View

డైనమైట్ మూవీ రివ్య్వూ

Thursday,September03rd,2015, 09:59 PM

చిత్రం - డైనమైట్
బ్యానర్ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
సమర్పణ - అరియానా, వివియానా
నటీనటులు - మంచు విష్ణు, ప్రణీత, లేఖా వాషింగ్టన్, జె.డి.చక్రవర్తి, పరుచూరి వెంకటేశ్వరరావు, రవిప్రకాష్, నాగినీడు, భవాని తదితరులు
సినిమాటోగ్రఫీ - సతీష్ ముత్యాల
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
డైలాగ్స్ - బి.వి.యస్.రవి
సంగీతం - అచ్చు
కథ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాత - మంచు విష్ణు
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దేవా కట్టా
విడుదల తేదీ - 4.9.2015

 

'డైనమైట్'... ఈ టైటిల్ తో సినిమా చేయాలంటే కథలో దమ్ముండాలి. హీరోలో ఫైర్ ఉండాలి. దర్శకుడిలో దమ్ముండాలి. అప్పుడే ఆ టైటిల్ కు న్యాయం జరుగుతుంది. సినిమా అదిరిపోతుంది. మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రానికి 'డైనమైట్' టైటిల్ ఖరారు చేయగానే జనాలు మాట్లాడుకున్న మాటలివి. ఆల్రెడీ తమిళంలో ప్రూవ్ అయిన కథ కాబట్టి, కథలో దమ్ముంటుంది. ఇక, హీరోలో ఫైర్ విషయానికొస్తే, విష్ణులో అది పుష్కలంగా కనిపిస్తుంది. మంచి కండలు దిరిగిన దేహం, కళ్లల్లో ఫైర్ అచ్చంగా డైనమైట్ అంత పవర్ ఫుల్ అని చెప్పొచ్చు. వెన్నెల, ప్రస్థానం తదితర చిత్రాలతో స్టయిలిష్ డైరెక్టర్ అనిపించుకున్నారు దేవా కట్టా. మరి.. వీళ్ల కాంబినేషన్లో రూపొందిన 'డైనమైట్' ఎలా ఉందో చూద్దాం...

 

à°•à°¥

శివాజీకృష్ణ అలియాస్ శివ్ (మంచు విష్ణు) సెల్ఫ్ ఎంప్లాయ్. అమ్మాయిని ఏడిపిస్తున్న ఓ పోకిరిని రోడ్డు మీద కొడుతూ అనామిక దాసరి (ప్రణీత) కంట పడతాడు శివ్. అంతమంది రోడ్డు మీద ఉన్నా, ఓ అమ్మాయిని కాపాడటానికి ఎవ్వరూ రాకపోవడం, శివ్ బాధ్యతగా ఆ పోకిరిని కొట్టడం పట్ల ఇంప్రెస్ అవుతుంది అనామిక. శివ్ కూడా తొలి చూపులోనే ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఆ మరుసటి రోజే శివ్ యాటిట్యూడ్ ని మెచ్చుకుంటూ మెసేజ్ పెడుతుంది అనామిక. ఆమెను డిన్నర్ కి ఆహ్వానిస్తాడు శివ్. అలా ఓ రెస్టారెంట్ లో కలుసుకున్న శివ్, అనామికలకు ఒకరంటే ఒకరికి ఇష్టం కలుగుతుంది. ఆమెతో కలిసి ఆమె ఫ్లాట్ కి వెళతాడు శివ్. తను ఫ్రెష్ అవుతున్నప్పుడు అనామికను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆమెను కాపాడటానికి శివ్ ప్రయత్నం చేస్తూ పోలీసులకు ఇన్ ఫార్మ్ చేస్తాడు. అనామిక ఫ్లాట్ కి వెళ్లి చెక్ చేసిన పోలీసులకు అనామిక ఆ ఫ్లాట్ కి వచ్చి నాలుగు రోజులు అవుతుందని, ఆమె గోవాలో ఉంటుందని సెక్యూర్టీ గార్డ్ చెబుతాడు. అనామిక దాసరి 24చానెల్ ఓనర్ కూతురు అన్న సంగతి తెలుసుకున్న పోలీసులు అనామిక తండ్రి రంగనాధ్ దాసరి (పరుచూరి వెంకటేశ్వరరావు)ని కూతురు గురించి అడుగుతారు. ఆయన కూడా తన కూతురు గోవాలో ఉందని చెబుతాడు. దాంతో శివ్ కన్ ఫ్యూజ్ అవుతాడు. కానీ ఏదో జరుగుతుందని గ్రహించిన శివ్.... అనామిక దాసరి తండ్రి రంగనాధ్ దాసరి ఇంటికి వెళతాడు. అక్కడ అనామికను కిడ్నాప్ చేసిన గ్యాంగ్, పోలీసుల సహాయంతో అనామిక తండ్రి రంగనాధ్ ను ఓ వీడియో చిప్ ఇవ్వాల్సిందిగా బెదిరిస్తుంటారు. అక్కడే ఉన్న శివ్ ని చూసిన కిడ్నాపర్స్ కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో అనామిక తండ్రి చనిపోవడం జరుగుతుంది.

అనామికను ఆ కిడ్నాపర్స్ దగ్గర్నుంచి కాపాడాలని వారిని వెంటాడతాడు శివ్. కిడ్నాపర్స్ ఆ వీడియో చిప్ ని తీసుకుని అనామికను సైతం చంపడానికి ప్లాన్ చేస్తారు. వారినే వెంటాడుతున్న శివ్... ఆ వీడియో చిప్ ని దక్కించుకోవడంతో పాటు అనామికను కిడ్నాపర్స్ బారి నుంచి కాపాడతాడు. ఆ వీడియో చిప్ లో ఏదో పెద్ద రహస్యమే దాగి ఉందని గ్రహించిన శివ్, అనామిక దానిని అన్ లాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.


సెంట్రల్ ఐ.బి మినిష్టర్ రిషిదేవ్.. శివ్, అనామికను చంపి అయినా సరే ఆ వీడియో చిప్ ని తీసుకురావాల్సిందిగా తన గ్యాంగ్ కి పురమాయిస్తాడు. అప్పట్నుంచి రిషిదేవ్ గ్యాంగ్ శివ్, అనామికను వెంటాడుతూ ఉంటుంది. రిషిదేవ్ తన పవర్ ని ఉపయోగించి, మొత్తం పోలీస్ బలగాన్ని చేతుల్లోకి తీసుకుని శివ్, అనామికను వెంటాడుతూ ఉంటాడు. అసలు ఆ వీడియో చిప్ లో రిషిదేవ్ కి సంబంధించిన ఎలాంటి రహస్యం దాగుంది... సెంట్రల్ మినిష్టర్ అయిన రిషిదేవ్ ని శివ్ ఎలా ఎదుర్కొంటాడు... ఆ వీడియో చిప్ లో ఉన్న రహస్యాన్ని ఎలా బట్టబయలు చేసాడనేదే ఈ చిత్రం సెకండాఫ్.

 


నటీనటుల ఫర్మార్మెన్స్

విష్ణు మంచి పర్ఫార్మర్. తన టాలెంట్ కు తగ్గ కథ దొరికిన ప్రతిసారీ ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లో ముఖ్యంగా 'అనుక్షణం', 'రౌడీ'లో విష్ణు అద్భుతమైన నటన కనబర్చాడు. ఇక, 'డైనమైట్'లో నటుడిగా మరో లెవల్ కి వెళ్లాడనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఉత్కంఠగా సాగుతుంది. ఆ మూడ్ ని తన నటన ద్వారా బాగా క్యారీ చేశాడు. ముఖ్యంగా చేజింగ్ సీన్స్ చాలా బాగా చేశాడు. రిస్కీ ఫైట్స్ ని డూప్ లేకుండా చేయడం అభినందనీయం. ఈ సినిమాలో విష్ణు చేసిన డ్యాన్సులు కూడా బాగున్నాయి. ప్రణీతతో చేసిన సెంటిమెంట్ సీన్స్ లో డైలాగులు పలికిన తీరు టచింగ్ గా ఉంటుంది. అలాగే, లవ్ సీన్స్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ లవ్లీగా ఉన్నాయి. ఓవరాల్ గా విష్ణు లో మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ఇది. ఈ సినిమా చేసే అవకాశం రావడం తన లక్ అని విడుదలకు ముందు ప్రణీత చెప్పింది. ఆ మాట నిజమే. డ్యాన్సుల కోసం హీరోయిన్ అన్నట్లుగా కాకుండా కథకు కీలక భాగంగా ఉన్న పాత్ర తనది. చేజింగ్ సీన్స్ లో టెన్షన్ గా కనిపించడం, భయపడటం వంటి ఎక్స్ ప్రెషన్స్ ని ప్రణీత బాగా ఇచ్చింది. రిషి పాత్రను జేబీ చక్రవర్తి సునాయాసంగా చేసేశాడు. తమిళ వెర్షన్ లోనూ ఈ పాత్రను జేడీయే చేశాడు. తెలుగులో కూడా తనే అయితే బాగుంటుందని విష్ణు, దేవా కట్టా జేడీని తీసుకున్నారు. నిజంగానే ఈ పాత్రకు జేడీయే బాగుంటాడనిపించింది. ఇతర పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, నాగినీడు, రవి ప్రకాశ్ తదితరులు బాగా నటించారు.

 

సాంకేతిక వర్గం

తమిళ 'అరీమా నంబి' కథలో పలు మార్పులు, చేర్పులు చేసి తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు దేవా కట్టా. స్ర్కీన్ ప్లే అద్భుతంగా కుదిరింది. ఫస్టాఫ్ అప్పుడే అయిపోయిందా అన్నంత వేగంగా సాగింది. సెకండాఫ్ కూడా అంతే. దేవా కట్టా చాలా స్టయిలిష్ గా ఈ చిత్రాన్ని తీశారు. ఏ సినిమాలోనూ కనిపించనంత స్టయిలిష్ గా విష్ణుని చూపించారు. ఓవరాల్ గా దేవా కట్టా భేష్ అనిపించుకున్నారు. బీవీయస్ రవి రాసిన డైలాగులు బాగున్నాయి. పంచ్ ల కోసం పాకులాడకుండా కంటెంటె ని దృష్టిలో పెట్టుకుని స్వీట్ అండ్ షార్ట్ గా డైలాగులు రాశారాయన. అచ్చు అందించిన పాటలు నాట్ బ్యాడ్. రీ-రికార్డింగ్ స్పెషలిష్ట్ చిన్నా మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఇక, విజయన్ మాస్టర్ ఫైట్స్ సూపర్బ్. చాలా స్టయిలిష్ గా ఉన్నాయి. రాజీపడని ఫైట్ మాస్టర్ గా విజయన్ కి పేరుంది. ఈ చిత్రం విషయంలో రాజీపడకుండా హీరో విష్ణుని బాగానే కష్టపెట్టారాయన. టేబుల్ కింద నుంచి జారుకుంటూ వెళ్లే సీన్, అమాంతంగా పడిపోయే సీన్స్ లో హీరోయిన్ ని కూడా కష్టపెట్టారు. టెక్నికల్ గా సినిమా బాగుంది.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ

ఈ మధ్యకాలంలో వచ్చిన యాక్షన్ మూవీస్ అన్నింటికన్నా భిన్నమైన చిత్రం ఇది. ఈ కథను విష్ణు సెలెక్ట్ చేసుకోవడం అభినందనీయం. ఆ కథకు దేవా కట్టా న్యాయం చేయగలడని జడ్జ్ చేయడం ప్రశంసనీయం. విష్ణు ఫిజిక్ బాగుంది. ఈ చిత్రం కోసం ఏ స్థాయిలో వర్కవుట్స్ చేశాడో అతని ఫిజిక్ తెలియజేస్తోంది. ఆరంభం నుంచి చివరి వరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా దర్శకుడు తీశాడు. హీరో, హీరోయిన్ కెమిస్ర్టీ బాగుంది. లవ్ ట్రాక్ చాలా హుందాగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ పెద్దగా లేకపోయినా, మంచి లవర్స్ అనే విషయం ప్రేక్షకులకు కమ్యూనికేట్ అయ్యే విధంగా సీన్స్ ఉన్నాయి. చిన్న పాయింట్ చుట్టూ థ్రిల్లింగ్ అంశాలు జోడించి, దర్శకుడు బాగా తీశారు.


ఫైనల్ గా చెప్పాలంటే... తమిళ చిత్రానికి ఇది రీమేక్ అయినప్పటికీ, ఆ ఛాయలేవీ కనిపించవు. స్ర్కీన్ ప్లే ఓరియంటెడ్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇది ఆ కోవకు చెందిన సినిమానే. పిల్లలు. పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేయదగ్గ చిత్రం. 'డి' అక్షరం విష్ణుకి కలిసొచ్చిందేమో అని మరోసారి అనొచ్చు. 'ఢీ' సూపర్ హిట్. 'దేనికైనా రెడీ' సూపర్ హిట్. 'దూసుకెళ్తా' సూపర్ హిట్. ఇప్పుడు 'డైనమైట్' సూపర్ హిట్. నో డౌట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !