View

కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీ రివ్య్వూ

Friday,February12th,2016, 11:36 AM

చిత్రం - కృష్ణగాడి వీర ప్రేమగాథ
బ్యానర్ - 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, ఫృధ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ శ్రీ ప్రతమ్, బేబి మోక్ష, రామరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ - యువరాజ్
సంగీతం - విశాల్ చంద్రశేఖర్
డైలాగ్స్ - హను రాఘవపూడి, జయకృష్ణ
నిర్మాతలు - రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - హను రాఘవపూడి

 

గత ఆరేడేళ్లల్లో తెలుగు సినిమాకు వచ్చిన మంచి నిర్మాతల్లో అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంటలను విస్మరించలేం. భాగస్వామ్యంలో 'లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించడంతో పాటు ఈ ముగ్గురూ కలిసి '1 నేనొక్కడినే, దూకుడు, ఆగడు' వంటి భారీ చిత్రాలు నిర్మించి, అగ్ర నిర్మాతల జాబితాలోకి చేరిపోయారు. ఇప్పుడు నానితో నిర్మించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'పై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచి కథలు సెలక్ట్ చేసుకుని, నాని సినిమాలు చేస్తాడు. 'అందాల రాక్షసి'తో ప్రతిభ ఉన్న దర్శకుడనిపించుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొత్తం మీద ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి.. ఈ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఎలా ఉందో తెలుసుకుందాం...

 

à°•à°¥
కృష్ణ (నాని) నందమూరి నటసింహం బాలకృష్ణ వీరాభిమాని. చిన్నప్పట్నుంచి మహాలక్ష్మీ (మెహ్రీన్) ని విపరీతంగా ప్రేమిస్తుంటాడు. రాజన్న (రామరాజు) అన్నయ్య కూతురు మహాలక్ష్మీ. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కుటుంబ నేపధ్యం రాజన్నది. అదే ఊరికి చెందిన అప్పిరెడ్డి, రాజన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ ఉంటుంది. మహాలక్ష్మీ అన్నయ్య రామరాజు అంటే ఊరిలోని వారందరికీ భయం. కృష్ణకు కూడా భయం. తన పిరికితనం వల్ల 15యేళ్లుగా మహాలక్ష్మీని ప్రేమిస్తున్నా, ఎవ్వరికీ ఈ విషయాన్ని తెలియనివ్వడు. మహాలక్ష్మీ కూడా తన ప్రేమ విషయాన్ని బయటికి చెప్పదు. పైకి ఇద్దరూ ఒకరంటే ఒకరికి పడదనే విధంగా నటిస్తూ, రహస్యంగా ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. తన ప్రేమ విషయం మహాలక్ష్మీ అన్నయ్యకు ఎలా చెప్పాలో తెలీక భయంతో వణికిపోతుంటాడు కృష్ణ. ఈలోపు మహాలక్ష్మీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. కట్ చేస్తే...


రాజన్న ఇంట్లోకి ఓ గ్యాంగ్ చొరబడి ఎటాక్ చేస్తారు. ఈ ఎటాక్ జరిగిన సమయంలో రాజన్న తమ్ముడు ఏసిపి శ్రీకాంత్ (సంపత్ రాజ్) పిల్లలు ఇంట్లో ఉంటారు. వారిని ఈ ఎటాక్ నుంచి తప్పించి మహాలక్ష్మీ అన్నయ్య రామరాజు ఊరు దాటించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆ సమయంలో తనకు ఎదురుపడిన కృష్ణకు పిల్లలను అప్పగించి హైదరాబాద్ లోని శ్రీకాంత్ కి ఇంటికి చేర్చమని చెబుతాడు రామరాజు. అలా చేస్తే, తన చెల్లెలు మహాలక్ష్మీని ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. దాంతో పిల్లలను తీసుకుని కారులో హైదరాబాద్ బయలుదేరతాడు కృష్ణ. అయితే పరిస్థితులను బట్టి కృష్ణ తమను కిడ్నాప్ చేస్తున్నాడని పిల్లలు అపార్ధం చేసుకుంటారు. కట్ చేస్తే...


తన ఇంటిపై ఎటాక్ చేసింది ఊరిలోని పగ వాళ్లు కాదు... ఇంటర్నేషనల్ మాఫియా లీడర్ డేవిడ్ గ్యాంగ్ అని తెలుసుకుంటాడు ఎసిపి శ్రీకాంత్. డేవిడ్ గ్యాంగ్ ఎసిపి శ్రీకాంత్ పిల్లలను కిడ్నాప్ చేసి, శ్రీకాంత్ అధ్వర్యంలో ఉన్న డేవిడ్ బాయ్ (మురళీ శర్మ)ను విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కృష్ణ దగ్గర ఉన్న పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.


మరి అసలే పిరికివాడైన కృష్ణ మాఫియా గ్యాంగ్ నుంచి పిల్లలను కాపాడాడా... తమను కిడ్నాప్ చేస్తున్నది కృష్ణ కాదని పిల్లలు తెలుసుకుంటారా.. తన మహాలక్ష్మీని దక్కించుకున్నాడా... అనేదే ఈ చిత్ర కథ.

 

నటీనటులు పెర్ ఫామెన్స్
15యేళ్ల నుంచి ఓ అమ్మాయిని ప్రేమించే అబ్బాయి కృష్ణగా నాని అద్భుతంగా నటించాడు. ధైర్యంలేని పిరికివాడుగా కూడా నాని చక్కటి నటన కనబర్చాడు. పిల్లలతో సెంటిమెంట్ సీన్స్ కూడా నాని తనదైన శైలిలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. రాయలసీమ స్లాంగ్ మాట్లాడాడు. హీరోయిన్ మెహ్రీన్ అందంగా ఉంది. నటన పరంగా కూడా ఓకే. కాజల్ కి దగ్గర పోలికలు ఉండటం వల్ల మెహ్రీన్ ని జూనియర్ కాజల్ అని పిలుస్తారు. ఎసిపి శ్రీకాంత్ గా సంపత్ రాజ్ స్టైలిష్ గా ఉన్నాడు. ఇక ప్రధాన పాత్రలు పోషించిన మురళీ శర్మ, బ్రహ్మాజీ, పృధ్వీ, రామరాజు, అన్నపూర్ణ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు. ఈ చిత్రంలో నటించిన ముగ్గురు చిన్నారులు నయన, మాస్టర్ ప్రదమ్, బేబి మోక్షలు చక్కగా నటించారు.

 

సాంకేతిక వర్గం
హను రాఘవపూడి సింఫుల్ లవ్ స్టోరీని చాలా కొత్తగా ప్రజెంట్ చేయడంతో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. స్ర్కీన్ ప్లే బాగుంది. డైలాగులు కూడా బాగున్నాయి. డైరెక్టర్ గా హను ఈ చిత్రంలో మరో మెట్టు ఎక్కనట్టే. టేకింగ్ చాలా బాగుంది. తను ప్రేమించిన అమ్మాయి అన్నయ్య మనుషులను అతి కిరాతకంగా చంపుతుంటే. అదే సీన్ లో ఓ పక్షికి దెబ్బ తగలకుండా హీరో కాపాడటంలాంటి చూపించి హీరో క్యారెక్టరైజేషన్ ని పక్కగా ఎలివేట్ చేసాడు హను. ఎంటర్ టైన్ మెంట్ ని కూడా మిస్ అవ్వలేదు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, మాఫియా గ్యాంగ్, చిన్న పిల్లల కిడ్నాప్ తో ముడిపడి ఉన్న కృష్ణ, మహాలక్ష్మీల ప్రేమగాధను చక్కటి డైలాగులతో తెరకెక్కించిన వైనం బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఓ హైలెట్. రాయలసీమ ప్రాంతాన్ని చక్కగా చూపించారు కెమెరామ్యాన్ యువరాజ్. విశాల్ చంద్రశేఖర్ పాటలు, రీ-రికార్డింగ్ బాగున్నాయి. ఇక 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర సినిమాపై తమకున్న ఫ్యాషన్ ని నిరూపించుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఓ పిరికివాడు తన ప్రేమను గెలిపించుకోవడానికి పడిన తపనను పర్ ఫెక్ట్ గా ఆవిష్కరించాడు డైరెక్టర్ హను. తను ప్రేమించిన అమ్మాయి అన్నయ్య మనుషులను అతి కిరాతకంగా చంపుతుంటే. అదే సీన్ లో ఓ పక్షికి దెబ్బ తగలకుండా హీరో కాపాడటం హీరో క్యారెక్టరైజేషన్ పక్కగా ఎలివేట్ అవుతుంది. ఇలాంటి సున్నితమైన పీన్లు హార్ట్ టచింగ్ గా అనిపించాయి. సీన్స్ న్యాచురల్ గా ఉన్నాయి. తన ప్రేమికురాలిని చంపేసానని విలన్ చెప్పినప్పుడు పిరికివాడైన హీరో రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. ఎమోషనల్ టచ్ తో కూడుకున్న ఈ సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. 'భలే భలే మగాడివోయ్' లాంటి హిట్ చిత్రం తర్వాత నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రాన్ని అంగీకరించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్టాప్ అంతా కృష్ణ, మహాలక్ష్మిల ప్రేమ కథతో, సెకండాఫ్ పిల్లలను కాపాడటానికి హీరో చేసే ప్రయత్నం, మాఫియా గ్యాంగ్ తో యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగిపోతుంది. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. హీరో బాలయ్య అబిమాని అని చెప్పే సీన్లు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. బాలయ్య అభిమానులు కూడా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు.

 

ఫైనల్ గా చెప్పాలంటే... కృష్ణగాడి వీర ప్రేమ గాధ సూపర్ హిట్... ఆడియన్స్ కి కృష్ణ, మహాలక్ష్మీల ప్రేమ బాగా కనెక్ట్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !