View

బాహుబలి 2 మూవీ రివ్య్వూ

Friday,April28th,2017, 02:30 AM

చిత్రం - బాహుబలి 2
బ్యానర్ - ఆర్కా మీడియా వర్క్స్
నటీనటులు - ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు
సంగీతం - యం.యం.కీరవాణి
సినిమాటోగ్రఫీ - కె.కె.సెంథిల్ కుమార్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ - సాబు శిరిల్
వి.ఎఫ్.ఎస్ సూపర్ వైజర్ - కమల్ కన్నన్
కథ - వి.విజయేంద్రప్రసాద్
నిర్మాతలు - శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
స్ర్కీన్ ప్లే - దర్శకత్వం - యస్.యస్.రాజమౌళి
విడుదల తేదీ - ఏప్రిల్ 28, 2017


''ఇలాంటి సినిమా వదులుకుంటే.. భవిష్యత్తులో మళ్లీ వస్తుందో.. రాదో... అందుకే చేశాం'' - 'బాహుబలి' నటీనటులు
''భారతీయ సినిమా స్థాయిని పెంచే చిత్రం ఇది'' - సినీ పండితులు
''ఇది ప్రపంచ స్థాయి సినిమా'' - సినిమా దిగ్గజాలు
''బాహుబలి న భూతో న భవిష్యతి'' - సినిమా పరిశీలకులు

... ఇలా బాహుబలి, బాహుబలి 2 గురించి అభినందనలే అభినందనలు.

'బాహుబలి ది బిగినింగ్' హిస్టరీ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా స్థాయిని పెంచింది. నేషనల్ అవార్డ్ గెల్చుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'బాహుబలి ది కంక్య్లూజన్. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్స్ ని పరిచయం చేసి, బాహుబలి మీద ఈగ కూడా వాలనివ్వని కట్టప్ప బాహుబలి ని చంపడం ట్విస్ట్ తో ఫస్ట్ పార్ట్ ఎండ్ చేసి, సెకండ్ పార్ట్ పై ఆసక్తిని రేకెత్తించాడు రాజమౌళి. 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' అనే క్వశ్చన్ గత రెండేళ్లుగా ట్రెండింగ్. ఫైనల్ గా ఈ రోజు (28.4.207) థియేటర్స్ కి వచ్చింది 'బాహుబలి 2'. మరి బాహుబలి 2 ఎలా ఉంది... ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుంది... కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా తెలుసుకుందాం.


à°•à°¥
బాహుబలి ది బిగినింగ్ పూర్తయిన దగ్గర్నుంచి బాహుబలి ది కంక్య్లూజన్ స్టోరీ ఆరంభమవుతుంది. మహిష్మతి రాజమాత శివగామి (రమ్యకృష్ణ) బాహుబలిని రాజుని చేసి రాజ్యాధికారం అప్పజెబుతుంది. పట్టాభిషేకం ముందు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం దేశాటన చేయమని బాహుబలికి చెబుతుంది శివగామి. కట్టప్పను కూడా బాహుబలి వెంట వెళ్లమని చెబుతుంది. అలా బాహుబలి, కట్టప్ప కుంతల రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ మహారాణి దేవసేన (అనుష్క) ని చూసి మనసు పారేసుకుంటాడు బాహుబలి. దేవసేన కూడా బాహుబలిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భల్లాలదేవ (రానా) తన తండ్రితో కలిసి బాహుబలిని దెబ్బ తీయడానికి పధకం రచిస్తాడు. అందులో భాగంగా తల్లి శివగామి దగ్గర తను మనసుపడ్డ దేవసేనను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా కోరతాడు భల్లాలదేవ. బాహుబలి, దేవసేన ప్రేమలో పడ్డారని తెలియని శివగామి కొడుకు భల్లాలదేవకి దేవసేనను ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది. అప్పటికే దేవసేనను పెళ్లి చేసుకుంటానని బాహుబలి మాట ఇచ్చేస్తాడు. దేవసేనను తీసుకుని మహిష్మతి రాజ్యానికి చేరుకుంటాడు బాహుబలి. దేవసేనను భల్లాలదేవుడుకి ఇచ్చి పెళ్లి చేయాలన్న శివగామి మాటకు ఎదురుతిరుగుతాడు బాహుబలి. తనకు దేవసేన కావాలని, రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు. దాంతో భల్లాలదేవకు రాజ్యాధికారం అప్పజెబుతుంది శివగామి. ఈ సంఘటనతో బాహుబలితో మాట్లాడటం మానేస్తుంది శివగామి. ఇదే అదనుగా తీసుకుని బాహుబలిపై వ్యతిరేకంగా కుట్రలు పన్నుతాడు భల్లాలదేవుడు. ఫైనల్ గా బాహుబలి, దేవసేనను రాజ్యం వదిలి వెళ్లిపోవాల్సిందిగా శివగామితోనే చెప్పిస్తాడు భల్లాలదేవ. తన కొడుకు పన్నుతున్న కుట్రల గురించి తెలుసుకోని శివగామి... కొడుకు చెప్పిన మాటలు విని బాహుబలిని చంపేయాల్సిందిగా కట్టప్పకు ఆదేశాలు జారీ చేస్తుంది. మరి బాహుబలి అంటే ఎంతగానో అభిమానించే కట్టప్ప ఎలా బాహుబలిని చంపేసాడు.. కొడుకు పన్నిన కుట్రలు శివగామి తెలుసుకుంటుందా... బాహుబలి, దేవసేన కొడుకు అమరేంద్ర బాహుబలి మహిష్మతి రాజ్యానికి వచ్చి భల్లాలదేవుడిని ఎదురిస్తాడా.. అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
బాహుబలి, శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి పాత్రలను ప్రభాస్ పోసించాడు. ఈ రెండు పాత్రల్లోనూ ప్రభాస్ అద్భుతమైన నటనను కనబర్చాడు. ప్రభాస్ నడిచిన తీరు. హావభావాలు బాగున్నాయి. బాహుబలి పాత్రలో భారీకాయుడిగా బాగున్నాడు. యుద్ధ సన్నివేశాల్లో ప్రభాస్ హావాభావాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తల్లిని, భార్యను ప్రేమించే వ్యక్తిగా సెంటిమెంట్ సీన్స్ లో చక్కటి నటనను కనబర్చాడు. తన తండ్రిని చంపి, తల్లిని బంధించిన భల్లాలదేవను ఢీ కొట్టడానికి వచ్చిన అమరేంద్ర బాహుబలి పాత్రలో కూడా ప్రభాస్ ఒదిగిపోయాడు.


భల్లలాదేవ పాత్రను రానా బాగా చేశాడు. దేవసేన పాత్రధారి అనుష్క వైపు చూసే వెటకారపు చూపులు, అధికారం కళ్లుమూసుకుపోయిన వైనాన్ని బాగా ఆవిష్కరించాడు. పోరాట సన్నివేశాల్లో రౌద్ర రసాన్ని బాగా పలికించాడు.


ఈ రెండు పాత్రల తర్వాత రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్రను రమ్యకృష్ణ చేయడంవల్ల కథకు బలం చేకూరింది. రాజమాత పాత్రలో మంచి రాజసం కనబర్చింది.


కట్టప్పగా సత్యరాజ్ అభినయం సూపర్. ఆ పాత్రకు ప్రాణం పోసాడు సత్యరాజ్. బిజ్జలదేవుడుగా నాజర్ నటన సూపర్బ్. ముఖ్యంగా వెటకారం పలికే డైలాగుల్లో అతని ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్. కుమార్ వర్మగా సుబ్బరాజు చక్కటి పాత్ర చేసాడు.


ఫస్ట్ పార్ట్ లో బంధీగా మాత్రమే కనిపించిన అనుష్క సెకండ్ పార్ట్ లో కుంతల దేశపు యువరాణి దేవసేనగా అలరించింది. యుద్ద సన్నివేశాలు, ప్రేమలో పడిన యువరాణి, ఆత్మాభిమానం కల మహారాణిగా అద్భుతమైన నటన కనబర్చింది అనుష్క. రమ్యకృష్ణ, దేవసేన మధ్య సాగే సీన్స్ లో ఇద్దరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు.


మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


సాంకేతిక వర్గం
రాజుల కాలం నాటి కథను ఎంచుకుని, ఈ సినిమా చేశాడు రాజమౌళి. సాంకేతికంగా ఈ చిత్రం రాజమౌళికి పెద్ద సవాల్. ముందు బ్లూ మ్యాట్ నేపథ్యంలో చిత్రీకరించి, ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తారు. లేనిది ఉన్నట్లుగా ఊహించుకుని నటీనటులు చేయడం, దర్శకుడు తీయడం.. ఇది సవాలే. ఆ మేరకు టెక్నికల్ గా ఈ సినిమా అద్భుతం. స్ర్కీన్ ప్లే సూపర్బ్. కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా పనితనం, ఎం.ఎం. కీరవాణి సంగీతం, రీ-రికార్డింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం. విజువల్ వండర్. వార్ సీక్వెన్స్ లో టెక్నిక్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సూపర్బ్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 'బాహుబలి ది బిగినింగ్' పాత్రల పరిచయంతోనే ముగిసిపోతుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ తో సెకండ్ పార్ట్ పట్ల ఆసక్తిని రేకెత్తించాడు రాజమౌళి. ఆ పాయింట్ ని పర్ ఫెక్ట్ గా మౌల్డ్ చేసి, తుస్సు మనిపించకుండా ఆసక్తిగా మలచడం ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. ఇన్నాళ్లు ఈ పాయింట్ గురించే ఆడియన్స్ మాట్లాడుకుంటూ వచ్చారు. ఏ మాత్రం ఈ పాయింట్ విషయంలో మిస్ కొట్టినా రాజమౌళి నవ్వుల పాలయ్యేవాడు. కానీ ఈ పాయింట్ ని సెంటిమెంట్ గా వర్కవుట్ చేసి, ఆడియన్స్ మనసుల్లో నిలిచపోయేలా చేసాడు రాజమౌళి. ఇక యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలైట్. కేవలం హాలీవుడ్ వాళ్లే వార్ సీక్వెన్స్ ని అద్భుతంగా చూపించగల సమర్థులు అనే అభిప్రాయాన్ని పోగొట్టాగలిగాడు రాజమౌళి. టెక్నాలజీని వాడుకుని, విజువల్ వండర్ తీయగల సత్తా మనవాళ్లకు ఉందని నిరూపించాడు. ఫస్ట్ పార్ట్ కేవలం విజువల్ ఫీస్ట్ అనిపించింది. కానీ సెకండ్ పార్ట్ సెంటిమెంట్, లవ్, ట్విస్ట్ లతో సూపర్డ్ అనిపించేలా తీర్చిదిద్దాడు రాజమౌళి.


అయితే బాహుబలి, భల్లాలదేవ ఇద్దరూ ధైర్య సాహసాల్లో సమానులైనప్పటికీ, బాహుబలిలో ప్రజల మీద ప్రేమ, తన రాజ్య ప్రజల బాగుగోలు కోసం ఆలోచించే మనస్తత్వం, ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకు సాగే వైనాన్ని గుర్తించి సొంత కొడుకును సైతం పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని బాహుబలికి కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకుంటుంది శివగామి. అలాంటి శివగామి కేవలం కొడుకు, భర్త చెప్పిన మాటలని నమ్మి బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశాలివ్వడం శివగామి పాత్రను కొంచెం డీ గ్రేడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరికొన్ని బలమైన సీన్స్ పడి, అప్పుడు బాహుబలిని చంపమని ఆదేశాలిస్తే, ఆ పాత్రకు ఇంకా వెయిట్ పెరిగి ఉండేది. అయితే తన తప్పు తెలుసుకున్న వెంటనే, దేవసేన కాళ్లను పట్టుకుని శివగామి చెప్పిన డైలాగులు ఆ పాత్రను హైలైట్ చేసాయి. ఫస్ట్ పార్ట్ రాజమౌళిని విమర్శల పాలు చేసింది. రాజమౌళి మార్క్ ఎమోషన్స్ మిస్ అయ్యాయనే విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానం చెబుతూ సెకండ్ పార్ట్ లో ఏ ఎమోషన్ ని మిస్ అవ్వకుండా తెరకెక్కించి తన సత్తా చాటుకున్నాడు.


ఫైనల్ గా చెప్పాలంటే...
బాహుబలి ది కంక్య్లూజన్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటే చెప్పే సినిమా. కొన్ని లాజిక్ లను వదిలేస్తే, గ్రాండియర్ విజువల్స్ తో ఓ వండర్ ఫుల్ మూవీ చూసిన అనుభూతి కలగడం ఖాయం. ఈ సినిమా ఇన్సిఫరేషన్ తో రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ, డిఫరెంట్ సినిమాలు చేయాలనే ఆలోచనతో మన స్టార్ హీరోలు, డైరెక్టర్స ముందుకు దూసుకెళతారు. తద్వారా తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. మార్కెట్ పెరుగుతుంది. టాలీవుడ్ లో జరగబోయే ఈ మార్పులకు కారణం రాజమౌళి కాబట్టి, ఈ డైరెక్టర్ కి హోల్ హార్టెడ్ గా జై కొట్టాల్సిందే. సో... డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్...

 

ఫిల్మీబజ్ రేటింగ్ - 3.5/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !