View

అ ఆ మూవీ రివ్య్వూ

Thursday,June02nd,2016, 09:12 AM

చిత్రం - అ ఆ
బ్యానర్ - హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు - నితిన్, సమంత, అనుపమాపరమేశ్వర్, అనన్య, అవసరాల శ్రీనివాస్, గిరిబాబు, నరేష్, అన్నపూర్ణ, నదియా, ఈశ్వరీరావ్, సన, రఘుబాబు, రావు రమేష్, పోసాని, అజయ్, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ - నటరాజ్ సుబ్రమణియన్
సంగీతం - మిక్కి.జె.మేయర్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి.ప్రసాద్
సమర్పణ - శ్రీమతి మమత
నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్


నితిన్, సమంత, అనుపమ పరమేశ్వర్ హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'అఆ'. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ఉప శీర్షిక. 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి' అంటూ హిట్ చిత్రాలు ఇచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా పోస్టర్స్, టైటిల్, ట్రైలర్స్ అన్నీ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ వ్యాల్యూస్ తో పాటు ఓ మంచి లవ్ స్టోరీని మిక్స్ చేసి త్రివిక్రమ్ ఈ సినిమాని చేసారని నితిన్ ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఎంతో ఇష్టంతో చేసిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. ఈ సినిమాతో త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే విధంగా ఉందా చూద్దాం.


à°•à°¥
అనసూయ బిజినెస్ మ్యాగ్నెట్ మహాలక్ష్మీ (నదియా), రామలింగం (నరేష్) దంపతులకు ఒక్కగానొక్క కూతురు. కూతురు విషయంలో మహాలక్ష్మీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కూతురు కోసం బాగా డబ్బున్న అబ్బాయిని చూస్తుంది. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అనసూయ ఆ సంబంధాన్ని తన తండ్రితోనే చెడగొట్టించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కరెక్ట్ గా ఆ సమయంలో మహాలక్ష్మీ ఓ కాన్ఫరెన్స్ కోసం చెన్నయ్ వెళుతుంది. తను తిరిగి రావడానికి పది రోజులు పడుతుంది కాబట్టి, ఈ పది రోజుల్లో అమ్మ పేరు ఎవ్వరూ తలవని చోటుకి వెళ్లాలని అనసూయ తన తండ్రిని అడుగుతుంది. దాంతో పల్లెటూరులో ఉంటున్న మేనమామ కుటుంబం గురించి అనసూయకు చెబుతాడు రామలింగం. మేనమామ కుటుంబానికి, తమ కుటుంబానికి రాకపోకలు లేవని తెలుసుకుంటుంది అనసూయ. మేనమామ ఇంటికి వెళితే తన తల్లికి నచ్చదని తెలిసినా తండ్రి సహాయంతో తన మేనమామ ఇంటికి వెళుతుంది.


కూతురిని పట్టుమని ఒక్కరోజు కూడా ఎక్కడా వదలిపెట్టని రామలింగం మేనల్లుడు ఆనంద విహారి (నితిన్) కి కూతురు బాధ్యతలు అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన అనసూయకు తోడుగా ఉండి తన ఇంటికి తీసుకెళతాడు ఆనంద విహారి. కట్ చేస్తే...
మేనమామ కుటుంబం, ఆనంద విహారి పై ఇష్టం పెంచుకుంటుంది అనసూయ. మరి తను దూరంగా ఉంటున్న తన అన్నయ్య కుటుంబంతో కూతురు కలిసిందని తెలుసుకున్న మహాలక్ష్మీ ఎలా రియాక్ట్ అయ్యింది. అసలు అన్నయ్య కుటుంబం అంటే మహాలక్ష్మీకి ఎందుకు పడదు.. తన అన్నయ్య కొడుకుతో ప్రేమలో పడిన కూతురు విషయంలో మహాలక్ష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే ఈ చిత్రం కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఆనంద విహారిగా నితిన్ ఒదిగిపోయిన వైనం సూపర్. మన ఇంట్లో కుర్రాడు, లేదా మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. దాంతో నితిన్ అందరికీ కనెక్ట్ అవుతాడు. మిడిల్ క్లాస్ కుర్రాడు.. విలువలు పాటించే కుర్రాడు... కుటుంబాన్ని ప్రేమించే కుర్రాడు... తనను ఇష్టపడే అమ్మాయిని హర్ట్ చేయకూడదనుకునే కుర్రాడు.. ఇలా ఆనంద విహారి పాత్రలో ఉన్న డైమ్షన్ ని చక్కగా ఆవిష్కరించాడు నితిన్. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ లో తన అత్తయ్యకు రిటార్డ్ ఇచ్చే సీన్ లో నితిన్ బాగా నటించాడు. సమంతతో లవ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇక ఈ చిత్రంలో అనసూయగా సమంత బెస్ట్ పెర్ ఫామెన్స్ ఇచ్చింది. కథ మొత్తం సమంతను బేస్ చేసుకునే జరుగుతుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో సమంత కనబర్చిన నటన మనసుకు హత్తుకుపోతుంది. అనసూయగా అదరగొట్టేసింది సమంత. బిజినెస్ మ్యాగ్నెట్ మహాలక్ష్మీగా పొగరైన బాడీ లాంగ్వేజ్, రిచ్ మదర్ గా నదియా గ్లామర్ గా ఉండటమే కాకుండా చక్కగా నటించింది. సెకండ్ హీరోయిన్ గా నటించిన అనుపమా పరమేశ్వర్ గడుసుపిల్లగా బాగా నటించింది. అక్కడక్కడ అనసూయపైన అసూయను కూడా బాగా కనబర్చింది. నితిన్ మీద ప్రేమను కూడా చక్కటి ఎక్స్ ప్రెషన్ తో పలికించింది. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండి పోతుంది. నరేష్, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, గిరిబాబు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ ఒక్క సీన్ లో మాత్రమే కనినించినా, అచ్చమైన తెలుగు అమ్మను గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


సాంకేతిక వర్గం
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పటిలానే ఓ సింఫుల్ స్టోరీ లైన్ ని తీసుకున్నాడు. అయితే ఆ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం సూపర్బ్. సింఫుల్, మీనింగ్ ఫుల్ డైలాగ్స్ మరోసారి త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని నిరూపించాయి. ఎక్కడా డివియేట్ అవ్వకుండా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో త్రివిక్రమ్ మ్యాజిక్ చేసాడు. సినిమాటోగ్రఫీ సూపర్బ్, పల్లెటూరు అందాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ప్లజెంట్ లైటింగ్ స్కీమ్ కనులకు హాయిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
చక్కటి ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ ది అందెవేసిన చెయ్యి. ఆ ఫ్యామిలీ డ్రామాలో సింఫుల్ లవ్ స్టోరీని మిక్స్ చేసి యూత్ ని కూడా కట్టిపడేస్తాడు త్రివిక్రమ్. తన గత చిత్రాలు అతడు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు ఇలాంటి ఫార్ములాతో రూపొందినవే. ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ ఫుల్ ఫార్ములా. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఈ సక్సెస్ ఫుల్ ఫార్మూలాని వాడి మ్యాజిక్ చేసాడు త్రివిక్రమ్. ఏ వర్గానికి చెందిన ఆడియన్స్ అయినా ఫ్యామిలీ, లవ్, సెంటిమెంట్, కామెడీ కి కనెక్ట్ అయిపోతారు. దీనికి బి, సి సెంటర్స్ అనే తేడా ఉండదు. ఈ సినిమాని కూడా అలానే తీర్చిదిద్ది అన్ని సెంటర్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు. ఓవర్ సీస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మన కుటుంబాల్లో జరిగినట్టు అనిపించే సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్. సెకండాఫ్ ఆరంభమైన కాసేపటికి కొంచెం బోర్ అనిపిస్తుంది, ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు ఉండవు. సమంత, జబర్ధస్త్ చంద్ర సీన్ పెద్దగా ఆసక్తి అనిపించదు. ఇలాంటి సీన్స్ ని ట్రిమ్ చేయడం వల్ల నిడివి తగ్గుతుంది. తద్వారా ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీలవ్వరు. పాటల చిత్రీకరణ బాగుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... మొత్తం కుటుంబంతో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు, ట్విస్ట్ లు గట్రా ఉండవు. బుర్రకు పదను పెట్టాల్సిన అవసరం లేదు. కూల్ గా పాప్ కార్న్ తింటూ అనసూయ రామలింగం, ఆనంద విహారి కుటుంబాలకు కనెక్ట్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !