కుర్ర హీరో నితిన్ హీరోగా 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన చిత్రం 'భీష్మ'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అనంతనాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా, నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మహా శివరాత్రి కానుకగా ఈ రోజు (21.2.2020) విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా... నితిన్ హిట్ కొట్టాడా... రివ్య్వూ మీ కోసం.
సింఫుల్ స్టోరీతో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా 'భీష్మ'. చక్కటి స్ర్కీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ తో డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం సూపర్బ్. భీష్మ పాత్రను నితిన్ అద్భుతంగా పోషించాడు. నటనతో పాటు చూడటానికి చాలా స్టైల్ గా, స్మార్ట్ గా ఉన్నాడు. ఫిట్ గా ఉన్న నితిన్ అందరినీ ఆకట్టుకుంటాడు. భీష్మ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. స్టడీస్ లో డ్రాప్ అవుట్ స్టూడెంట్ అయినప్పటికీ, ప్రముఖ కంపెనీ అధినేత భీష్మ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, తద్వారా ఆ కంపెనీ సి.ఈ.ఓ పోస్ట్ కి పర్మినెంట్ అవ్వడం, శత్రువును తెలివిగా దెబ్బ కొట్టడం, తను ప్రేమించిన అమ్మాయిని గెల్చుకోవడంలాంటి అంశాలతో కూడుకున్న హీరో క్యారెక్టరైజేషన్ లో నితిన్ ఒదిగిపోయాడు. కామెడీ, పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. టోటల్ గా సినిమాను తన భుజాలపై మోసాడు.
రష్మిక గ్లామర్ గా ఉంది. జిషు సేన్ గుప్తా, మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ డీసెంట్ గా ఉండటంతో సాంగ్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫోటోగ్రఫీ సూపర్బ్, ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. నిర్మాణపు విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టారు. దాంతో విజువల్ గా సినిమా చాలా బాగుంది.
ఫైనల్ గా 'భీష్మ' గురించి చెప్పాలంటే... ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. విషపూరితమైన ఎరువులతో పండిన పంటల వల్ల కలుగుతున్న నష్టాలను, ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రోత్సహించడం వల్ల కలిగే లాభాలను చాలా చక్కగా ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి మేసేజ్ ని ఎంటర్ టైన్ మెంట్ వేలో చెప్పడం చాలా బాగుంది. సో... అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించే సినిమా 'భీష్మ'. తప్పకుండా చూడాల్సిన సినిమా. డోంట్ మిస్ ఇట్.
ఫిల్మీ బజ్ రేటింగ్ - 3.5/5