View

కొలంబస్ మూవీ రివ్య్వూ

Thursday,October22nd,2015, 02:26 PM

చిత్రం - కొలంబస్
బ్యానర్ - ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి, రోహిణి, ఫృథ్వీ, నాగినీడు, రాజేశ్వరీ తదితరులు
సంగీతం - జితిన్ రోషన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - జె.బి
సినిమాటోగ్రఫీ - భాస్కర్ సామల
నిర్మాత - అశ్వనీ కుమార్
కథ-స్ర్కీన్ ప్లే- ఎమ్మెస్ రాజు
డైలాగ్స్, డైరెక్షన్ - ఆర్.సామల
విడుదల తేదీ - 22.10.2015


సుమంత్ అశ్విన్ ఎంపిక చేసుకునే కథలు బాగుంటాయి. 'అంతకు ముందు ఆ తర్వాత' అంటూ హీరోగా అందరికీ దగ్గరై, లవర్స్, కేరింత.. ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలు చేశాడు. ఇప్పుడు 'కొలంబస్' అంటున్నాడు. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక కాబట్టి, ఇది లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. లవ్ స్టోరీస్ చేసే వయసులోనే సుమంత్ అశ్విన్ ఉన్నాడు కాబట్టి, ఇందులోని పాత్రకు వంద శాతం నప్పుతాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నూతన దర్శకుడు ఆర్. సామలతో అశ్వనీ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి.. ఈ చిత్రం సుమంత్ అశ్విన్ సక్సెస్ ట్రాక్ కి కొనసాగింపు అవుతుందా?... తెలుసుకుందాం.


à°•à°¥
అశ్విన్ (సుమంత్ అశ్విన్) రెండేళ్లు జైల్లో ఉంటాడు. తను ప్రేమించిన ఇందు వల్లనే జైలు పాలవుతాడు అశ్విన్. జైలు నుంచి బయటికి రాగానే ప్రేమికురాలు ఇందు (మిస్తీ చక్రబర్తి) ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆమె ఫేస్ బుక్, ఫోన్ అన్నీ ఆఫ్ లో ఉంటాయి. ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కొడుకు ఇందూని మర్చిపోయి హాయిగా జీవితం గడపాలని అశ్విన్ తల్లి (రోహిణి) ఆశపడుతుంటుంది. ఆ క్రమంలో అశ్విన్ కి నీరజ (సీరత్ కపూర్)తో పరిచయం అవుతుంది. ఓ ఫ్రెండ్ ద్వారా ఇందు అడ్రస్ తెలుసుకున్న అశ్విన్ ఆమె ఇంటికి వెళతాడు. ఇందు అమెరికా వెళ్లిపోయిందని, ఆమె గురించి ఇక తమ ఇంటికి రావద్దని ఇందు తల్లిదండ్రులు చెప్పేస్తారు.


తనను ప్రాణంగా ప్రేమించే అశ్విన్ ని వదిలేసి ఇందు ఎక్కడికి వెళ్లిపోతుంది. అశ్విన్ ఎందుకు జైలు పాలవుతాడు. నీరజతో అశ్విన్ కి ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. తనను వదిలేసిన వెళ్లిపోయిన ఇందుని అశ్విన్ కనిపెట్టగలిగాడా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
సుమంత్ అశ్విన్ లో మంచి ఈజ్ ఉంది. ఎలాంటి పాత్రను అయినా సునాయాసంగా చేయగలుగుతాడు. తన ఎనర్జీ లెవల్స్ కూడా బాగుంటాయి. ఈ చిత్రంలో అశ్విన్ పాత్రను చాలా ఎనర్జిటిక్ గా చేశాడు. కాలేజ్ స్టూడెంట్ గా, జాబ్ హోల్డర్ గా, ప్రేయసిని విడిపోయి ఆమె కోసం అన్వేషించే ప్రియుడిగా... ఇలా అశ్విన్ పాత్రలో పలు షేడ్స్ ను చక్కగా ఆవిష్కరించగలిగాడు. కథానాయికలు మిస్తీ చక్రవర్తి, సీరత్ కపూర్ నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేశారు. గ్లామరస్ గా కనిపించడంతో పాటు చక్కని నటన కనబర్చగలిగారు. మిస్తీది స్వార్థ బుద్ధి ఉన్న క్యారెక్టర్.. సీరత్ ది త్యాగ గుణం ఉన్న క్యారెక్టర్ కాబట్టి, సీరత్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. నీరజ పాత్రను తను బాగా చేసింది. సుమంత్ అశ్విన్ తల్లిదండ్రులుగా రోహిణి, పృథ్వీ బాగున్నారు. ఇంకా నాగినీడు, రాజేశ్వరి, వంశీ పాత్ర చేసిన నటుడు.. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం
ఇది ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. కథ,-స్ర్కీన్ ప్లే నిర్మాత, సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు అందించారు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీస్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కనిపించాయి. నూతన దర్శకుడు ఆర్. సామల టేకింగ్ ఓకే అనే విధంగా ఉంది. కథ, కథనం మీద ఎక్కువగా కసరత్తులు చేస్తే, మంచి దర్శకుడిగా నిలబడే అవకాశం ఉంది. జితిన్ రోషన్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. భాస్కర సామల ఫొటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏ విషయంలోనూ రాజీపడకుండా నూతన నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ చిత్రం ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. అశ్విన్ ను ఇందు ఎందుకు వదిలేసింది? అనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. సెకండాఫ్ లో ఆ సస్పెన్స్ వీడిపోతుంది. అప్పుడు మిగతా కథ కొంచెం ఊహించే విధంగా ఉంది. దాంతో ప్రేక్షకుడి ఎగ్జయిట్ మెంట్ కాస్తంత తగ్గే అవకాశం ఉంది. సెకండాఫ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుని ఉంటే, ఇంకా బాగుండేది. సినిమా మొత్తం ఆల్ మోస్ట్ నీట్ గా ఉంది. దాంతో ఇబ్బందిపడకుండా చూడొచ్చు. ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కి చాలా ప్లస్. నటుడిగా తనను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. గత చిత్రాల్లో ఇంకా తనలో కుర్రతనం ఛాయలు స్పష్టంగా కనిపించేవి. ఈ చిత్రంలో యూత్ ఫుల్ గా ఉన్నప్పటికీ కొంచెం మెచ్యుర్డ్ గా కనిపించాడు. దాంతో మరింత బాగున్నాడు. ఇప్పటికే సుమంత్ అశ్విన్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా మంచి కథలు, పాత్రలు పడితే కెరీర్ పరంగా తను చాలా ఎత్తుకు ఎదుగుతాడు.


ఫైనల్ గా చెప్పాలంటే... ప్రేమను ఇష్టపడనివాళ్లు ఉండరు కాబట్టి, ఈ లవ్ స్టోరీని ఓసారి చూడొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !