View

డిక్టేటర్ మూవీ రివ్య్వూ

Thursday,January14th,2016, 10:52 AM

చిత్రం - డిక్టేటర్
బ్యానర్స్ - ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్
నటీనటులు - నందమూరి బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, సుమన్, రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్, నాజర్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, కబీర్ దూహన్ సింగ్, విక్రమ్ జీత్, అజయ్ తదితరులు
సంగీతం - యస్.యస్.తమన్
సినిమాటోగ్రఫీ - శ్యామ్.కె.నాయుడు
ఎడిటింగ్ - గౌతంరాజు
రచన - శ్రీధర్ సీపాన
కథ - కోన వెంకట్, గోపీ మోహన్
డైలాగ్స్ - ఎం.రత్నం
స్ర్కీన్ ప్లే - కోన వెంకట్, గోపీ మోహన్
నిర్మాణం - ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్
నిర్మాత, దర్శకత్వం - శ్రీవాస్


సంక్రాంతి అంటే నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఫేవరెట్ సీజన్. ఈ పండగ సందర్భంగా విడుదలైన బాలయ్య చిత్రాల్లో దాదాపు సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రాల సంఖ్యే ఎక్కువ. 'డిక్టేటర్'పై భారీ అంచనాలు నెలకొనడానికి ఇదొక కారణం. ప్లస్ టైటిల్ మరో కారణం. ఇక.. హీరోలను క్లాస్, మాస్.. రెండు రకాలుగా ఆవిష్కరించడంలో దర్శకుడు శ్రీవాస్ బెస్ట్. తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారాడు శ్రీవాస్. ఇప్పటికే బాలయ్య లుక్, టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. సో.. సంక్రాంతి బరిలోకి ఓ పాజిటివ్ వైబ్ తో వచ్చిన ఈ 'డిక్టేటర్' ఎలా ఉంటాడో చూద్దాం...


à°•à°¥
చందు (నందమూరి బాలకృష్ణ) ఓ మాల్ లో సూపర్ వైజర్ గా వర్క్ చేస్తుంటాడు. తన మామయ్య (నాజర్) కుటుంబంతో కలిసి ఉంటాడు. చందు భార్య కాత్యాయని (అంజలి)లా ఫోన్ లో మాట్లాడి కుటుంబ సభ్యులను నమ్మిస్తుంటుంది చందు మరదలు శృతి (అక్ష). ఓ సందర్భంలో ఇందు (సోనాల్ చౌహాన్) తో చందుకు పరిచయం అవుతుంది. ఇందు విషయంలో లోకల్ ఎమ్మేల్యే కొడుకుతో, అతని వెనుకున్న రౌడీ గ్యాంగ్ తో చందు గొడవపడాల్సి వస్తుంది. ఆ గొడవలో ఎమ్మేల్యే కొడుకుని, అతని వెనుకున్న గ్యాంగ్ ని చందు చంపేస్తాడు. దాంతో ఎమ్మేల్యే చందుని పట్టుకుని చంపాలనే కసితో ఉంటాడు. మరోవైపు పోలీసులు కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల చందుని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి సందర్భంలో మాల్ లో జరిగిన ఓ దొంగతనం కారణంగా చందు పోలీసులకు చిక్కుతాడు. ఆ న్యూస్ టివి చానెల్స్ లో టెలికాస్ట్ అవ్వడంతో చందు పోలీసులు దగ్గర ఉన్న విషయం ఎమ్మేల్యేకి, రౌడీ గ్యాంగ్ కి తెలిసిపోతుంది. మరోవైపు ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ రాజశేఖర్ (సుమన్) కూడా న్యూస్ చానెల్ లో చందుని చూసి ఖంగుతింటాడు. ఢిల్లీలో ఉన్న రాజశేఖర్ హుటాహుటిన చందుని కలుసుకోవడానికి హైదరాబాద్ వచ్చేస్తాడు. అదే సమయంలో కస్టడీలో ఉన్న చందుని పోలీసుల సహాయంతోనే తమ వద్దకు రప్పించుకుని చంపడానికి ప్లాన్ చేస్తారు ఎమ్మేల్యే, రౌడీ గ్యాంగ్. కట్ చేస్తే...


రాజశేఖర్ తన ఇన్ ఫ్లూయెన్స్ ఉపయోగించి పోలీసుల సహాయంతో ఎమ్మేల్యే, రౌడీ గ్యాంగ్ చందుని తీసుకెళ్లిన ప్లేస్ ని ట్రేస్ చేయిస్తాడు. పైగా చందు మావయ్యకు చందు ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సి.ఇ.ఓ అని, అతని పేరు చంద్రశేఖర్ ధర్మ అని చెబుతాడు. తన అల్లుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని తెలుసుకుని షాక్ అవుతాడు నాజర్.


పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన చందు అలియాస్ చంద్రశేఖర్ ధర్మ అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి?. అతను ఓ మాల్ లో వర్క్ చేస్తూ మామూలు వ్యక్తిలా ఎందుకు ఉంటాడు.. అతని భార్య కాత్యాయనికి ఏమయ్యింది... చంద్రశేఖర్ ధర్మ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలుసుకుని ఢిల్లీ ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆటాడిస్తున్న మహిమా రాయ్ ఎందుకు కంగారుపడుతుంది... అనేదే ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పర్ఫార్మెన్స్
డిక్టేటర్ గా జోరుగా, చందూగా కూల్ గోయింగ్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రను నందమూరి నటసింహం బాలకృష్ణ అద్భుతంగా పోషించారు. పంచ్ డైలాగ్స్ ని పలకడంలో తనకు తిరుగు లేదని మరోసారి బాలయ్య నిరూపించుకున్నారు. 'గం గం గణణేశా...', 'వాట్సాప్ బేబి...' పాటల్లో తన స్టెప్స్ తో అలరించారు. విలన్లను గాల్లో ఎగిరి తన్నే సీన్స్ అభిమానులకు ఐ-ఫీస్ట్. మొత్తానికి సంక్రాంతి పండగకు తన అభిమానులను సంబరపరిచారు. బాలయ్య సరసన అంజలి బాగుంది. కొద్దో గొప్పో పేరు తెచ్చే పాత్ర తనది. సొనాల్ చౌహాన్ హాట్ గా ఉంది. లేడీ విలన్ పాత్రలో ఒకప్పటి నాయిక రతి ష్రెష్ గా ఉంది. సుమన్, నాజర్, షయాజీ షిండే, కబీర్, రాజీవ్ కనకాల, అక్ష తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముమైత్ ఖాన్, శ్రద్ధాదాస్ ఐటమ్ పాటలో మెరిశారు.


సాంకేతిక వర్గం
కథ ఓకే. ఆ కథను పకడ్బందీ స్ర్కీన్ ప్లేతో శ్రీవాస్ తెరకెక్కించాడు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్నీ ఉన్న పక్కా మాస్ కమర్షియల్ మూవీ ఇది. బాలయ్య ఎలాంటి సినిమా చేస్తే అభిమానులు సంతృప్తిపడతారో శ్రీవాస్ అలాంటి సినిమానే చేశాడు. కమర్షియల్ మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. సీన్ సీన్ కి పంచ్ డైలాగ్స్ తో విసుగు పుట్టించకుండా ఎక్కడ అవసరమో అక్కడే పెట్టడం బాగుంది. తమన్ పాటలు ఓ ప్లస్. శ్యామ్ కె. నాయుడు కెమెరా పనితనం బాగుంది. ఈరోస్ తో కలిసి శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీపడని వైనం స్పష్టంగా కనిపిస్తుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ చాలా కూల్ గా సాగుతుంది. చందు పాత్ర ఎందుకంత కూల్ గా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ సస్పెన్స్ ని చక్కగా మెయిన్ టైన్ చేశాడు డైరెక్టర్ శ్రీవాస్. ఇంటర్వెల్ లో సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్ చాలా రేసీగా ఉంటుంది. సంక్రాంతికి ఇవ్వాల్సిన సినిమానే ఇచ్చారు. ఇది బాలకృష్ణ షో. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్.


ఫైనల్ గా చెప్పాలంటే... ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ ఎంటర్ టైనర్సే చేస్తాను. నా అభిమానులు మెచ్చే విధంగానే నా సినిమాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. ప్రయోగాలకు దాదాపు దూరం అని మొన్నా మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ అన్నారు. ప్రేక్షకులు ఆశించిన చిత్రమే చేశారాయన. ఈ సంక్రాంతికి 'డిక్టేటర్' మంచి పైసా వసూల్ మూవీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !