View

ఎక్స్ ప్రెస్ రాజా మూవీ రివ్య్వూ

Thursday,January14th,2016, 12:51 PM

చిత్రం - ఎక్స్ ప్రెస్ రాజా
బ్యానర్ - యువి క్రియేషన్స్
నటీనటులు - శర్వానంద్, సురభి, ఊర్వశి, హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణమురళి, సూర్య, నాగినీడు, బ్రహ్మాజీ, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, షకలకశంకర్, ధనరాజ్ తదితరులు
సంగీతం - ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ - కార్తీక్ ఘట్టమనేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్ ఎన్
ఎడిటింగ్ - సత్య.జి
నిర్మాతలు - వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి
స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం - మేర్లపాక గాంధీ


శర్వానంద్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ చిత్రం కాన్సెప్ట్ బాగుంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పటివరకూ తను చేసిన చిత్రాల కథాంశాలన్నీ సుపర్బ్. శర్వా ఖాతాలో విజయాలూ ఎక్కువే. ఏ పాత్రను అయినా సునాయాసంగా చేయగల శర్వా తాజాగా 'ఎక్స్ ప్రెస్ రాజా' అంటూ జోరుగా సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ 'ఎక్స్ ప్రెస్ రాజా' ఎలా ఉందో తెలుసుకుందాం...


కథ
రాజా (శర్వానంద్) అల్లరి చిల్లరిగా, పనీ పాటా లేకుండా తిరిగే కుర్రాడు. రాజా తండ్రి నాగినీడు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి వ్యక్తిగా సమాజంలో తనకంటూ మంచి స్థానాన్ని, గౌరవాన్ని దక్కించుకుంటాడు. రాజా తొలి చూపులోనే అమూల్య అలియాస్ (సురభి) ప్రేమలో పడిపోతాడు. అమ్ము కోసం ఓ కుక్కపిల్లను కిడ్నాప్ చేస్తాడు రాజా. ఈ కిడ్నాప్ లో భాగంగా పొల్యూషన్ గిరి (సప్తగిరి) తో రాజాకి పరిచయం ఏర్పడుతుంది. రాజా పక్కనే అతని మావయ్య శీను (ప్రభాస్ శీను) కూడా ఉంటాడు. రాజా, శీను, పొల్యూషన్ గిరితో మొదలైన కథలో కుక్కపిల్ల కోసం బినామీ బ్రిటీష్ (సుప్రీత్) కనెక్ట్ అవుతాడు. ఆ వెంటనే ఈ కథలో నెల్లూరు కేశవ(హరీష్ ఉత్తమన్), వసంత కోకిల (ఊర్వశి), బ్రహ్మాజీ (బిల్ గేట్స్), నటరాజ్ (షకలక శంకర్)... కూడా లింక్ అవుతారు. అసలు ఈ పాత్రలు రాజాకి ఎందుకు కనెక్ట్ అవుతాయి... రాజా, సురభి లవ్ స్టోరీ సుఖాంతం అవుతుందా... ఓ కుక్క పిల్ల కోసం ఎందుకు రాజా వెనకాల బినామీ బ్రిటీష్ పడతాడు... మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న తన తండ్రి ఓ సమస్యలో ఇరుక్కుంటే రాజా ఎలా సాల్వ్ చేసాడు అనే అంశాలతో ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే ఈ చిత్రం సాగుతుంది.


నటీనటుల పర్ఫార్మెన్స్
రాజా పాత్రను శర్వానంద్ సూనాయాసంగా చేసాడు. ఈ పాత్రతో శర్వానంద్ కామెడీ కూడా బాగా చేయగలడని నిరూపించుకున్నాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఫ్రెష్ గా ఉన్నాడు. లుక్ బాగుంది. మంచి పాత్ర దొరికితే తన పరంగా పూర్తి న్యాయం చేయగలడని శర్వానంద్ మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నాడు. 'కలర్ ఫుల్ చిలక...'పాటలో శర్వా డ్యాన్స్ ఇరగదీశాడు. సురభి బాగుంది. కొన్ని సీన్స్ లో మంచి ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇచ్చింది. సప్తగిరి, షకలక శంకర్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఊర్వశి, సుప్రీత్, ప్రభాస్ శీను, బ్రహ్మాజీ, ధనరాజ్, హరీష్ ఉత్తమన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నాగినీడు, సూర్య పాత్రలు బాగున్నాయి. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటంతో ఎవరి శైలిలో వారు ఆ పాత్రల్లో ఒదిగిపోవడానికి కృషి చేసారు.


సాంకేతిక వర్గం
సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ గురించి చెప్పుకోవాలి. మేర్లపాక గాంధీలో మంచి రచయిత ఉన్నాడు. హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ ప్రధాన అంశం అయితే... వారి చుట్టూ అల్లిన పాత్రలు, ఆ పాత్రలకు హీరో, హీరోయిన్ లింక్ అవ్వడాన్ని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో చెప్పిన డైరెక్టర్ గాంధీని మెచ్చుకోవాల్సిందే. కొత్త కొత్త క్యారెక్టర్స్ కథలో ఎంట్రీ ఇస్తున్నప్పటికీ, ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా సినిమాని తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. క్యారెక్టర్స్ కి సరిపడా ఆర్టిస్ట్ లను ఎంపిక చేయడంలోనూ డైరెక్టర్ విజయం సాధించాడు. ఎంటర్ టైన్ మెంట్ వేలో సినిమాని తీర్చిదిద్దడం బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, పాటలు బాగున్నాయి. స్ర్కీన్ ప్లే ఓరియంటెడ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. ఆ పరంగా కూడా ఈ సినిమాకి ప్లస్ మార్కులే పడతాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చి యు.వి.క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాని పూర్తి చేసి విడుదల చేసారు.


పిల్మీబజ్ విశ్లేషణ
స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ టచ్ తో సాగే చిత్రం ఇది. సరదాగా సాగే ట్విస్టులతో లైటరీ వీన్ గా ఉంటుంది. స్ర్కీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ. మేర్లపాక గాంధీ బాగానే డీల్ చేశాడు. కథనంలో చిన్ని చిన్ని మైనస్సులు ఉన్నా అవేం పెద్దగా మైనస్ కావు. 'వసంత కోకిల'లో శ్రీదేవిలా మారిపోయే సన్నివేశాల్లో ఊర్వశి విజృంభించింది. ఆ ట్రాక్ ఫుల్ కామెడీగా ఉంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా రేసీగా ఉంది. టైమ్ పాస్ కి పనికొచ్చే సినిమా.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !