View

సూపర్ స్టార్ కిడ్నాప్ మూవీ రివ్య్వూ

Friday,July03rd,2015, 01:49 PM

చిత్రం - సూపర్ స్టార్ కిడ్నాప్
బ్యానర్ - లక్కీ క్రియేషన్స్
నటీనటులు - నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్, తేజస్విని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం - సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ - ఈశ్వర్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
సమర్పణ - ఎ.సత్తిరెడ్డి
నిర్మాత - చందు పెన్మత్స
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - ఎ.సుశాంత్ రెడ్డి


'సూపర్ స్టార్ కిడ్నాప్' టైటిల్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. మహేష్ బాబు మాస్క్ లు వేసుకున్న హీరోల పోస్టర్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలగజేసాయి. అయితే మహేష్ బాబుకీ, ఈ సినిమాకీ ఎలాంటి సంబంధంలేదని, మహేష్ బాబుని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలేదని ఈ చిత్ర దర్శక, నిర్మాతలు చెప్పుకుంటూ వచ్చారు. ముగ్గురు కుర్రాళ్లు వేసిన కిడ్నాప్ ప్లానింగ్ ని ఎంటర్ టైన్ మెంట్ వేలో చూపించామని, ప్రేక్షకులను అలరిస్తుందని డైరెక్టర్ సుశాంత్ రెడ్డి ప్రెస్ మీట్స్ లో చెప్పారు. నందు, భూపాల్, ఆదర్శ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? కిడ్నాప్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే విధంగా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.


à°•à°¥
ఈ స్టోరీ ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో డ్రగ్స్ కి అలవాటుపడతాడు జై (ఆదర్శ్ బాలకృష్ణ). ఇతను ఓ సినీ నిర్మాత కొడుకు. తన గర్ల్ ఫ్రెండ్ ప్రియ (పూనమ్ కౌర్) తనను మోసం చేసిందని తెలుసుకుని డిప్రెషన్ కి లోనవుతాడు నందు (నందు). ఎప్పటికైనా మహేష్ బాబుతో సినిమా చేయాలనే టార్గెట్ తో చిత్ర పరిశ్రమలో అవకాశాలు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు భూపాల్ (భూపాల్). ఈ ముగ్గురూ ఓ సందర్భంలో రౌడీ షీటర్ పత్తాల రాజు (ఫిష్ వెంకట్) దగ్గర ఇరుక్కుంటారు. ఈ రౌడీ షీటర్ కి 10రోజుల్లో 50లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


డబ్బులు లేని ఈ ముగ్గురు కుర్రాళ్లు తమకు వచ్చిన పడిన ఇబ్బంది నుంచి బయటపడటానికి సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. దానివల్ల వారు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొన్నారు? వారు సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేసారా? అసలు రౌడీ షీటర్ పత్తాల రాజు దగ్గర ఈ ముగ్గురు కుర్రాళ్లు ఎందుకు ఇరుక్కున్నారు అనేదే ఈ చిత్ర కథాంశం.


నటీనటుల పెర్ ఫామెన్స్
నిజాయితీపరుడైన ప్రేమికుడిగా నందు చక్కగా నటించాడు. నటించడానికి స్కోప్ ఉంటే తనలోని నటుడిని ఆవిష్కరించుకోగల సత్తా నందుకి ఉంది. అహంకారంతో ప్రవర్తించే కుర్రాడిగా ఆదర్శ్ చక్కగా నటించాడు.అప్ కమింగ్ డైరెక్టర్ గా భూపాల్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. నందును మోసం చేసే ప్రియురాలి పాత్రలో పూనమ్ కౌర్ బాగానే నటించింది. లేడీ డాన్ గా శ్రధ్దాదాస్ అభినయం బాగుంది. వెన్నెల కిషోర్, ఫిష్ వెంకట్ తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ సినిమా సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ గురించే చెప్పుకోవాలి. సింఫుల్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించినప్పటికీ, విజవల్స్ పరంగా చక్కటి క్వాలిటీని ఇచ్చారు ఈశ్వర్. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. కిడ్నాప్ సీన్, ఛేజింగ్ ఎపిసోడ్ లైటింగ్ స్కీమ్ బాగుంది. టోటల్ గా ది బెస్ట్ అవుట్ ఫుట్ ని ఇచ్చారు ఈశ్వర్. పాటలు బాగున్నాయి. పాటలకంటే కూడా సాయికార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. ఆ పరంగా సాయికార్తీక్ అవుట్ ఫుట్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే, సినిమా ఇంకా ఫాస్ట్ గా అనిపించేది. స్టోరీ, డైలాగ్స్, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ విభాగాలను సుశాంత్ రెడ్డి హ్యాండిల్ చేసారు. డైలాగ్స్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్నాయి. సింఫుల్ స్టోరీ లైన్ ని తీసుకుని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో ఎంటర్ టైన్ మెంట్ వేలో సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నం చేసారు డైరెక్టర్ సుశాంత్ రెడ్డి. టేకింగ్ పరంగా ప్లస్ మార్కులు వేయించుకున్న సుశాంత రెడ్డి స్ర్కీన్ ప్లే విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే టోటల్ గా వంద మార్కులతో డైరెక్టర్ గా పాస్ అయ్యుండేవారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాలో మనోజ్, నాని, అల్లరి నరేష్, తనీష్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చారు. ఇది సినిమాకి చాలా ప్లస్. ఆడియన్స్ వీరి సీన్స్ ని ఎంజాయ్ చేస్తారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. రొటీన్ స్టోరీ లైన్, ఊహించే విధంగా సీన్లు ఉండటం ఈ సినిమాకి మైనస్. ఫస్టాప్ స్ర్కీన్ ప్లే ఉన్నంత ఆసక్తిగా సెకండాఫ్ స్ర్కీన్ ప్లే లేదు. పాటల ప్లేస్ మెంట్ కుదరలేదు. కిడ్నాప్ ఎలిమెంట్ బలంగా లేదు. ఈ సినిమా ఫస్టాప్, కామెడీ ప్రేక్షకులకు రిలీఫ్ గా ఉంటుంది. దాంతో సినిమా చూసిన ప్రేక్షకుడు సినిమా బాగోలేదని చెప్పలేరు. ఒక్కసారి చూడొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. అది ఈ సినిమాకి ప్లస్ అవుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే...
సూపర్ స్టార్ కిడ్నాప్ లో కొన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా లీడ్ రోల్స్ చేసిన నటీనటుల పెర్ ఫామెన్స్ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. మహేష్ అభిమానులు సైతం ఈ సినిమా చూసే అవకాశం ఉంది. సో... ఒక్కసారి సూపర్ స్టార్ కిడ్నాప్ ని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !