View

ఈడో రకం ఆడో రకం మూవీ రివ్య్వూ

Thursday,April14th,2016, 11:09 AM

చిత్రం - ఈడో రకం ఆడో రకం
బ్యానర్ - ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక బదోరియా, హేబా పటేల్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, అభిమన్యుసింగ్, సుప్రీత్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, షకలక శంకర్, జ్యోతిసింగ్ తదితరులు
సంగీతం - సాయి కార్తీక్
సినిమాటోగ్రపీ - సిద్దార్ధ్
ఎడిటింగ్ - యం.ఆర్.వర్మ
నిర్మాత - రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం - జి.నాగేశ్వరరెడ్డి


మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఈడో రకం ఆడో రకం'. ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సోనారిక బదోరియా, హేబా పటేల్ కథానాయికలుగా నటించారు. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో హీరో విష్ణు ఉన్నాడు. పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఈ చిత్రం ఈ రోజు (14.4.2016) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అందరిని ఆకట్టుకునే విధంగా ఉందాం తెలుసుకుందాం.


కథ
అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్ (రాజ్ తరుణ్) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. పని పాటా లేకుండా అబద్దాలు చెబుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు. ఓ ఫ్రెండ్ మ్యారేజ్ లో నీలవేణి (సోనారిక బదోరియా) ని చూసి ప్రేమలో పడతాడు అర్జున్. నీలవేణి ప్రేమను పొందడానికి తను ఒక అనాధ అనే అబద్ధం ఆడతాడు. ఈ అబద్ధం అర్జున్, అశ్విన్ ల జీవితంలో చాలా మలుపులకు నాంది అవుతుంది. మరోవైపు సుప్రియ (హేబా పటేల్) ప్రేమలో పడతాడు అశ్విన్. కట్ చేస్తే...


అశ్విన్ ప్రేమించిన సుప్రియకు భర్తగా అర్జున్ నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్జున్ ప్రియురాలు నీలవేణికి భర్తగా అశ్విన్ నటించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను అర్జున్, అశ్విన్ ఎలా ఎదుర్కొన్నారు. తాము ప్రేమించిన అమ్మాయిలను ఎలా దక్కించుకున్నారు. ఈ ఇద్దరు కథలకు ఎలా శుభం కార్డ్ పడింది అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
అర్జున్ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయిన వైనం సూపర్. కామెడీ టైమింగ్ సూపర్. డైలాగ్ డెలివరీ విషయంలో విష్ణు అక్కడక్కడా తన తండ్రి మోహన్ బాబును తలపించారు. లుక్ పరంగా కూడా విష్ణు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉండటం ఓ ప్లస్. రాజ్ తరుణ్ కూడా అశ్విన్ పాత్రను చక్కగా పోషించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. సోనారిక, హేబా పటేల్ గ్లామర్ గా కనబడటంతో పాటు నటన పరంగా కూడా శభాష్ అనిపించుకునేలా ఉన్నారు. రాజేం్రప్రసాద్ ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
కామెడీ సినిమాలను వెండితెరపై చక్కగా ఆవిష్కరించగలమని మరోసారి నిరూపించుకున్నారు డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి. క్యారెక్టర్స్ ని కూడా చక్కగా తీర్చిదిద్దారు. కన్ఫూజన్ కామెడీ ని ప్రధానాంశంగా తీసుకుని చేసిన ఈ సినిమా విషయంలో డైరెక్టర్ ఎక్కడా కన్ ఫ్యూజ్ అవ్వలేదు. చాలా క్లారటీగా సినిమాని తెరకెక్కించారు. కాకపోతే ఎమోషన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నప్పటికీ ఆ పరంగా డైరెక్టర్ ప్రయత్నించలేద. దాంతో సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గానే మిగిలిపోయింది. సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 'కొక్కో కోడి...' పాట వినడానికి బాగుండటంతో పాటు విజువల్ గా కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చడంతో నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
అన్ని మర్చిపోయి హాయిగా నవ్వించే సినిమాలు చూడాలనే ఎక్కువ శాతం మంచి ఆడియన్స్ కోరుకుంటారు. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఫస్టాప్ చాలా సరదాగా సాగిపోతుంది. ఫస్టాప్ లో మొదలైన కన్ ఫ్యూజన్ కు సెకండాఫ్ లో మరో కన్ ఫ్యూజన్ తోడవ్వడంతో ఆసక్తికరంగా ఉంటుంది. లాయర్ నారాయణ క్యారెక్టర్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండాఫ్ లో కూడా ఇది కంటిన్యూ అవ్వడం ప్రేక్షకులను నవ్విస్తుంది. అయితే సెకండాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లాంటివి చేసుంటే పూర్తిగా ఆడియన్స్ ఇన్ వాల్వ్ అయ్యే అవకాశముండేది. లాజిక్ గురించి పక్కన పెట్టేసి, హాయిగా నవ్వుకోవాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది. క్లయిమ్యాక్స్ నిరాశపరుస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... వీకెండ్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచ్ ఇట్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !