View

కళావతి మూవీ రివ్య్వూ

Thursday,January28th,2016, 07:56 PM

చిత్రం - కళావతి
బ్యానర్ - గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్రామ్ క్రియేషన్స్
నటీనటులు - సిద్ధార్ధ్, త్రిష, హన్సిక, పూనమ్ బజ్వా, కోవై సరళ, రాధారవి, సుందర్.సి, వైభవ్, మనోబాల తదితరులు
సంగీతం - హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ - యు.కె.సెంథిల్ కుమార్
ఎడిటింగ్ - యన్.బి.శ్రీకాంత్
రచన - వెంకట్ రాఘవన్, సుందర్.సి
సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు
దర్శకత్వం - సుందర్.సి


2014లో సుందర్ సి. దర్శకత్వం వహించి, నటించిన తమిళ చిత్రం 'అరణ్ మణై' పెద్ద హిట్. ఆ చిత్రం తెలుగులో 'చంద్రకళ'గా విడుదలై, ఘనవిజయం సాధించింది. అందుకే ఆ చిత్రం సీక్వెల్ గా రూపొందిన 'అరణ్ మణై-2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో స‌ర్వాంత రామ్ క్రియేష‌న్స్‌, గుడ్ ఫ్రెండ్స్ బ్యాన‌ర్స్‌పై 'కళావతి'గా తెలుగు తెరకొచ్చింది. సిద్ధార్థ్, త్రిష‌, హ‌న్సిక‌, పూన‌మ్ బాజ్వా.. ఇలా భారీ తారాగణంతో సుందర్. సి దర్శకత్వం వహించిన 'కళావతి'.. 'చంద్రకళ'లా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందా?.. నిర్మాతలు చెప్పినట్లు ఈ చిత్రం భయపెడుతూ, నవ్విస్తుందా?... చూద్దాం.


కథ
జమిందార్ (రాధారవి) తమ ఊరిలోని గుడికి కుంభాబిషేకం జరిపించడానికి సన్నాహాలు చేస్తుంటారు. కుంభాబిషేకం నీళ్లు పడిన తర్వాత అమ్మవారు కళ్లు తెరవడంతో ఆ ఊరిలో ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా పోతాయనే నమ్మకం ఊరి ప్రజల్లో ఉంటుంది. కుంభాబిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే జమిందార్ కోటలో ఓ దుష్టశక్తి ప్రవేశించడం జమీందార్ ని భయపెట్టి చంపడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దాంతో జమీందార్ కోమాలోకి వెళ్లిపోతాడు. తండ్రి కోమాలోకి వెళ్లిన సంగతి తెలుసుకున్న మురళి (సిద్దార్ద్), అతని మేనమామ కూతురు, కాబోయే భార్య అనిత (త్రిష) కోటకు తిరిగి వస్తారు. అప్పటికే మురళి, అనితకు ఎంగేజ్ మెంట్ అయ్యి, పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. కోటలో ఏదో దుష్టశక్తి ఉందని రెండు, మూడు సందర్భాల ద్వారా తెలుసుకుంటాడు మురళి. ఈ విషయాన్ని అనిత అన్నయ్య రవి (సుందర్ .సి) కి చెప్పడంతో తను కోటకి వచ్చి పరిస్థితులను గమనిస్తుంటాడు.


ఒకరోజు మురళి అన్నయ్య కొడుకును దుష్ఠశక్తి చంపడానికి ప్రయత్నిస్తుంది. మరో రోజు మురళి అన్నయ్యను దుష్టశక్తి లాక్కెళ్లిపోతుంది. సి.సి కెమెరాల ద్వారా కోటలోని పరిస్థితులను గమనిస్తున్న రవి, మురళి ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకుంటారు.. ఆ ఆత్మ ఎవరో కాదు... మురళి సొంత చెల్లెలు కళ (హన్సిక).


మురళి చెల్లెలు కళ ఎలా చనిపోతుంది? ఆత్మగా మారి, ఎందుకు తన పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య మురళిని, తండ్రిని, అన్నయ్య కొడుకును చంపాలనుకుంటుంది. అసలు కళ దెయ్యంగా ఎందుకు మారింది? ఫైనల్ గా కళ ఆత్మను ఎలా బంధించారు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
సిద్ధార్థ్ మంచి నటుడు. లవర్ బోయ్ పాత్రలైనా, మాస్ క్యారెక్టర్స్ అయినా.. ఏదైనా చేయగలుగుతాడు. ఈ చిత్రంలో కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే కొడుకు పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ఎమోషన్ సీన్స్ లో సిద్ధార్ధ్ నటన బాగుంది. త్రిషను అభినందించడానికి మాటలు చాలవు. పధ్నాలుగేళ్ల కెరీర్ తర్వాత కూడా ఇప్పుడే వచ్చిన కొత్త కథానాయికలా ఫ్రెష్ గా ఉంది. బీచ్ సాంగ్ లో చిట్టి పొట్టి దుస్తుల్లో త్రిష ఫిజిక్, ఆత్మ ఆవహించిన సన్నివేశాల్లో కనబర్చిన నటన, సిద్ధార్ధ్ తో రొమాంటిక్ సీన్స్ అన్నింటిలోనూ బాగా నటించింది. హన్సిక కొంచెం సన్నబడింది. తన పాత్రకు కూడా నటనకు స్కోప్ ఉంది. ఎమోషనల్ సీన్స్ లో టచింగ్ గా, పగ తీర్చుకునే సీన్స్ లో భయపెడుతూ... రెండు షేడ్స్ ని చక్కగా ఆవిష్కరించింది. మలయాళ నర్స్ పాత్రలో పూనమ్ బజ్వా అచ్చంగా మలయాళ అమ్మాయిలానే ఉంది. రవి పాత్రలో చిత్రదర్శకుడు సుందర్. సి నటన బాగుంది. అన్నయ్య పాత్ర చేసిన సుబ్బు పంచు, తండ్రి పాత్రధారి రాధా రవి తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రియుడు కోసం వేచి చూసే పాత్రలో కోవై సరళ నవ్వించింది. సూరి కూడా తనదైన కామెడీ బాడీ లాంగ్వే్జ్ తో నవ్వించాడు. హన్సిక భర్త గా వైభవ్ రెడ్డి గెస్ట్ రోల్ చేసినప్పటికీ, గుర్తుండిపోయే పాత్ర చేసాడు.


సాంకేతిక వర్గం
ఇది హారర్, కామెడీ మూవీ అని ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే కథను రాసుకున్నారు. భయపెడుతూ, నవ్విస్తూ సాగుతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ సుందర్ చాలా గ్రిప్పింగ్ గా తీశాడు. స్ర్కీన్ ప్లే బాగుంది. పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. బీచ్ సాంగ్ చిత్రీకరణ బాగుంది. మాస్ సాంగ్ స్టెప్స్ బాగున్నాయి. గుడిలో సాగే పాట ఉద్వేగంగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. గుడినీ, గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని చూపించిన విధానం చాలా బాగుంది. 103 అడుగుల పొడవున్న ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ విగ్రహం చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దర్శకుడి సుందర్ టేకింగ్, సెంథిల్ కుమార్ కెమెరా వండర్ ఫుల్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
'కళావతి' డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఆ ఛాయలేవీ కనిపించవు. నటీనటులందరూ సుపరిచితులు కావడం, నేటివిటీలో పెద్దగా తమిళ టచ్ కనిపించకపోవడంతో స్ర్టయిట్ తెలుగు సినిమాలా ఉంది. అందుకని తెలుగు ప్రేక్షకులకూ ఈ చిత్రం కనెక్ట్ అయ్యే చాన్స్ చాలా ఉంది. ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా ఎక్కడో పట్టు తప్పుతున్నట్లు అనిపించినా అదేం పెద్ద మైనస్ కాదు. కోవై సరళ, సూరిల కామెడీ ట్రాక్ ఓ రిలీఫ్. ఓవరాల్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... భయపెడుతూ, నవ్విస్తూ.. దాదాపు సరదాగా సాగే ఈ 'కళావతి'ని చూడొచ్చు. ఏ,బి,సి... అన్ని సెంటర్స్ కి తగ్గ సినిమా. ఎంజాయ్ ఇట్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !