View

దృశ్యం మూవీ రివ్వ్యూ

Wednesday,July09th,2014, 04:45 PM

నటీనటులు: వెంకటేష్, మీనా, కార్తీక, ఎస్తర్, నరేష్, రవి కాలే, నదియా తదితరులు

రచన: పరుచూరి బ్రదర్స్

మాటలు: 'డార్లింగ్' స్వామి

సంగీతం: శరత్

కెమెరా: ఎస్. గోపాల్ రెడ్డి

ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

సమర్పణ: డి. రామానాయుడు

నిర్మాతలు: డి. సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి

కథ: జీతు జోసెఫ్

దర్శకత్వం: శ్రీప్రియ

 

వెంకటేష్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో రీమేక్ చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు చేసినవి తమిళ చిత్రాల రీమేక్స్. తొలిసారి ఓ మలయాళ చిత్రం రీమేక్ లో నటించాడు. అదే 'దృశ్యం'. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ రికార్డ్ స్థాయి వసూళ్లు కురిపించింది. బేసిక్ గా ఇది కుటుంబ కథా చిత్రమైనప్పటికీ యూత్ కూడా చూశారు. మరి.. తెలుగు 'దృశ్యం' ఎలా ఉంది? మోహన్ లాల్ చేసినట్లుగానే తండ్రి పాత్రను వెంకటేష్ అద్భుతంగా చేశాడా? ఈ 'దృశ్యం' ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది?... ఆ విషయాల్లోకి వెళదాం...

à°•à°¥

రాంబాబు (వెంకటేశ్) à°“ అనాథ. అంచలంచెలుగా పైకెదుగుతాడు. కేబుల్ టీవీ ఆపరేటర్. తన భార్య జ్యోతి (మీనా), ఇద్దరు కూతుళ్లతో ఆనందంగా ఉంటాడు రాంబాబు. తనకు సినిమాలంటే పిచ్చి. à°Žà°‚à°¤ పిచ్చి అంటే రాత్రిళ్లు ఇంటికెళ్లకుండా కూడా తన కేబుల్ టీవీ ఆఫీసులో కూర్చుని సినిమాలు చూస్తాడు. ఏదైనా సినిమాలో రొమాంటిక్ సీన్ చూస్తే చాలు.. భార్యతో రొమాన్స్ చేయడానికి ఇంటికెళతాడు రాంబాబు. తన వృత్తి, భార్యాపిల్లలు తప్ప రాంబాబుకి వేరే ప్రపంచం ఉండదు. రాంబాబు పెద్ద కూతురు అంజు (కార్తీక) కాలేజ్ తరఫున à°“ క్యాంప్ à°•à°¿ వెళుతుంది. తను స్నానం చేస్తున్నప్పుడు వరుణ్ అనే స్టూడెంట్ వీడియో తీస్తాడు. అది చూపించి, అంజూని బెదిరిస్తాడు. à°’à°• రాత్రి తనతో గడపకపోతే, à°† వీడియోని ఇంటర్నెట్ లో పెడతానంటాడు. రాత్రి పదకొండు గంటలకు ఇంటి వెనక వెయిట్ చేస్తానని, రాకపోతే బాగుండదని అంజూని హెచ్చరిస్తాడు. అతనికి భయపడి రాత్రి చెప్పిన సమయానికి తన ఇంటి వెనక ఉన్న గోడౌన్ లోకి వెళుతుంది అంజు. వరుణ్  à°¹à±†à°šà±à°šà°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°ªà±à°ªà±à°¡à± అంజు తల్లి అక్కడికొచ్చి తమ కుటుంబాన్ని బజారుకీడ్చవద్దని బతిమాలుకుంటుంది. అయితే, కూతురికి బదులు నువ్వు à°°à°¾ అంటాడు. తల్లిని à°…à°‚à°¤ మాట అన్న వరుణ్ ని కర్రతో తల మీద బలంగా కొడుతుంది అంజు. అతను చనిపోతాడు. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికొచ్చిన రాంబాబు అసలు విషయం తెలుసుకుని ఖంగుతింటాడు. వరుణ్ ఐజీ (నదియా) కొడుకు. తన కుమారుడు కనబడకపోవడంతో భర్త (నరేష్)తో కలిసి వెతకడం మొదలుపెడుతుంది. తన భార్య, కూతురు జైలు పాలు కాకుండా, వరుణ్ ని చంపేసిన విషయం బయటపడకుండా ఉండటానికి రాంబాబు ఏం చేశాడు? అనే కథతో à°ˆ చిత్రం సాగుతుంది.

 

నటీనటుల పర్ఫార్మెన్స్

స్వతహాగా కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతంగా నటించే వెంకటేష్ ఈ చిత్రంలో రాంబాబు పాత్రను బాగా చేశాడు. తన కూతురికి జరిగిన అన్యాయానికి రగిలిపోయే తండ్రిగా, కూతురు జీవితం అన్యాయం అవుతుందేమోనని ఒత్తిడికి గురయ్యే తండ్రిగా వెంకటేష్ నటన సూపర్బ్. వెంకీ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనదగ్గ పాత్రల్లో రాంబాబు పాత్రకు అగ్రస్థానమే ఇవ్వాలి. ఇక, కూతురి భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోయే తల్లిగా మీనా బాగా యాక్ట్ చేసింది. కార్తీక, ఎస్తర్ లు కూడా బాగా నటించారు. శక్తిమంతమైన పోలీసాఫీసర్ పాత్రకు నదియా న్యాయం చేసింది. ఇంకా నరేష్, రవి కాలే తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం...

ఒకప్పుడు నటిగా భేష్ అనిపించుకున్న శ్రీప్రియ ఈ చిత్రంతో దర్శకురాలిగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇది రీమేక్ సినిమాయే అయినప్పటికీ మాతృకలోని ఫ్లేవర్ పోకుండా చక్కగా ఆవిష్కరించారు. ఒరిజినల్ కథకు తెలుగు హంగులు అద్దడంలో పరుచూరి బ్రదర్స్, మంచి సంభాషణలు రాయడంలో 'డార్లింగ్' స్వామి సక్సెస్ అయ్యారు. సినిమాలో ఉన్నది రెండే పాటలైనా 'ప్రతిరోజు పండగ...' పాట టచింగ్ గాఉంది. కెమెరా పనితనం ఓ కనువిందు. ఎడిటింగ్ చాలా బాగుంది. రీ-రికార్డింగ్ కూడా బాగా కుదిరింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ

తెలుగు తెరపై రాని కథ ఇది. చాలా ఫ్రెష్ గా ఉంది. ఆ ఫ్రెష్ నెస్సే సినిమాకి అడ్వాంటేజ్ అయ్యింది. కుటుంబ కథా చిత్రాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించడం కొత్తగా ఉంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే విధంగా ఉంది. మలయాళ సినిమాని యథాతథంగా తీశారు. అయినప్పటికీ అదేం మైనస్ కాదు. ఎందుకంటే, ఈ సినిమాని వేరేలా ట్రై చేస్తే అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. ఈ చిత్రానికి ప్రధాన బలం స్ర్కీన్ ప్లే. ప్రథమార్ధం ఆరంభంలో కొంచెం స్లోగా సాగినా, ఆ తర్వాత సినిమా వేగంగా సాగుతుంది.

ఫైనల్ గా చెప్పాలంటే...

నేటితరం సినిమాల్లో హీరోయిజమ్ ని ఎలివేట్ చేయాలంటే భారీ ఫైట్స్ పెడతారు. విలన్లను హీరోలతో చితగ్గొట్టిస్తారు. బాంబులు పేల్చుతారు.. సుమోలు లేపుతారు. హీరోయిన్ తో డ్యూయెట్ లు పాడిస్తారు. పక్కన ఉన్న కమెడియన్లను హీరోలతో బకరాలను చేయిస్తారు. ఇదే పక్కా కమర్షియల్ ఫార్ములా అని, పక్కా హిట్ ఫార్ములా అని  à°šà±†à°¬à±à°¤à±à°‚టారు. కానీ à°ˆ సినిమా à°ˆ ఫార్ములాకి భిన్నం. అయినప్పటికీ కమర్షియల్ à°—à°¾ పైసా వసూళ్లు చేస్తుంది. పైన చెప్పిన హీరోయిజమ్ లక్షణాలేవి à°ˆ సినిమాలో హీరోకి  à°‰à°‚డవు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం బుర్రను ఉపయోగిస్తాడు. అంతే... చివరికి పోలీసుల దగ్గర తన్నులు కూడా తింటాడు. కానీ, మనం థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పటికీ 'రియల్ హీరో' అనుకోకుండా ఉండలేం.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ దృశ్యం ప్రేక్షకులను ఓ తీయని అనుభూతికి గురి చేయడంతో పాటు, చెరగని ముద్ర వేస్తుంది.

 

Drishyam movie review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !