చిత్రం - బీటెక్ బాబులు
బ్యానర్ - జేపీ క్రియేషన్స్
నటీనటులు - నందు, శ్రీముఖి, రోషిణి, అ
శ్విని తదితరులు
సంగీతం - అజయ్ పట్నాయక్
నిర్మాత - ధన జమ్ము
దర్శకత్వం - శ్రీను ఇమండి
విడుదల తేదీ - 8 డిసెంబర్, 2017
నందు, శౌర్య, శ్రీముఖి, రోషిణి ప్రధాన పాత్రల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్ పై ధన జమ్ము నిర్మించిన చిత్రం బీటెక్ బాబులు. శ్రీను ఇమండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు (8.12.2017) విడుదలయ్యింది. బీటెక్ బాబులు అనే యూత్ ఫుల్ టైటిల్ తో పాటు నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జీవితాల్లో జరిగిన సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి అందరినీ మెప్పించే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.
కథ
నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల జీవితాల్లో జరిగిన సంఘటనల ప్రధానాశంగా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. ఈ నలుగురు స్టూడెంట్స్ జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి... ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా వీరు విజయం సాధించారు అనేదే ఈ చిత్ర కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
నందు, శ్రీముఖి జంట చాలా బాగుంది. ఈ ఇద్దరి లవ్ ట్రాక్ యూత్ ని ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య చక్కటి కెమిస్ట్రీ కుదిరింది. వీరి ఫ్యాష్ బ్యాక్ లోని సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన కుర్రాళ్లు, వారి లవర్స్ కూడా బాగానే నటించారు. ముఖ్యంగా ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన షకలక శంకర్ పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ సూపర్బ్. అలీ పాత్రతో చేయించిన స్పూఫ్ లు నవ్విస్తాయి. అలీ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ, ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తుంది. వైవా హర్ష, సూర్య, జబర్ దస్త్ రాఘవ, పటాస్ ప్రకాశ్, నోవల్ కిషోర్, రాణి, ఖుష్బు, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక వర్గం
స్టోరీ లైన్ పాతదే. స్ర్కీన్ ప్లే పరంగా డైరెక్టర్ మరి కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చిన డైరెక్టర్ ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. నలుగురు ఫ్రెండ్స్ కలుసుకోవడం బాగుంది. కానీ వారి అలవాట్లు, ఎదుర్కొనే ఇబ్బందులను డైరెక్టర్ ఇంప్రసివ్ గా చూపింలేకపోవడం నిరాశను కలిగిస్తుంది. చాలా సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. తాగుబోతు రమేష్ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకోలేదు. పాటలు వినసొంపుగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. దాంతో విజువల్ గా సినిమా ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి తక్కువ కావడం ఓ ప్లస్ పాయింట్. కథకు సరిపడా బడ్జెట్ తో సినిమాని నిర్మించడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
యూత్ కి మంచి మెసేజ్ ఇవ్వడం బాగుంది. కెరీర్ ని యూత్ చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉండాలనే పాయింట్ ని డైరెక్టర్ బాగా డీల్ చేసాడు. నటీనటులందరూ చక్కగా పెర్ ఫామ్ చేసారు.
ఫైనల్ గా చెప్పాలంటే... బీటెక్ బాబులు యూత్ ని ఆకట్టుకుంటారు.
ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5