View

కబాలి మూవీ రివ్య్వూ

Friday,July22nd,2016, 10:12 AM

చిత్రం - కబాలి
బ్యానర్ - షణ్ముక ఫిలింస్
నటీనటులు - రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు
కెమెరా - మురళి
సంగీతం - సంతోష్ నారాయణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దేవి-శ్రీదేవి
నిర్మాతలు - కె.పి.చౌదరి, కె.ప్రవీణ్
సమర్పణ - కలైపులి థాను
దర్శకత్వం - పా.రంజిత్


సినిమా రంగంలో సాటిలేని స్టార్ à°°‌à°œ‌నీకాంత్. ఆయ‌à°¨ సినిమా చేస్తున్నారంటే à°¤‌మిళ‌నాటే కాదు ఇటు సౌత్ à°…à°‚à°¤‌à°Ÿà°¾, అటు నార్త్ లోనూ, ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°ª‌లు దేశాల్లో ఆయ‌à°¨ అభిమానులు, సినిమా ప్రేమికులు à°† చిత్రం కోసం ఎదురుచూస్తుంటారు. అలా అందరూ ఎదురుచూస్తున్న రజనీకాంత్ 'కబాలి' చిత్రం à°ˆ రోజు (22.7.2016) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. నోట్లో కాస్ట్ లీ సిగార్ పైప్‌తో, సాల్ట్ పెప్ప‌ర్ లుక్‌తో రాజ‌సంగా కుర్చీలో కూర్చున్న ఆయ‌à°¨ à°«‌స్ట్ లుక్ కు భారీ స్పందన లభించింది. à°ˆ లుక్ విడుదలైనప్పట్నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల థియేటర్స్ లో విడుదలైన à°ˆ చిత్రం భారీ అంచనాలను అందుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
కబాలి అలియాస్ కబాలీశ్వరన్ (రజనీకాంత్) మలేషియాలో పెద్ద గ్యాంగ్ స్టర్. ప్రీప్లాన్డ్ గా కబాలిపైన దాడి జరుగుతుంది. ఆ దాడిలో గర్భవతి అయిన కబాలి భార్య గాయాల పాలవుతుంది. కబాలి పోలీసులకు చిక్కుతాడు. రకరకాల కేసులు బనాయించి కబాలిని 25యేళ్ల పాటు జైలు పాలయ్యేలా చేస్తారు. ఇది కబాలి ప్ల్యాష్ బ్యాక్. 25యేళ్ల తర్వాత జైలు నుంచి కబాలి బయటికి రావడంతో సినిమా ఆరంభమవుతుంది. కబాలి అనుచరుడు అమీర్ జైలు నుంచి కబాలీని రిసీవ్ చేసుకుంటాడు. తన భార్య ఆ దాడిలో చనిపోయిందని అమీర్ ద్వారా తెలుసుకుంటాడు. మలేషియాలో అంతా మారిపోయిందని 25 యేళ్ల క్రితం తను దేనికోసమైతే పోరాడాడో ఆ సమస్య ఇంకా అధికమయ్యిందని తెలుసుకుంటాడు కబాలి. మలేషియాలో ఉంటున్న తమిళ విద్యార్ధులు డ్రగ్స్ అమ్మడం, వాటికి బానిసవ్వడం, చదువులు లేకుంగా గ్యాంగ్ స్టర్ లుగా మారుతున్న వైనాన్ని కబాలికి చెబుతాడు అమీర్. దాంతో మళ్లీ తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని మొదలుపెడతాడు. మలేషియాని తన గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్న 43 గ్యాంగ్ ని నాశనం చేయడం కోసం పోరాటం మొదలుపెడతాడు. అందులో భాగంగా కబాలికి రకరకాల సవాళ్లు ఎదురవుతాయి. అలాగే తన భార్య కుందనవల్లి (రాధిక ఆప్టే) బ్రతికే ఉందని తెలుసుకుంటాడు. కబాలిని చంపడానికి ప్రత్యర్ధులు పన్నిన కుట్ర నుంచి కూతురు యోగి (ధన్సిక) కబాలిని కాపాడుతుంది. అలా తన కూతురుని కలుసుకున్న యోగి తన భార్య ఇండియాలో ఉందని తెలుసుకుంటాడు. మరి మలేషియాలో ఉన్న కబాలి తన భార్య కుందనవల్లిని కలుసుకుంటాడా... మలేషియాలో కబాలి చేస్తున్న పోరాటం సఫలమవుతుందా... అసలు కబాలి ఎందుకు గ్యాంగ్ స్టర్ గామారాడు... చివరికి కబాలి కథ ఎలా ముగుస్తుంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
రజనీకాంత్ చర్మిషా ప్రధాన బలంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో రజనీకాంత్ ఓ వయసైన గ్యాంగ్ స్టర్ గా, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆవేశపరుడైన యువకుడిగా నటించారు. ఈ రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేసారు రజనీ. తనదైన స్టైల్, బాడీ లాంగ్వేజ్ తో ఈ రెండు క్యారెక్టర్స్ లోనూ రజనీ అటు అభిమానులతో పాటు ఇటు కామన్ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేసారు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. గ్యాంగ్ స్టర్ గా ఆయన కాస్ట్యూమ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భార్య అంటే తనకెంత ఇష్టమో చెప్పే సన్నివేశాల్లో రజనీ నటన అద్భుతం.


రాధిక ఆప్టే అద్భుతంగా నటించింది. కుందనవల్లి క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యింది. మంచి చేసేటప్పుడు ఎలాంటి భయం లేకుండా చేయాలని భర్తను మోటివేట్ చేసే క్యారెక్టర్ కుందనవల్లిది. ఈ పాత్రలో హుందాగా, చక్కటి అభనయం చూపించింది. సీతారామరాజుగా నాజర్ చాలా చక్కటి పాత్ర చేసారు. విలన్ గా నటించిన విన్స్టర్ చౌ స్టైల్ గా బాగున్నాడు. కిషోర్, ధన్సిక కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతిక వర్గం
డైరెక్టర్ రంజిత్ à°•à°¿ రియలిస్టిక్ à°—à°¾ సినిమాని తెరకెక్కిస్తారనే పేరు ఉంది. à°ˆ సినిమాని కూడా కబాలి అనే గ్యాంగ్ స్టర్ జీవిత కథను చాలా రియలిస్టిక్ à°—à°¾ ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. కథతో పాటు రజనీకాంత్ ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని రజనీ అభిమానులను శాటిస్ ఫై చేసే విధంగా సన్నివేశాలు అల్లుకోవడానికి ప్రయత్నం à°šà±‡à°¸à°¾à°°à±. కాకపోతే à°“ బలమైన కథను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు. రజనీకాంత్ ని à°ˆ వయసులో à°“ మాస్ సినిమాలో చూపించడం అంటే à°…à°‚à°¤ ఈజీ కాదు. à°† పరంగా మాత్రం రంజిత్ సక్సెస్ సాధించారు. ఫ్ల్యాష్ బ్యాక్ లో రజనీని యువకుడిగా చూపించడం, సీన్స్ ని ఊపుగా చిత్రీకరించడం, à°† సీన్స్ కోసం కలర్, లైట్, సౌండ్ విషయంలో పాటించిన జాగ్రత్తలు రంజిత్ చేసిన మ్యాజిక్. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. 'నిప్పుడా....' పాట ఆడియన్స్ à°•à°¿ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ à°ˆ సినిమాకి మేజర్ హైలైట్. ఫోటోగ్రఫీ సూపర్. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. కలైపులి థాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్ à°—à°¾ సినిమాని తెరకెక్కించారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
రజనీకాంత్ సినిమాలంటేనే ప్రేక్షకులు ఆశించేది ఆయన స్టైల్, మ్యానరిజమ్స్. ఓ ఫ్లో లో ఆయన చెప్పే డైలాగులు ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. రొటీన్ కథ అయినప్పటికీ, రజనీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలు చాలా తక్కువ. రజనీకాంత్ స్టైల్ గా నడిస్తే చూడాలని, డైలాగులు చెబితే వినాలని ఆడియన్స్ ఎదురుచూస్తారు. కానీ వయసు మీద పడటంతో రజనీ ఇవన్ని చేయలేకపోయారు. ఆ లోపం స్ఫష్టంగా కనిపించింది. తన మ్యాజిక్ తో రంజిత్ కొంతవరకూ ఈ లోటును భర్తీ చేయగలిగారు. అలాగే మలేషియా నేపధ్యం ఈ సినిమాకి ఓ మైనస్ అనే చెప్పాలి. సౌత్ లోని రజనీకాంత్ అభిమానులకు ఈ నేపధ్యం అంతగా కనెక్ట్ అవ్వదు. ఎక్కువమంది ఆర్టిస్ట్ లు మనవాళ్లు కాకపోవడం కూడా మైనస్. తన భార్యను కలుసుకోవడానికి రజనీ పడే తపన, ఆ సీన్స్ తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. సెకండాఫ్ చాలా పాస్ట్ గా పూర్తయినట్టు ఉండటం సినిమాకి ప్లస్.


పైనల్ గా చెప్పాలంటే... రజనీకాంత్ అభిమానులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. కామన్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అంతగా కనెక్ట్ అయ్యే అవకాశంలేదు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !