View

బెంగాల్ టైగర్ మూవీ రివ్య్వూ

Thursday,December10th,2015, 08:37 AM

చిత్రం - బెంగాల్ టైగర్
బ్యానర్ - శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నటీనటులు - రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బొమన్ ఇరాని, నాజర్, షయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, ఫృథ్వీ, తనికెళ్ల భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ, హంసా నందిని, హర్షవర్ధన్ రానే, సురేఖావాణి, అక్ష, శ్యామల, ప్రియ తదితరులు
సినిమాటోగ్రఫీ - సుందర్ రాజన్
ఎడిటర్ - గౌతంరాజు
ఫైట్స్ - రామ్ -లక్ష్మణ్
సంగీతం - భీమ్స్
నిర్మాత - కె.కె.రాధామోహన్
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - సంపత్ నంది


మాస్ ప్రేక్షకులు పండగ చేసుకోవాలంటే రవితేజ సినిమాలు చూడాలి. ఈ మాస్ మహరాజా నుంచి మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాలు వస్తుంటాయి. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచినా మాగ్జిమమ్ హిట్ రూట్ లో వెళుతుంటాడు రవితేజ. అయితే, ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన చిత్రాల్లో ఘోరపరాజయాన్ని చవి చూసిన చిత్రం 'కిక్ 2' చెప్పాలి. ఈ సినిమా షాక్ నుంచి రవితేజ అభిమానులు తేరుకోవాలంటే అర్జంటుగా ఈ మాస్ మహరాజా ఓ సూపర్ హిట్ మూవీ చేయాలి. 'బెంగాల్ టైగర్' అలాంటి సినిమానే అవుతుందనే అంచాలను అభిమానులు పెంచుకున్నారు. రవితేజ కూడా అలాంటి అంచనాలతోనే సంపత్ నందికి అవకాశం ఇచ్చి ఉంటాడు. మరి.. 'బెంగాల్ టైగర్' వసూళ్లల్లో షేర్ అనిపించుకుంటుందా?.. చూద్దాం.


à°•à°¥
ఆకాష్ నారాయణ్ (రవితేజ) జాబ్ లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ తన ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అన్నయ్యలు, వదినలు, అమ్మ, నానమ్మ ఆకాష్ ని పెళ్లికి ఒప్పించి పెళ్లి చూపులకు తీసుకెళతారు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఆకాష్ తో సెపరేట్ గా మాట్లాడాలని చెప్పి.. తనకు సెలబ్రెటీనే భర్తగా కావాలని, పాపులర్ అవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పేస్తుంది. దాంతో పాపులర్ అయ్యి సెలబ్రెటీగా తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు ఆకాష్. అందులో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి (షయాజీ షిండీ) రాజకీయ సభలో పాల్గొని, అతణ్ణి పబ్లిక్ గా రాయితో కొడతాడు. దాంతో మీడియా, పోలీస్ శాఖ ఆకాష్ పై దృష్టి సారిస్తుంది. కేవలం పాపులార్టీ పెంచుకోవాలనే ఆకాష్ అలా చేసాడని తెలుసుకోవడంతో పాటు ఆకాష్ చాలా తెలివైనవాడని గ్రహించిన వ్యవసాయశాఖ మంత్రి జాబ్ ఇచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. కట్ చేస్తే...


విదేశాల నుంచి వస్తున్న హోం మినిష్టర్ నాగప్ప (రావు రమేష్) కూతురు శ్రద్ధ (రాశిఖన్నా)ని గూండాల బారిన పడకుండా సేఫ్ గా ఇంటికి చేరుస్తాడు ఆకాష్. అప్పుడే ఆకాష్ పట్ల ఇంప్రెస్ అవుతుంది శ్రద్ధ. అంత తెలివైనవాడిని, సమయస్ఫూర్తి కలవాడిని జాబ్ లో పెట్టుకోవాలని తన తండ్రికి చెబుతుంది శ్రద్ధ. దాంతో వ్యవసాయశాఖ మంత్రి కంటే డబుల్ శాలరీ ఇచ్చి జాబ్ ఆఫర్ చేస్తాడు నాగప్ప. హోం మినిష్టర్ దగ్గర జాబ్ లో జాయిన్ అయిన ఆకాష్ రెండు, మూడు ఇన్సిడెన్స్ ద్వారా శ్రద్ధను ఇంప్రెస్ చేస్తాడు. హర్షవర్ధన్ రానేతో ఎంగేజ్ మెంట్ కి రెడీ అయిన శ్రద్ధ తన తండ్రి దగ్గర ఆకాష్ ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. అతను చాలా తెలివైనవాడని అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు చెప్పడంతో కూతురు పుట్టినరోజునాడు అందరినీ పిలిచి అందరి ముందు ఆకాష్ ని తన అల్లుడిగా పరిచయం చేస్తాడు నాగప్ప. కట్ చేస్తే...


తను ఆల్ రెడీ ఓ అమ్మాయిని ప్రేమించానని, తనది వన్ సైడ్ లవ్ అని, అందుకని శ్రద్ధను పెళ్లి చేసుకోలేనని అందరి ముందు చెబుతాడు ఆకాష్. హోం మినిష్టర్ కూతురిని కాదంటున్న ఆకాష్ ని అందరూ షాక్ తో చూస్తారు. అసలు అతను ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పమని ఆ పార్టీకి అటెండ్ అయిన సి.యం అశోక్ గజపతి (బొమన్ ఇరాని) అడుగుతాడు. ఆ అమ్మాయి ఎవరో చెబితే పెళ్లి చేస్తానని కూడా చెబుతాడు. తను ప్రేమిస్తున్నది సి.యం కూతురు మీరా (తమన్నా) అని చెప్పి అందరినీ షాక్ గురి చేస్తాడు ఆకాష్.


అసలు ఆకాష్ టార్గెట్ ఏంటి... అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి... పరిచయం లేని సి.యం కూతురిని ప్రేమిస్తున్నానని ఆకాష్ ఎందుకు చెబుతాడు... అందుకు సి.య్ం కూతురు ఎలా రియాక్ట్ అవుతుంది... తను ఎంతో ప్రేమించిన ఆకాష్ పట్ల హోం మినిష్టర్ కూతురు శ్రద్ధ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పర్ఫార్మెన్స్
ఎనర్జీకి చిరునామా అన్నట్లుగా ఉంటాడు రవితేజ. బెంగాల్ టైగర్ అనే టైటిల్ కి నూటికి నూరు శాతం సరిపోయే హీరో. ఆకాష్ నారాయణ్ ది ఫుల్ ఎనర్జీ క్యారెక్టర్. ఆ పాత్రను రవితేజ పవర్ ఫుల్ గా చేయడానికి పడిన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. కమర్షియల్ సినిమాల్లో కథానాయికలు ఎలా ఉండాలో తమన్నా, రాశీఖన్నా అలా గ్లామరస్ గా కనిపించారు. ఉన్నంతలో ఇద్దరూ బాగా కనిపించి, కనువిందు చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ థర్టీ ఇయర్స్ ఇండస్ర్టీ పృథ్వీ. తన కామెడీతో ఇరగదీసేశాడు. ఓ సీనియర్ కమెడియన్ కి రీప్లేస్ మెంట్ అవుతాడనే టాక్ ఈ మధ్య బాగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంతో ఆ ముద్ర బలంగా వేసేయొచ్చు. ఆ మధ్య 'జ్యోతిలక్ష్మి' చిత్రంలో పోలీసాఫీసర్ గా కనిపించిన ప్రియదర్శిని రామ్ ఈ చిత్రంలో ఓ నెగటివ్ రోల్ చేశారు. ఆ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ గుర్తుండిపోతుంది. గంభీరమైన కంఠస్వరం, మంచి ఫిజిక్ , పవర్ ఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో రామ్ ఆకట్టుకుంటాడు. పోసాని తనదైన శైలిలో నవ్వించారు. సీఎయంగా బొమన్ ఇరానీ హుందాగా కనిపించాడు. డైలాగ్ డెలివరీ, వేషధారణ పరంగా నాగప్ప పాత్రలో రావు రమేష్ రొటీన్ కి భిన్నంగా అనిపించాడు. నాగినీడుది గుర్తుండిపోయే పాత్ర. బ్రహ్మనందం కొన్ని సన్నివేశాల్లో కనిపించి నవ్వించడానికి ట్రై చేశాడు. ఇంకా నాజర్, తనికెళ్ల భరణి, హర్షవర్థన్, షయాజీ షిండే, అక్ష, ప్రభ, సమీర్, సురేఖా వాణి, శ్యామల తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
రవితేజతో పక్కా కమర్షియల్ సినిమా తీస్తేనే వర్కవుట్ అవుతుందనే విషయాన్ని మైండ్లో పెట్టుకుని సంపత్ నంది అలాంటి కథతోనే ఈ సినిమా చేశాడు. ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్ తీశాడు. సెకండాఫ్ ఎక్కడో పట్టు తప్పింది. కానీ, అదేం మైనస్ కాదు. ఆరంభం నుంచి సెకండాఫ్ దాటిన కొన్ని నిమిషాల వరకూ అసలు హీరో ఏం చేయాలనుకుంటున్నాడు? అనే సస్పెన్స్ ని బాగా మెయిన్ టైన్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. భీమ్స్ స్వరపరచిన పాటలు కమర్షియల్ సినిమాలకు తగ్గట్టుగా ఉన్నాయి. ఫొటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. రాధామోహన్ వెనకాడకుండా ఖర్చుపెట్టారు. సినిమా మొత్తం రిచ్ గా ఉంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ చాలా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ కార్డ్ పడేసరికి ఈసారి రవితేజ బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు. అదే ఆలోచనతో సెకండాఫ్ సూపర్ గా ఉంటుందని ఆంచనా వేసుకుంటారు. అయితే, ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లేకపోవడం నిరాశపరిచే విషయం. కొంచెం సాగదీసినట్లుగా ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివి దాదాపు కామన్ కాబట్టి, పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. పైగా రవితేజ అంత సన్నగా కనిపించడం జీర్ణించుకోలేని విషయం. అతను కనుక అంతకు మునుపటి ఫిజిక్ తో కనిపించి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయ్యుండేది.


ఫైనల్ గా చెప్పాలంటే.. 'బెంగాల్ టైగర్' చాలా తెలివిగల జంతువు. ఆ పేరు పెట్టారు కాబట్టి హీరో పాత్ర తెలివిగా ప్రత్యర్థులను మట్టుబెట్టేలా చూపించడం బాగుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ కాబట్టి బి, సి ఏరియాల్లో ఈ బెంగాల్ టైగర్ వసూళ్లు పరంగా కూడా విజృంభించే అవకాశం ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !