్ పరిచయం అయ్యి ఉండాల్సింది కాదు అని జయసుధను అభిమానించేవాళ్లు అనుకోకుండా ఉండలేరు.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ 'బస్తీ'... మస్తీగా లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !