View

డియర్ మేఘ మూవీ రివ్య్వూ

Friday,September03rd,2021, 08:47 AM

చిత్రం - డియర్ మేఘ
నటీనటులు - మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు, పవిత్రా లోకేష్ తదితరులు
బ్యానర్ - వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్
మ్యూజిక్ - హరి గౌర 
కెమెరా - ఐ ఆండ్రూ
ఎడిటర్ - ప్రవీణ్ పూడి 
నిర్మాత - అర్జున్ దాస్యన్ 
రచన, దర్శకత్వం - సుశాంత్ రెడ్డి   


మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (3.9.2021) థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం. 


కథ
మేఘ (మేఘా ఆకాష్), అర్జున్ (అర్జున్ సోమయాజులు) ఇద్దరూ క్లాస్ మేట్స్. అర్జున్ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నమేఘ, ఆ విషయాన్ని అతనికి చెప్పడానికి వెనకడుగువేస్తూ ఉంటుంది. ఓ సందర్భంలో తన ప్రేమను అర్జున్ కు తెలియజేస్తుంది మేఘ. అర్జున్ కూడా మేఘపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఇంతగా ఇష్టపడి, ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వీరి జీవితంలోకి అదిత్ వస్తాడు. అదిత్ ని మేఘ ప్రేమిస్తుంది. అర్జున్ ని ఎంతో గాఢంగా ప్రేమించిన మేఘ అసలు ఎందుకు అదిత్ ని ప్రేమిస్తుంది... అర్జున్, అదిత్, మేఘ ల మధ్య సాగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి శుభం కార్డ్ ఎలా పడుతుంది తెరపై చూడాల్సిందే. 


నటీనటుల పెర్ ఫామెన్స్
మేఘ పాత్రలో మేఘా ఆకాష్ అద్భుతంగా నటించింది. మేఘ పాత్రకు రెండు వేరియెషన్స్ ఉన్నాయి. టీనేజ్ లవ్ స్టోరీ, అడల్ట్ లవ్ స్టోరీ. ఈ రెండింటిలోనూ చక్కటి హావాభావాలతో నటించి వావ్ అనిపించుకుంది. టీనేజ్ లవ్ స్టోరీలో అర్జున్ సోమాయాజులు పక్కగా ఫిట్ అయ్యాడు. ప్రేమను వ్యక్తపరచలేక, ఓ టీనేజ్ కుర్రాడు ఎదుర్కొనే ఫీల్ ని చాలా చక్కగా తెరపై ఆవిష్కరించాడు అర్జున్ సోమయాజులు. ఇక అదిత్ అరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సెకండాఫ్ లో అరుణ్ అదిత్ పాత్ర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. చక్కటి ఎనర్జీ లెవెల్స్ తో లవర్ తో లవ్ సీన్స్ లో, తల్లితో సెంటిమెంట్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేసాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 


సాంకేతిక వర్గం
చక్కటి లవ్ స్టోరీని ఎంచుకుని 'డియర్ మేఘ' ను తెరకెక్కించారు డైరెక్టర్ సుశాంత్ రెడ్డి. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఆసక్తిగా సినిమాని నడిపించడం సినిమాకి ప్లస్ పాయింట్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడూ సేఫ్ జానర్. ఇక లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. హరిగౌర ఈ చిత్రానికి పాటలు అందించారు. ట్యూన్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండటం కూడా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. విజువల్ గా కూడా సినిమా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ని రిచ్ గా చూపించారు సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ. ఎడిటింగ్ కూడా బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ ను సమకూర్చడంలో నిర్మాత అర్జున్ దాస్యం సక్సెస్ అయ్యారు. అన్ని హంగులూ ఈ సినిమాకి చక్కగా కుదిరాయి. 


విశ్లేషణ
ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే కుదిరితే, ఆడియన్స్ ని మెప్పించడం చాలా ఈజీ. 'డియర్ మేఘ' విషయంలోనూ చక్కటి కథ, గ్రిప్పంగ్ స్ర్కీన్ ప్లే ప్లస్ అయ్యింది. టీనేజ్ లో పుట్టే ప్రేమ, అడల్ట్ లైఫ్ లో చిగురించే ప్రేమ, ఈ రెండింటి మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణ… దానికి డైరెక్టర్ ఇచ్చిన పరిష్కారం సూపర్బ్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, తల్లి, కొకుడుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. ఫస్టాప్ లో టీనేజ్ లవ్ స్టోరీ, సెకండాఫ్ లో అడల్డ్ లవ్ స్టోరీ... ఆసక్తికరమైన ట్విస్ట్ లతో చాలా ఫాస్ట్ గా సినిమా పూర్తయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్ గా సాడ్ ఎండింగ్ ఆడియన్స్ ని భావోద్వేగాలకు గురిచేస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సో... డింట్ మిస్ ది మూవీ. 'మేఘ' మీ 'డియర్' అయిపోతుంది.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25 / 5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !