చిత్రం - బైలంపూడి
నటీనటులు - హరీష్ వినయ్, బ్రహ్మానంద రెడ్డి, తనిష్క్ రాజన్ తదితరులు
సంగీతం - సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రఫీ - అనిల్ పిజి రాజ్
నిర్మాత - బ్రహ్మానంద రెడ్డి
దర్శకత్వం - అనిల్ పిజి రాజ్
ఈ వారం విడుదలైన సినిమాల్లో 'బైలంపూడి' ఒకటి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్స్ జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. దాంతో సినిమా విడుదల కోసం ఎదురుచూసారు. మరి అందరి అంచనాలు అందుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.
కథ
బైలంపూడి గ్రామానికి చెందిన వ్యక్తి రవి (హరీష్ వినయ్). అమ్మకు తోడుగా ఉంటూ ఆటో నడుపుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. గ్రామ పెద్ద అయిన గురు నారాయణ్ (బ్రహ్మానందరెడ్డి) అంటే బైలంపూడి గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరికి భయం. అలాంటి వ్యక్తిని ఎదురిస్తాడు రవి. అతనిలోని ధైర్యం, తెగింపు చూసి రవిని ఇష్టపడుతుంది కళ్యాణి (తనిష్క్ రాజన్). వీరి ప్రేమకు అడ్డుపడతాడు గురు నారాయణ్. దాంతో గురు నారాయణ్ ని చంపేస్తాడు రవి. చనిపోయే ముందు కళ్యాణి గురించి ఓ నిజం చెబుతాడు గురు నారాయణ్. కళ్యాణి గురించి తెలిసిన రవి ఏం చేస్తాడు... కళ్యాణి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
హీరోగా నటించిన హరీష్ వినయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసాడు. హీరోయిన్ గా నటించిన తనిష్క్ రాజన్ చాలా సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో తను చేసిన కళ్యాణి పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. విలన్ గా బ్రహ్మానందరెడ్డి నటన బాగుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
టెక్నీకల్ గా...
క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు. అనిల్ దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ అందించడం సినిమాకి ప్లస్ అయ్యింది. సీన్స్ మీద పట్టు ఉండటంతో సినిమా మేకింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. సుభాష్ అందించిన పాటలు బాగున్నాయి. పిక్చరైజేషన్ కూడా ఆకట్టుకున్నాయి. సీన్స్ ని హైలైట్ చేసే విధంగా రీ-రికార్డింగ్ ఉంది.
విశ్లేషణ
గంజాయి సమస్యతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సమస్యను హైలైట్ చేసుకుంటూ అల్లిన కథ ఆసక్తిని కలిగిస్తుంది. స్ర్కీన్ ప్లే బాగుండటం సినిమాకి ప్లస్. మన్మధ సాయి డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషన్స్ సీన్స్ ఆడియన్స్ ని సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తాయి.
ఫైనల్ గా చెప్పాలంటే...
రియలిస్టిక్ సీన్స్ తో సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇలాంటి సినిమాలను తమిళ్ ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కొత్త సినిమాలను ఆదిరిస్తున్నారు కాబట్టి, ఈ సినిమా కూడా అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సో... ఈ వీకెండ్ లో ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫిల్మ్ బజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5