View

కంచె మూవీ రివ్య్వూ

Thursday,October22nd,2015, 08:12 AM

చిత్రం - కంచె
బ్యానర్ - ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి
నటీనటులు - వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, నికితన్ ధీర్, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస్, గొల్లపూడి మారుతిరావు, పోసాని కృష్ణమురళి, అవసరాల శ్రీనివాస్, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా తదితరులు
డైలాగ్స్ - సాయిమాధవ్ బుర్రా
సంగీతం - చిరంతన్ భట్
ఎడిటింగ్ - సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ అర్రమ్
పోటోగ్రఫీ - జ్ఞానశేఖర్
నిర్మాతలు - వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు
రచన, దర్శకత్వం - క్రిష్


రెండో ప్రపంచ యుద్ధం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. కానీ, దాని గురించిన సమగ్ర సమాచారం చాలామందికి తెలియదు. క్రిష్ తెలుసుకున్నారు. తనకు తెలిసిన విషయాలకు తెరరూపం ఇవ్వాలనుకున్నారు. యాక్చువల్ గా యుద్ధం నేపథ్యంలో సినిమా అంటే సాహసమే. కానీ, ఎవరూ చెప్పని, చూపించని కథను చూపించాలనే ఆకాంక్షతో క్రిష్ ఈ సాహసం చేశారు. సైనికుడిగా వరుణ్ తేజ్ వంద శాతం నప్పాడని అతని లుక్ తెలియజేసింది. టీజర్ కూడా అదిరిపోయింది. గమ్యం, వేదం, కష్ణం వందే జగద్గురుమ్.. ఇలా ఇప్పటివరకూ క్రిష్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ 'కంచె' మరో ఎత్తు అనాలి. మరి.. ఈ యుద్ధం ఎలా ఉందో తెలుసుకుందాం... రండి.


à°•à°¥
హిట్లర్ స్పీచ్ తో సినిమా ఆరంభమవుతుంది. సైనికుడిగా ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) ఎంట్రీ. మిలటరీ లో ఒకే ఊరికి చెందిన హరిబాబు, ఈశ్వర్ (నికితన్ ధీరన్) సోల్జర్స్ గా విధులు నిర్వర్తిస్తుంటారు. ఈశ్వర్ కి హరిబాబు అంటే పడదు.


ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే. 1936లో ఒకే ఊరికి చెందిన ధూపాటి హరిబాబు, సీత (ప్రగ్యా జైస్వాల్) చెన్న పట్నంలో చదువుకుంటుంటారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయి సీత. తక్కువ కులానికి చెందిన అబ్బాయి హరిబాబు. కాలేజ్ లో ప్రేమలో పడతారు హరిబాబు, సీత. తమ ఊరికి వచ్చిన హరిబాబుకు సీత అన్నయ్య ఈశ్వర్ తో పరిచయం ఏర్పడుతుంది. అప్పటికే ఈశ్వర్ మిలటరీలో సైనికుడిగా దేశానికి సేవలందిస్తుంటాడు. తన అన్నయ్య దగ్గర హరిబాబు గురించి చెప్పి తమ పెళ్లికి అంగీకారం పొందాలని భావిస్తుంటుంది సీత. ఊరిలో జరుగుతున్న ఉత్సవంలో పాల్గొంటారు. అప్పుడు హరిబాబు, సీత ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలుసుకుని ఈశ్వర్ తన చెల్లెలికి వెంటనే సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈశ్వర్ తాతయ్య, ఆ ఊరి పెద్ద అయిన పెద్దయ్య మాత్రం తక్కువ కులాల వారికి గొడవపెడితే వారిలో వారే కొట్టుకుని తగలిబడిపోతారు. ఆ సమయంలో హరిబాబును కూడా అదే మంటల్లో తగలబెట్టొచ్చని చెబుతాడు. దాంతో ఊరిలో చిచ్చు పెడతారు. ఆ గొడవ ఊరిలో కంచె వేసుకుని వర్గాలుగా విడిపోయి ఎవరి దారి వారే అన్నట్లుగా విడిపోవడానికి కారణం అవుతుంది.


ప్రస్తుతం సినిమాలోకి వెళితే.. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమవుతుంది. ఆ యుద్ధంలో హరిబాబు, ఈశ్వర్ (నికితన్ ధీరన్) పాలు పంచుకుంటారు. ఈశ్వర్ తో పాటు సైన్యంలోని కొంతమంది యుద్ధ ఖైదీలుగా జర్మన్ సైన్యానికి పట్టుబడతారు. వారిని వదిలేయకుండా కాపాడటానికి హరిబాబు మరికొంతమంది సైనికులు ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే జర్మన్ దేశస్థుడికి, ఇటలీకి చెందిన అమ్మాయికి పుట్టిన పాపను, మరికొంతమందిని చంపేయమని హిట్లర్ తన సైనికులకు ఆదేశాలు ఇస్తే.. వారిని కాపాడటానికి హరిబాబు రంగంలోకి దిగుతాడు. వారితో పాటు ఈశ్వర్ ని, మరికొంతమంది సైనికులను కాపాడి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదలుపెడతాడు హరిబాబు.


మళ్లీ ఫ్యాష్ బ్యాక్ లోకి వెళితే.. సీతకు పెళ్లి కుదుర్చుతారు. హరిబాబు ధైర్యంగా సీత ఇంట్లోకి ప్రవేశించి ఆమె తాత, నానమ్మ ముందే సీత మెడలో తాళికట్టి తన ఇంటికి కాపురానికి తీసుకెళతాడు. ఊరిలోకి వచ్చిన ఈశ్వర్ తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్న హరిబాబుపై కోపంతో ఊగిపోతాడు. అతనితో తలపడతాడు. ఇద్దరి మధ్య జరిగిన కొట్లాటలో సీత చనిపోతుంది.


ప్రస్తుతం సినిమాలోకి వస్తే... జర్మన్ స్పై శిబిరం పై దాడి చేసి ఈశ్వర్ తో పాటు మిగతా వారిని కాపాడి పడవ ఎక్కించి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు హరిబాబు. మిగతా వారందరినీ పడవ ఎక్కించిన హరిబాబు ఒంటరిగా జర్మన్ సైనికులతో తలపడతాడు. ఒక్కడు వంద మందిని ఎదుర్కోవడమా? హరిబాబు ఏమవుతాడు?


పడవలో సేఫ్ గా తన ఊరికి చేరుకుంటాడు ఈశ్వర్. హరిబాబు తాతయ్యను కలిసి ఓ గుంత తవ్వమని చెబుతాడు. హరిబాబులో మంచి స్నేహితుడు, కొడుకు, మనవడు, ప్రేమికుడు, సైనికుడు ఉన్న విషయం తెలుసుకోలేకపోయానని చెబుతాడు ఈశ్వర్. ఊరిలో ఉండాల్సింది కంచె కాదు.. మనసుల్లో ముసుగులు తొలిగించి అన్ని వర్గాలవారు భేదాభిప్రాయాలు లేకుండా బ్రతకాలని చెబుతాడు. దాంతో అప్పటివరకూ ఊరి మధ్య ఉన్న కంచెను తొలగించి మనుషులందరూ ఒక్కటే. కులం, మతం, జాతి అనేది లేదని ఊరిలోని వారు తెలుసుకుంటారు. ఈశ్వర్ చేతిలో కొన్ని ఉత్తరాలు ఉంటాయి. అవి ప్రేమలేఖలు. ఆ ఉత్తరాలను హరిబాబు తాత తవ్విన గుంతలో పూడ్చాలన్నది ఈశ్వర్ ఆలోచన. ఆ ఉత్తరాలు ఎవరివి? ఎందుకు పూడ్చాలనుకున్నాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.


నటీనటుల పర్ఫార్మెన్స్
కాలేజ్ స్టూడెంట్, సైనికుడు ధూపాటి హరిబాబు పాత్రకు వరుణ్ తేజ్ వంద శాతం నప్పాడు. ముఖ్యంగా తన దేహ దారుఢ్యం ప్లస్ అయ్యింది. మెలి తిరిగిన కండలతో, క్లోజ్ హెయిర్ కట్, ట్రిమ్ చేసిన మీసకట్టుతో అసలు సిసలైన సోల్జర్ లా ఉన్నాడు. ఇక, బాడీ లాంగ్వేజ్ కూడా హుందాగా ఉంది. లవ్ సీన్స్ లో లవర్ బోయ్ లా ఆకట్టుకున్నాడు. ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా ఉంది. యువరాణి తరహా బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంది. చిరుదరహాసం, కొంటె చూపులు, వయ్యారమైన నడకలతో ప్రగ్యా కుర్రకారు గుండె వేగాన్ని పెంచడం ఖాయం. విలన్ పాత్రధారి నికితన్ ధీర్ లుక్స్, యాక్టింగ్ బాగున్నాయి. సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, శ్రీనివాస్ అవసరాల, షావుకారు జానకి తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా తీయాలనే ఆకాంక్షతో క్రిష్ ఈ కథ రాసుకున్నాడు. వార్ కి లవ్ స్టోరి బ్లెండ్ చేసి, ఈ సినిమా తీశాడు. కొత్త నేపథ్యం కాబట్టి, కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా నాటి పరిస్థితులను ఆర్ట్ డైరెక్టర్ సాహీ సురేశ్ చక్కగా ఆవిష్కరించారు. చిరంతన్ భట్ సంగీతం ఓ ఎస్సెట్. పాటలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సాహిత్యం చక్కగా వినబడేలా ట్యూన్స్ ఉన్నాయి. పాటల చిత్రీకరణ బాగుంది. ఫస్టాఫ్ లో వచ్చే లెంగ్తీ వార్ సీన్ ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాకి ప్రధాన బలం బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు. 'మన గర్భాన్ని వాడుకుంటారు..' అని షావుకారు జానకి పాత్ర మగాళ్లను ఉద్దేశించి చెప్పే డైలాగ్ సుపర్బ్. 'కాళ్ల దగ్గర ఉండాల్సినవాడికి కాళ్లెలా కడుగుతాననుకున్నావ్..', 'బంధాలు బ్రతకడానికి.. పేర్లు పిలవడానికి', 'ఉనికి ఊరికే వస్తుందట్రా..', 'గులాబీ పువ్వంటే ఇష్టం ఉంటే కోస్తాం.. ప్రేమ ఉంటే నీళ్లు పోస్తాం...', 'వాళ్లల్లో ఒక్కడికి పిండం పెట్టినా మనల్ని కన్న అమ్మకు దండం పెట్టినట్లే..' వంటి సంభాషణలు అద్భుతం. ప్రాస కోసం పాకులాడకుండా తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా సాయిమాధవ్ డైలాగ్స్ రాశారు. సిరివెన్నెల రాసిన పాటలు ఓ హైలైట్. ప్రేమపాటలు, స్ఫూర్తి నింపే పాటలు మరోసారి ఆయన కలం బలం తెలిపాయి. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ భేష్. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
చరిత్రకు తెరరూపం ఇవ్వడం ఓ సాహసం. ఎంతో పరిశోదించి, తీయాలి. క్రిష్ కూడా చాలా విషయాలు తెలుసుకునే ఈ కథ రాసుకున్నారు. ప్రపంచ యుద్ధం నేపథ్యం, అందులోనే అల్లిన ఓ ప్రేమకథతో ఈ సినిమా తీశాడు. చూసినంతసేపూ బాగుందనిపిస్తుంది. కానీ, ప్రపంచ యుద్ధం గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలనుకునే తపన ఉన్నవాళ్లు కొంచెం నిరాశపడే అవకాశం లేకపోలేదు. ఇంకా ఏదైనా చెబితే బాగుండేదేమో అనిపించడం ఖాయం. నరేషన్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆవిష్కరించడం అంటే మాటలు కాదు. ఓ భారీ ప్రయత్నంలో చిన్ని చిన్ని లోపాలు ఉండటం కామన్. వాటిని పట్టించుకోకుండా చూస్తే, 'కంచె' బాగుంటుంది. ఏది ఏమైనా క్రిష్ టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడే. అందులో నో డౌట్. తొలి చిత్రం 'ముకుంద'లో కన్నా వరుణ్ తేజ్ నటుడిగా ఈ చిత్రంలో మెరిశాడు. ప్రగ్యాకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే చిత్రం. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఇలాంటి క్లాసిక్స్ ని ప్రేక్షకులు ఆదరించడం వల్ల మరిన్ని గొప్ప ప్రయత్నాలు చేసి, అద్భుతమైన చిత్రాలు చేయాలనే టార్గెట్ తో దర్శకుల ఆలోచనలు సాగుతాయి. తద్వారా తెలుగు సినిమాల స్థాయి పెరుగుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. మానవీయ విలువలను పశ్నిస్తూ, సాగే చిత్రం ఇది. కులం, మతం అన్నీ ఈ మనుషులు పెట్టుకున్నవేననీ అందరి ఒంట్లో పారే రక్తం రంగు ఒకటేనని, 'కంచె'లు నిర్మించుకోవద్దు.. ఐకమత్యమే ప్రధానం అని చెప్పే దిశగా ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రధారి తన పాత్రను ఉద్దేశించి 'ధూపాటి హరిబాబు సెల్యూట్' అనేలా చేసుకుంటానని హీరో అంటాడు. ఇక్కడ మనం చెప్పాల్సింది... 'జాగర్లమూడి క్రిష్ సెల్యూట్'.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !