View

గరం మూవీ రివ్య్వూ

Friday,February12th,2016, 02:48 PM

చిత్రం - గరం
బ్యానర్ - శ్రీనివాసాయి స్ర్కీన్స్
నటీనటులు - ఆది, ఆదాశర్మ, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నరేష్, శ్రీలక్ష్మీ, షకలక శంకర్, కబీర్ దూహన్ సింగ్, నాజర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు
కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి
కెమెరా - సురేందర్ రెడ్డి.టి
సంగీతం - అగస్త్య
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బాబ్జీ
నిర్మాత - పి.సురేఖ
సమర్పణ - శ్రీమతి వసంత శ్రీనివాస్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్

 

కథను నమ్మితే ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనకాడరనడానికి లేటెస్ట్ గా సాయికుమార్, ఆది ఓ ఉదాహరణ. 'గరం' కథ నచ్చి, ఈ చిత్రాన్ని నిర్మించారు సాయికుమార్. ఒక మంచి కథ మరుగునపడిపోకూడదని ఈ తండ్రి, కొడుకులు పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకునిగా పేరు తెచ్చుకున్న మదన్ తన శైలిని వదులుకోకుండా కమర్షియల్ టచ్ ఇచ్చి, 'గరం'ని తెరకెక్కించాడు. సినిమాని రాజీపడకుండా నిర్మించిన సాయికుమార్.. పబ్లిసిటీ విషయంలో కూడా రాజీపడలేదు. మొత్తం మీద ఓ పాజిటివ్ వైబ్ తో 'గరం' తెరకొచ్చింది. ఇక.. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం...

 

కథ
బలరామయ్య (తనికెళ్ల భరణి) కొడుకు వరాలబాబు (ఆది). కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బలరామయ్యను వరాలబాబు అడుగడుగునా నిరాశపరుస్తుంటాడు. ఓ ఆవారాలా తయారవుతాడు. బలరామయ్య పక్కింట్లో మూర్తి (నరేష్) కుటుంబం ఉంటుంది. మూర్తి కొడుకు రవి (చైతన్య కృష్ణ) బాగా చదువుకుంటూ బుద్ధిమంతుడనే పేరు తెచ్చుకుంటాడు. రవిని ఉదాహరణగా చూపించి అతనిలా ఉండాలని వరాలబాబుకు తండ్రి చెబుతుంటాడు. రవి తండ్రి మూర్తి అయితే తన కొడుకులాంటి కొడుకు ఎవ్వరూ ఉండరని గొప్పలు చెబుతూ వరాలబాబుని తిడుతుంటాడు. దాంతో రవి అంటే ద్వేషం పెంచుకుంటాడు వరాలబాబు. పదే పదే రవిని ఉదాహరణగా చూపించి, తనలా ఉండాలని చెబుతుండటంతో విసుగు చెందిన వరాలబాబు ''ఆడిలా ఈడిలా కాదు... అందరికీ నన్ను చూపించి ఇలా ఉండాలని చెప్పే విధంగా ఎదుగుతాను'' అని చెప్పి ఇంటిని విడిచి సిటీకి వచ్చేస్తాడు. సిటీలో దిగగానే సమీర (ఆదాశర్మ) ప్రేమలో పడతాడు. బురఖాలో ఉన్న సమీరను ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే...

 

ఒక సందర్భంలో తను ఎంతో ద్వేషిస్తున్న రవి ప్రమాదకర పరిస్థితుల్లో కనబడతాడు. స్పృహలో లేని రవి మీద పెట్రోల్ పోసి తగలపెట్టపోతాడు బిజ్జు (కబీర్ దూహన్ సింగ్). వరాలబాబు రంగంలోకి దిగి బిజ్జు అతని గ్యాంగ్ ని కొడతాడు. అయితే వీల్ ఛైర్ లో ఉన్న రవి మాత్రం కనిపించడు. ఈ గొడవలు వద్దని వరాలబాబుని అతని ఫ్రెండ్ మధునందన్ వారిస్తాడు. అప్పుడు వరాలబాబు అసలు తను సిటీకి వచ్చిందే రవి కోసమని చెప్పి ట్విస్ట్ ఇస్తాడు. తను ప్రేమించిన సమీరా కూడా బిజ్జు వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని తెలుసుకున్న వరాలబాబు ఏం చేస్తాడు.


అసలు రవిని వెతుక్కుంటూ వరాలబాబు సిటీకి ఎందుకు వస్తాడు... సమీరాకి రవికి ఉన్న లింక్ ఏంటీ... వరాలబాబు, సమీర ప్రేమ సఫలమవుతుందా... బిజ్జు ఎందుకు రవిని చంపాలనుకుంటాడు... తన కొడుకు ఆవారా కాదని, చాలా మంచివాడని బలరామయ్య తెలుసుకుంటాడా... వరాలబాబు మీద మూర్తి అభిప్రాయం మారుతుందా... అనేదే ఈ చిత్రం సెకండాఫ్.

 

నటీనటుల పెర్ ఫామెన్స్
వరాలబాబుగా ఆది అద్భుతంగా నటించాడు. ఫైట్స్, డ్యాన్స్ బాగా చేసాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో చాలా సెటిల్డ్ గా, మెచ్చూర్డ్ గా నటించాడు. సమీరా పాత్రలో ఆదాశర్మ ఫర్వాలేదనిపించుకుంటుంది. కబీర్ దూహన్ సింగ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మనందం, తనికెళ్ల భరణి, నరేష్, నాజర్ ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు. జయప్రకాష్ రెడ్డి, మధునందన్ బుర్ఖా ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తుంది. రవి పాత్రలో చైతన్య కృష్ణ బాగున్నాడు.

 

సాంకేతిక వర్గం
స్టోరీ లైన్ పాతదే అయినప్పటికీ, డైరెక్టర్ మదన్ స్ర్కీన్ ప్లే మలిచిన తీరు బాగుంది. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కమర్షియల్ గా సినిమాని తీర్చిదిద్దడానికి మదన్ కృషి చేసారు. ఆది బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో కూడా మదన్ కేర్ తీసుకున్న వైనం స్పష్టంగా కనబడుతుంది. డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆగస్త్య అందించిన పాటలు బాగానే ఉన్నాయి. రీ-రికార్డింగ్ బాగా కుదిరింది. క్లయిమ్యాక్స్ లో తాడు ఫైట్ ఎపిసోడ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
స్టోరీ లైన్ పాతదే అయినప్పటికీ, చివరిలో రివీల్ అయ్యే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కాకపోతే దీని కోసం సెకండాఫ్ ఆరంభమైనప్పట్నుంచి వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. దాంతో ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. సెకండాఫ్ నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. ఆది ఎనర్జిటిక్ పర్ ఫామెన్స్ మాత్రం ఆడియన్స్ ని సినిమా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !