View

భలే మంచి రోజు రివ్య్వూ

Friday,December25th,2015, 02:21 AM

చిత్రం - భలే మంచి రోజు
బ్యానర్ - 70యం.యం ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - సుధీర్ బాబు, వామిక, ధన్య బాలకృష్ణన్, ఫృధ్వీ, పరుచూరి వెంకటేశ్వరరావు, 'శంకరాభరణం' రాజ్యలక్ష్మీ, సాయికుమార్, ఐశ్వర్య, పోసాని కృష్ణమురళి, విద్యులేఖరామన్, వేణు, ప్రవీణ్, చైతన్య కృష్ణ తదితరులు
సంగీతం - సన్నీ.ఎం.ఆర్
కెమెరా: శ్యామ్ దత్
డైలాగ్స్ - అర్జున్, కార్తీక్
ఎడిటింగ్ - ఎం.ఆర్.వర్మ
నిర్మాతలు - విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీరామ్ ఆదిత్య.టి

 

'భలే మంచి రోజు'... చాలా పాజిటివ్ టైటిల్. ఒకే రోజులో జరిగే కథతో తీసిన ఈ సినిమా ద్వారా శ్రీరామ్ ఆదిత్య దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆయన చేసిన షార్ట్ ఫిలింస్ చూసి, అవకాశం ఇచ్చామనీ సుధీర్ బాబ అన్నారు. రెగ్యులర్ ఫార్ములాకి భిన్నంగా ఈ చిత్రం సాగుతుందనీ, సినిమా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నానని కూడా ఆయన చెప్పారు. సుదీర్ బాబు స్నేహితులు విజయ్, శశి ఈ చిత్రం ద్వారా నిర్మాతలుగా పరిచయం అయ్యారు. మరి.. నిర్మాతలుగా వారి తొలి ప్రయత్నం ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుంది? ఈ చిత్ర విజయంపై సుధీర్ బాబు నమ్మకం నిజమవుతుందా? కొత్త దర్శకుడికి మంచి పేరు వస్తుందా?.. చూద్దాం..

 

à°•à°¥
రామ్ (సుధీర్ బాబు) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తండ్రి (పరుచూరి గోపాలకృష్ణ)కి మెకానిక్ షెడ్ ఉంటుంది. ఆ మెకానిక్ షెడ్ కి వచ్చే కార్లును రామ్ బయటికి తీసుకెళుతుంటాడు. అలా బయటికి వెళ్లినప్పుడు ధన్య బాలకృష్ణన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. రామ్ చాలా రిచ్ పర్సన్ అని భావిస్తుంది ధన్య. ఓ సందర్భంలో తను తిరుగుతున్న కార్లకు ఓనర్ తను కాదని, తమది మెకానిక్ షెడ్ అని చెబుతాడు రామ్. ఆ కొన్ని రోజులకే ధన్య పెళ్లి సూర్య అనే వ్యక్తితో కుదరడం, రామ్ కి ధన్య హాండివ్వడం జరుగుతుంది. తనను ఘోరంగా మోసం చేసిందని తెలుసుకున్న రామ్ బాధపడిపోతాడు. కట్ చేస్తే...


ధన్య పెళ్లి రోజున ఆమె చెంప చెళ్లుమనిపించి, బుద్ధి చెప్పాలనే ప్లాన్ తో కారు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరతాడు రామ్. మధ్యలో మరో కారును యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్ కారణంగా కారులో కిడ్నాప్ చేస్తున్న పెళ్లికూతురు సీత (వామిక) తప్పించుకుంటుంది. తాము కిడ్నాప్ చేస్తున్న సీత యాక్సిడెంట్ వల్ల తప్పించుకుందన్న కోపంతో సాయికుమార్ అండ్ గ్యాంగ్ రామ్ ని, అతని ఫ్రెండ్ ని తమ ధియేటర్ లో కట్టి పడేస్తారు. కట్ చేస్తే..
తాము కిడ్నాప్ చేయబోయిన సీతను తీసుకువస్తేనే తన ఫ్రెండ్ ని వదులుతానని రామ్ ని బెదిరించి బయటికి పంపిస్తాడు సాయికుమార్. తనకు ఎవరో తెలీనీ సీతను రామ్ ఎలా వెతికి పట్టుకున్నాడు... పెళ్లికూతురు సీతను సాయికుమార్ గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేస్తుంది... ధన్య పెళ్లి చేసుకోబోతున్న సూర్యతో సీతకున్న లింకేంటి... ఫైనల్ గా సీతను రామ్ కనిపెట్టాడా... రామ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే ఈ చిత్ర కధాంశం.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
కారు షో రూమ్ లో పని చేసే కుర్రాడిగా సుధీర్ బాబు నటించాడు. మిడిల్ క్లాస్ కి చెందిన కుర్రాడిగా కనిపిస్తాడు. అమ్మా, నాన్న అంటే ప్రేమ, చెల్లెలంటే ఇష్టం, ప్రేయసి మీద ఉన్న కోపం, మళ్లీ మరో అమ్మాయితో ప్రేమలో పడటం.. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ చక్కగా ఆవిష్కరించాడు. ఫిజిక్ బాగుంటుంది కాబట్టి, ఫైట్ సీన్స్ లో నిజంగానే విలన్స్ ని రఫ్ఫాడిస్తున్న ఫీల్ కలుగుతుంది. నటనపరంగా సుధీర్ బాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. కథానాయిక వామిక ఫర్వాలేదనిపించుకుంది. ధన్యా బాలకృష్ణన్ నటన కూడా ఓకే. ఫాదర్ క్యారెక్టర్ లో పోసాని ఇరగదీశారు. సుధీర్ బాబు ఫాదర్ పాత్రలో పరుచూరి గోపాలృష్ణ చాలా బాగా చేశారు. పృథ్వీ కామెడీ సూపర్. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో సాయికుమార్ భేష్ అనిపించుకున్నారు. ఇంకా ప్రవీణ్, విద్యుల్లేకా రామన్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
ఈ సినిమా స్టోరీ లైన్ చాలా చిన్నది. పకడ్బందీ స్ర్కీన్ ప్లేతో నడిపించాలి. ఆ మేరకు దర్శకుడు మంచి స్ర్కీన్ ప్లే రాసుకున్నాడు. ఆరంభం నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్ మెయిన్ టైన్ చేయగలిగాడు. డైలాగ్స్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్నాయి.ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ శ్యామ్ దత్ కెమెరా. సన్నీ ఎం. ఆర్ ఇచ్చిన పాటలు కథానుసారం సాగుతాయి. పెళ్లి సాంగ్, సుధీర్, వామికల మీద వచ్చే డ్యూయెట్ బాగున్నాయి. డ్యుయెట్ చిత్రీకరణ బాగుంది. రీ-రికార్డింగ్ కూడా ఓ హైలైట్. టెక్నికల్ గా సినిమా బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ తో సినిమాని నిర్మించారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ ఫాస్ట్ గా, సెకండాఫ్ కూడా అదే విధంగా సాగే చిత్రం. కథలు ఎంపిక చేసుకోవడంలో సుధీర్ బాబు దాదాపు బెస్ట్ అనే చెప్పాలి. సక్సెస్ ఖాయం అనే నమ్మకంతో సుధీర్ ఈ సినిమా చేశాడు. అతని నమ్మకం నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. సినిమా మొత్తం హీరో చుట్టూనే తిరగాలనే ఇగో తనలో లేనట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ చిత్రం క్లయిమ్యాక్స్ లో పృథ్వీ నటన హైలైట్ గా నిలిచింది. పక్కన ఉన్న క్యారెక్టర్ కు హీరో ఆ మాత్రం స్కోప్ ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయమే. చిన్న పాయింట్ సినిమాని ఆసక్తికరంగా మలిచి, తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఫ్రెండ్ సుధీర్ బాబు కోసమే ఈ చిత్రాన్ని నిర్మాతలు నిర్మించారు. నిర్మాతలుగా కంటిన్యూ అయితే వాళ్ల నుంచి టేస్ట్ ఫుల్ సినిమాలు ఆశించవచ్చు. దర్శకుడికి కూడా మంచి భవిష్యత్తు ఉంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. ఆసక్తికరంగా సాగే మంచి క్రైమ్, కామెడీ ధ్రిల్లర్ ఇది. ప్రేక్షకులతో భలేగా ఉంది అనిపించుకుంటుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. బి, సి వర్గాలవారూ చూసే అవకాశం ఉంది. వాళ్లు కనుక బాగా చూస్తే.. మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !