చిత్రం - గ్రేట్ శంకర్
నటీనటులు - మమ్ముట్టి, వరలక్ష్మి శరత్ కుమార్ ,ఉన్ని ముకుందన్ (భాగమతి ఫేం), పూనమ్ బజ్వా తదితరులు
సంగీతం - దీపక్ దేవ్
సినిమాటోగ్రఫీ - వినోద్ వల్లంపాటి
కథ - ఉదయ కృష్ణ
బ్యానర్ - శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్
సమర్పణ - శ్రీ లగడపాటి భార్గవ
నిర్మాత - లగడపాటి శ్రీనివాస్దర్శకత్వం - అజయ్ వాసుదేవ్
మలయాళంలో విజయం సాధంచిన 'మాస్టర్ పీస్' చిత్రం తెలుగులో 'గ్రేట్ శంకర్' గా డబ్ అయ్యింది. శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్, శ్రీ ఎల్.వి.ఆర్ ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. సూపర్ స్టార్ మమ్ముట్టి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... మలయాళ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
కాలేజ్ లో రెండు గ్రూపుల స్టూడెంట్స్ మధ్య జరిగే గొడవలతో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణంతో ఉంటుంది కాలేజ్ క్యాంపస్. అలాంటి కాలేజ్ కి ఇంగ్లీష్ లెక్చరర్ గా లివింగ్ స్టన్ (మమ్ముట్టి) ని నియమించడం జరుగుతుంది. లివింగ్ స్టన్ అయితే కాలేజ్ ని సరైన మార్గంలో నడిపించగలుగుతారని యాజమాన్యం నమ్ముతుంది. ఈ నేపధ్యంలో ఇద్దరు స్టూడెంట్స్ హత్యకు గురవుతారు. ఈ హత్యలను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎసిపి భవానీ దుర్గ (వరలక్ష్మీ శరత్‌కుమార్) రంగంలోకి దిగుతుంది. ఆమె సహోద్యోగిగా జాన్ థెక్కెన్ (ఉన్ని ముకుందన్) ని నియమిస్తుంది పోలీస్ డిపార్ట్ మెంట్. ఇన్వెస్టిగెషన్ జరుగుతున్న సమయంలో స్టూడెంట్స్, పోలీసులకు మధ్య గొడవ జరుగుతుంది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న ఆ కాలేజ్ లో ప్రశాంత వాతావరణాన్ని లెక్చరర్ లివింగ్ స్టన్ నెలకొల్పగలుగుతారా ... ఆ స్టూడెంట్స్ ని హత్య చేసింది ఎవరు తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
లెక్చరర్ గా లివింగ్ స్టన్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. ఆయన చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 'నేను మహిళలను గౌరవిస్తాను' అని చెపుతూ ప్రొఫెసర్ గా క్లాస్‌లో స్టూడెంట్స్ ను క్రమశిక్షణతో పెడుతూ, స్టూడెంట్స్ కొట్టడానికి వచ్చిన గుండాలతో ఫైట్ చేయడం వంటి సీన్స్ లలో చక్కగా నటించారు మమ్ముట్టి. ఏసిపి గా భవానీ దుర్గ (వరలక్ష్మీ శరత్‌కుమార్), జాన్ థెక్కెన్ (ఉన్ని ముకుందన్) ల పెర్ ఫామెన్స్ సూపర్బ్. సెకండాఫ్ లో కెప్టెన్ రాజు, పావని అవతార్ కామెడీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
దీపక్ దేవ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఉదయకృష్ణ అందించిన స్టోరీ లైన్ బాగుంది. ఈ కథకు, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను జోడించి తెరపై చూపించారు డైరెక్టర్. పూర్తి ఇన్ వాల్వ్ మెంట్ తో, ఎక్కడా కథ విషయంలో డీవియేట్ అవ్వకుండా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్. దాంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటున్నారు డైరెక్టర్ అజయ్ వాసుదేవ్. సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు సరిపడా ఖర్చు పెట్టారు నిర్మాత. ఎక్కడా రాజీపడలేదు. దాంతో సినిమా గ్రాండియర్ గా ఉంది.
విశ్లేషణ
ప్రస్తుత పరిస్థితుల్లో నేటి యువత చదువుకోకపోతే... జీవితంలో ఏం కొల్పోతారు అనే విషయాన్ని డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు తెరపై చూపించారు. పోలీసుల కంటే ముందు మరణంచిన వారి రహస్యాన్ని ఛేదించే సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ల్లో మమ్ముట్టి నటన చాలా బాగుంది. ఈ సీన్స్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా స్పీడ్ గా సినిమా సాగిపోతుంది. కామెడీ సీన్స్ ని ఎంజాయ్ చేస్తారు.
ఫైనల్ గా చెప్పాలంటే... ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు. థియేటర్స్ లో సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. మల్లూ ఆడియన్స్ నే కాదు, తెలుగు ఆడియన్స్ ని కూడా ఈ సినిమా మెప్పించగలదు. సో... డోంట్ మిస్ ది మూవీ.
ఫిల్మీబజ్ రేటింగ్ - 2.75/5