View

అఖిల్ మూవీ రివ్య్వూ

Wednesday,November11th,2015, 08:18 AM

చిత్రం - అఖిల్ (ది పవర్ ఆఫ్ జువా)
బ్యానర్ - శ్రేష్ట్ మూవీస్
సమర్పణ - నిఖితారెడ్డి
నటీనటులు - అక్కినేని అఖిల్, సయేషా సైగల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమ, డా. రాజేంద్రప్రసాద్, లెబాగా జీన్ (లండన్), లూయిస్ పాస్కల్, ముతినే కెల్లూన్, గిబ్సన్ బైరన్ జేమ్స్ (రష్యా) తదితరులు
కథ - వెలిగొండ శ్రీనివాస్
మాటలు - కోన వెంకట్
సంగీత దర్శకులు - అనూప్ రూబెన్స్, తమన్
సినిమాటోగ్రఫీ - అమోల్ రాథోడ్
ఎడిటింగ్ - గౌతంరాజు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్.వెంకటరత్నం (వెంకట్)
నిర్మాత - నితిన్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వి.వి.వినాయక్

 

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని హీరోల పరిచయ చిత్రంపై అంచనాలు ఉండవు. కానీ, బలమైన సినిమా కుటుంబ నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు హీరోగా పరిచయమవుతున్నాడంటే భారీ అంచనాలు ఉంటాయి. అప్పటివరకూ ఆ కుటుంబంలో నటులుగా ఇరగదీసిన తాత, తండ్రితో ఈ కుర్ర హీరోకి పోలికలు పెడతారు. అఖిల్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడనగానే తాతకి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా? తండ్రి తగ్గ కొడుకు అనిపించుకుంటాడా? అనే చర్చ జరిగింది. మొదటి సినిమాకే ఓ వంద సినిమాల పరిణతి కనబర్చడం కుదరదు కాబట్టి, 'హీరోగా పనికొస్తాడు... టాలెంట్ ఉంది' అనిపించుకుంటే చాలు.. మరి.. అఖిల్ అలా అనిపించుకుంటాడా?.. తనను వీవీ వినాయక్ ఎలా ఆవిష్కరించాడు?... ఆ విషయంలోకే వద్దాం...


à°•à°¥
ఆఫ్రికాకు చెందిన ఓజో తెగ ప్రపంచాన్ని కాపాడటానికి బుషులు ఇచ్చిన 'జువా' ని కాపాడుతూ ఉంటుంది. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత సూర్యుడు నుంచి వచ్చే తొలి కిరణాలు 'జువా' మీద పడితే ఎలాంటి వినాశనం జరగకుండా, సూర్యుడు వేడి వల్ల జీవ రాశులకు ఎలాంటి ఆపాయం కలగకుండా ఉంటుందని బుషులు ఓజో తెగకు చెబుతారు. అప్పట్నుంచి ఆ తెగ 'జువా' ని కాపాడుకుంటూ వస్తుంది. అయితే ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించాలనే కాంక్షతో ఉన్న కత్రోచి 'జువా' ను పొందడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న మెంటల్ ముఖేష్ (మహేష్ మంజ్రేకర్) తో చేతులు కలుపుతాడు. ముఖేష్ ఆఫ్రికాకు చెందిన మాంబో అనే గ్యాంగ్ తో చేతులు కలిపి 'జువా' ని చేజిక్కించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ గ్యాంగ్ నుంచి 'జువా' ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు ఓజో తెగకు చెందిన ఓడో. కట్ చేస్తే... హైదరాబాద్ లో ఉన్న అఖిల్ ఇంట్రడక్షన్ తో కథ మరో మలుపు తిరుగుతుంది.


అఖిల్ ( అఖిల్) ఓ అనాధ. సరదాగా తిరిగే అఖిల్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తుంటాడు. ఓ సందర్భంలో మెడికల్ స్టూడెంట్ దివ్య (సయేషా సైగల్) ని కలుస్తాడు. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. దివ్యకు ఆల్ రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ పెళ్లిని చెడగొట్టి తన ప్రేమలో సక్సెస్ సాధించాలని అఖిల్ ప్రయత్నాలు మొదలుపెడతాడు. అనుకున్నట్టుగానే దివ్య పెళ్లిని చెడగొడతాడు. పెళ్లి ఆగిపోయిందని దివ్య యూరోప్ వెళ్లిపోతుంది. దివ్య ప్రేమను పొందడానికి అఖిల్ కూడా యూరోప్ వెళతాడు. దివ్య ఉంటున్న విల్లా లోనే ఓజో తెగకు చెందిన ఓడో ఉంటాడు. యూరోప్ లో దివ్యను కలుసుకున్న అఖిల్ ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఓడోని మాంబో గ్యాంగ్ 'జువా' కోసం వెంటాడుతూ షూట్ చేస్తుంది. బుల్లెట్ గాయంతో దివ్య దగ్గరకు వచ్చి తనను కాపాడమని చెబుతాడు ఓడో. అతనికి సర్జరీ చేసి బుల్లెట్ తీసి కాపాడుతుంది దివ్య. మళ్లీ ఓడో మీద మాంబో గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ లో ఓడో చనిపోతాడు. ఓడో చనిపోతూ 'జువా' ని ఎక్కడ దాచిన విషయం తనకు సర్జరీ చేసిన దివ్యకు చెప్పి ఉంటాడని గ్రహించిన మాంబో గ్యాంగ్ దివ్య వెనకాల పడి ఆమెను కిడ్నాప్ చేస్తారు. దివ్యను కాపాడటం కోసం అఖిల్ రంగంలోకి దిగుతాడు. దివ్య తండ్రి మెంటల్ ముఖేష్ కి బ్యాంబో గ్యాంగ్ తో ఉన్న సంబంధం తెలుసుకుంటాడు అఖిల్. ఆ గ్యాంగ్ నుంచి దివ్యను కాపాడటానికి మాంబో గ్యాంగ్ పై అటాక్ చేస్తాడు అఖిల్. అప్పుడు దివ్య ద్వారా 'జువా' విషయం తెలుసుకున్న అఖిల్ ప్రపంచాన్ని కాపాడే ఆ శక్తిని ఎక్కడున్నా తీసుకువచ్చి ఓజో తెగ దగ్గరకు చేర్చడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి అఖిల్ 'జువా' ని దక్కించుకున్నాడా... సూర్యగ్రహణం పూర్తయ్యేసరికి 'జువా' ని ఓజో తెగకు అందించి తొలి సూర్యకిరణాలు పడేలా చేయగలిగాడా... అఖిల్ ప్రేమను దివ్య అంగీకరిస్తుందా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
అఖిల్ పాత్రను అఖిల్ బాగా చేశాడు. యాక్షన్, డ్యాన్స్, సెంటిమెంట్, లైట్ గా కామెడీ.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర ఇది. అన్ని సీన్స్ ని బాగా చేయగలిగాడు. ముఖ్యంగా డ్యాన్పుల్లో కనబర్చిన ఎనర్జీ సుపర్బ్. ఓ పది చిత్రాలు అనుభవం ఉన్నట్లుగా డ్యాన్స్ చేశాడు. అసలు తెలుగు బాగా మాట్లాడగలుగుతాడా? అతని డిక్షన్ బాగుంటుందా? అనే సందేహం చాలామందికి ఉంది. కానీ, అఖిల్ డైలాగ్స్ పలికిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో అలా వాయిస్ ని మౌల్డ్ చేసుకుని, డైలాగ్స్ చెప్పాడు. ఇక, సయేషా సైగల్ గురించి చెప్పాలంటే చాలా అందంగా ఉంది. నటనపరంగా నిరూపించుకునేంత స్కోప్ తన పాత్రకు లేదు. ఉన్నంతలో తాను హీరోయిన్ మెటీరియల్ అని నిరూపించుకుంది. రాజేంద్రప్రసాద్, మహేశ్ మంజ్రేకర్, జయప్రకాశ్ రెడ్డి తమ పాత్రలకు ప్రాణం పోశారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి సీన్ లో స్కోప్ దొరికినంతవరకూ నవ్వించగలిగారు.


సాంకేతిక వర్గం
వెలిగొండ శ్రీనివాస్ రాసిన కథలో బలం లేదు ఎక్కడో మొదలై,, ఎక్కడెక్కడికో వెళ్లి.. మొత్తానికి ముగుస్తుంది. ఇలాంటి కథను ఏ హీరో తొలి సినిమాకి సెలెక్ట్ చేసుకోకూడదు. అసలు ఈ కథలో ఏముందని వినాయక్ సెలక్ట్ చేసుకున్నాడు? అనే సందేహం కలగడం సహజం. కోన వెంకట్ రాసిన సంభాషణలు బాగున్నాయి. తమన్, అనూప్ రూబెన్స్ ఇద్దరూ పాటలు స్వరపరిచారు. కానీ, 'పడేశావే..' అనే ఒకే ఒక్క పాట వినడానికి బాగుంది. ఓ పాటలో అఖిల్ తో కలిసి నాగార్జున డ్యాన్స్ చేయడం అభిమానులను ఆనందపరిచే విషయం. అమోల్ రాథోడ్ ఫొటోగ్రఫీ బాగుంది. సినిమా చాలా లావిష్ గా ఉంది. హీరో నితిన్ రాజీ పడకుండా ఖర్చు పెట్టి తీశాడు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
కథ, కథనం సరిగా లేకపోవడంతో అఖిల్ పడ్డ శ్రమ అంతా వృథా అనే చెప్పాలి. మొదటి సినిమా చేసినట్లుగా అనిపించలేదు. చాలా ఈజ్ గా యాక్ట్ చేశాడు. డ్యాన్సులప్పుడు అఖిల్ ఒళ్లు హూనం అయ్యిందేమో అనిపించింది. తన శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు. మొత్తం మీద అఖిల్ 'మంచి హీరో మెటీరియల్' అని నిరూపించిన చిత్రం ఇది. కాకపోతే ఒక పాట, ఒక ఫైట్, కొన్ని సీన్స్.. అని ఓ స్కీమ్ ప్రకారంగా సినిమా తీశాడు వినాయక్. అది పరమ రొటీన్ గా ఉంటుంది. ఒక కొత్త హీరో.. అందులోనూ లేతగా కనిపించే హీరోతో ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై దర్శకుడికి ఓ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీతో కథ సెలక్ట్ చేసుకోవాలి. అఖిల్ కోసం కథ సెలక్ట్ చేసే విషయంలో వినాయక్ క్లారిటీ మిస్ అయ్యాడు. ఫలితంగా పెట్టుబడి పెట్టి సినిమా తీసిన నితిన్ కీ, ఎంతో కష్టపడి నటించిన అఖిల్ కీ చేదు అనుభవం మిగిలింది.


ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక్క చేదు అనుభవం మరో తీపి అనుభవానికి నాంది అవుతుంది. సో.. అఖిల్ పెద్దగా డిజప్పాయింట్ కావాల్సిన అవసరంలేదు. నటుడిగా ఫెయిల్ కాలేదు కాబట్టి, రెండో సినిమాకి మంచి కథ ఎంచుకుని చేస్తే.. సక్సెస్ ని టేస్ట్ చేయొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !