View

చీకటి రాజ్యం మూవీ రివ్య్వూ

Friday,November20th,2015, 01:28 AM

చిత్రం - చీకటి రాజ్యం
బ్యానర్ - రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, శ్రీ గోకులం మూవీస్
నటీనటులు - కమల్ హాసన్, త్రిష, ఆషా శరత్, ప్రకాష్ రాజ్, మధుశాలిని, సంపత్ రాజ్, కిషోర్, యుగి సేతు, అమన్ అబ్ధుల్లా తదితరులు
సినిమాటోగ్రఫీ - సాను జాన్ వర్గీస్
ఎడిటింగ్ - షాన్ మొహమ్మద్
సంగీతం - జిబ్రాన్
డైలాగ్స్ - అబ్బూరి రవి
స్ర్కీన్ ప్లే - కమల్ హాసన్
నిర్మాతలు - గోకులం గోపాలన్, యస్. చంద్రహాసన్, కమల్ హాసన్
దర్శకత్వం - రాజేష్.యం.సెల్వ
విడుదల తేదీ - 20.11.2015


అల్రెడీ ఒక భాషలో హిట్టయిన సినిమా మరో భాషలో విడుదలైతే అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. ఆ విధంగా కమల్ హాసన్, త్రిష జంటగా రూపొందిన 'చీకటి రాజ్యం'పై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తమిళ వెర్షన్ దీపావళికి విడుదలై, విజయపథంలో దూసుకెళుతోంది. నూతన దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వ ప్రతిభను నమ్మి, కమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కమల్ సరసన 'మన్మథ బాణం'లో కథానాయికగా నటించిన త్రిష మరోసారి ఆయన సరసన జతకట్టిన చిత్రం ఇది. ఆరంభం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ 'చీకటి రాజ్యం' కథేంటి? తెలుగు నేటివిటీకి ఈ చిత్రం దగ్గరగా ఉంటుంది? ఇక్కడ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూద్దాం..


à°•à°¥
దివాకర్ (కమల్ హాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. తన డిప్యూటీ మణి (యుగిసేత్) తో కలిసి కొకైన్ తీసుకెళుతున్న గ్యాంగ్ మీద అటాక్ చేస్తాడు దివాకర్. ఆ అటాక్ లో ఒక వ్యక్తి చనిపోతాడు. కొకైన్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి దివాకర్, మణి వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం అటాక్ జరిగిన స్థలాన్ని నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసర్స్ మల్లికా (త్రిష), మోహన్ (కిషోర్) రౌండప్ చేసి ఇన్విస్టిగేషన్ చేస్తారు. కట్ చేస్తే...


దివాకర్ కొడుకు వాసు (అమన్ అబ్దుల్లా)ను విఠల్ రావు (ప్రకాష్ రాజ్) కిడ్నాప్ చేయించి కొకైన్ బ్యాగ్ తీసుకురావాల్సిందిగా దివాకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే ఇందుకు మణి అంగీకరించడు. సగం సగం పంచుకోవాల్సిందేనని పట్టుబడతాడు. తన కొడుకును కాపాడుకోవడానికి కొకైన్ బ్యాగ్ తీసుకుని విఠల్ రావు హోటల్ కి వెళతాడు దివాకర్. అదే హోటల్లో ఉన్న మల్లికా... దివాకర్ ని చూసి అతను కూడా కొకైన్ వ్యాపారంలో ఇన్ వాల్వ్ అయున్నాడని ఫిక్స్ అవుతుంది. దాంతో అతన్ని పాలో అవ్వడం మొదలుపెడుతుంది. తన సీనియర్ మోహన్ కి ఇన్ ఫార్మ్ చేస్తుంది. దివాకర్ తను తీసుకొచ్చిన కొకైన్ బ్యాగ్ ని జెంట్స్ టాయ్ లెట్లో దాచేసి, తన కొడుకును ఇస్తే, కొకైన్ బ్యాగ్ ఇస్తానని విఠల్ రావుతో చెబుతాడు. దివాకర్ ని ఫాలో అయిన మల్లికా కొకైన్ బ్యాగ్ ని అక్కడి నుంచి తీసేసి, లేడీస్ టాయ్ లెట్ లో పెడుతుంది. బ్యాగ్ తీసుకోవడానికి వచ్చిన దివాకర్ బ్యాగ్ లేకపోవడంతో షాక్ అవుతాడు.


కొకైన్ బ్యాగ్ లేకుండా తన కొడుకును దివాకర్ ఎలా కాపాడుకుంటాడు... అసలు దివాకర్ కి కొకైన్ వ్యాపారంsy సంబంధం ఉందా? నార్కోటిక్ డిపార్ట్ మెంట్ లోనే కొకైన్ వ్యాపారంతో లింకులున్న వ్యక్తి ఎవరనే విషయం మల్లికా, దివాకర్ తెలుసుకుంటారా? అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
నీళ్లని ఏ పాత్రలో పోస్తే.. ఆ పాత్ర ఆకారానికి మారిపోతాయి. అలాగే, కమల్ హాసన్ ఏ పాత్రలో అయినా ఒదిగిపోగలుగుతారు. అందుకే లోకనాయకుడు అనిపించుకున్నారు. ఈ చిత్రంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ దివాకర్ గా కమల్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో చాలా హుందాగా ఉండటంతో పాటు కిడ్నాప్ కి గురైన తనయుడి కోసం ఆరాటపడే సన్నివేశాల్లో కమల్ నటన మనసుని హత్తుకునే విధంగా ఉంది. ప్రకాశ్ రాజ్ మరోసారి తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. పోలీసాఫీసర్ పాత్రలో త్రిష బాడీ లాంగ్వేజ్ బాగుంది. నెగటివ్ షేడ్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రకు కిశోర్ వంద శాతం నప్పాడు.. మధుశాలిని క్యూట్ గా ఉంది. కమల్ తో లిప్ లాక్ సీన్స్ లో నటించి, ఈ తరంలో నాయికల్లో లోకనాయకుడితో లిప్ లాక్ చేసిన హీరోయన్ల జాబితాలో చేరిపోయింది. ఇంకా, ఆశా శరత్, సంపత్ రాజ్ తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
చిన్న కథకు, బలమైన స్ర్కీన్ ప్లే రాసుకుని తీసిన సినిమా ఇది. సినిమా మొత్తం ఓ స్టార్ హోటల్ లో జరుగుతుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా చాలా వేగంగా సాగుతుంది. ఆ క్రెడిట్ కమల్ రాసిన స్ర్కీన్ ప్లేకి దక్కుతుంది. దర్శకుడు రాజేశ్ కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ భేష్ అనిపించుకున్నాడు. జిబ్రాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ బాగుంది. అబ్బూరి డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ రాయడంతో పాటు అబ్బూరి రవి కొన్ని సీన్స్ లో కనిపించారు. ఆయనతో కలిసి రచయిత రామజోగయ్య్ శాస్ర్తి కూడా కనిపించారు. టెక్నికల్ గా వెల్ మేడ్ మూవీ.


ఫిల్మీబజ్ విశ్లేషణ
'నెక్ట్స్ ఏం జరుగుతుంది' అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసే ఏ సినిమా అయినా సూపర్ హిట్ కావడం గ్యారంటీ. ఈ సినిమా అలానే ఉంది. తదుపరి ఏం జరుగుతుంది? కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆరంభం నుంచి చివరి వరకూ సస్పెన్స్ ని మెయిన్ టైన్ చేసే, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో ఈ చిత్రం సాగుతుంది. కమల్ హాసన్ నటన హైలైట్. ముఖ్యంగా కిడ్నాప్ కి గురైన తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన సీన్స్ లో ఆయన కళ్లు చెమర్చినప్పుడు ప్రేక్షకులు ఉద్వేగానికి లోనవుతారు. కమల్ ఎంత అద్భుతంగా నటించగలరో చెప్పడానికి ఈ చిత్రం మరో ఉదాహరణ. ఆయన కోసం సినిమా చూడాలి.


ఫైనల్ గా చెప్పాలంటే.. మంచి స్ర్కీన్ ప్లే ఓరియంటెడ్ మూవీస్ ని ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. వేగంగా సాగుతూ, థ్రిల్ కి గురి చేసే చిత్రాలను చూసేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్లకీ ఈ చిత్రం నచ్చుతుంది. ఓవరాల్ గా యూత్, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయదగ్గ చిత్రం. డోంట్ మిస్ 'చీకటి రాజ్యం'.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !