View

కృష్ణాష్టమి మూవీ రివ్య్వూ

Friday,February19th,2016, 01:20 PM

చిత్రం - కృష్ణాష్టమి
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు - సునీల్, నిక్కి గల్రాని, డింఫుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణమురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి తదితరులు
సంగీతం - దినేష్
ఎడిటింగ్ - గౌతంరాజు
సినిమాటోగ్రఫీ - చోటా.కె.నాయుడు
కథ - కోన వెంకట్
సహనిర్మాతలు - శిరీష్, లక్ష్మణ్
నిర్మాత - దిల్ రాజు
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వాసు వర్మ


హాస్యనటుడిగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నసునీల్ 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' వంటి చిత్రాల ద్వారా హీరోగా సినిమాని తన భుజాల మీద మోయగలనని నిరూపించుకున్నాడు. 'భీమవరం బుల్లోడు' తర్వాత రెండేళ్లకు మళ్లీ సునీల్ హీరోగా నటించిన చిత్రం 'కష్ణాష్టమి'. పలు హిట్ చిత్రాలను అందించిన 'దిల్ ' రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. తన సంస్థ ద్వారా వాసూవర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆయన నిర్మించిన 'జోష్' ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినప్పటికీ వాసూవర్మ టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో 'కష్ణాష్టమి'ని ఆయన దర్శకత్వంలోనే నిర్మించాడు 'దిల్' రాజు. మరి.. వాసూవర్మ ఈసారి విజయం చవిచూస్తాడా? హీరోగా సునీల్ కెరీర్ లో మరో హిట్ చేరుతుందా? 'దిల్' రాజు కూడా మరో హిట్ కొడతాడా?.. చూద్దాం.


కథ
కృష్ణ వరప్రసాద్ (సునీల్) గేమింగ్ ప్రోగ్రామర్. అమెరికాలో వర్క్ చేస్తుంటాడు. చదువుకోవడానికి అమెరికా వెళ్లిన కృష్ణను రకరకాల కారణాలు చెప్పి ఇండియాకి రానివ్వకుండా చేస్తుంటాడు అతని పెదనాన రామచంద్రయ్య (ముఖేష్ రుషి). పెద్దమ్మ (తులసి) తో ఫోన్ లో మాట్లాడుతూ ఇండియా రావాలని ఉందని, సొంత ఊరులో, సొంత మనుషుల మధ్య ఉండాలని ఉందని కృష్ణ చెబుతుంటాడు. పెద్దమ్మతో పాటు కుటుంబసభ్యులందరూ కృష్ణ ఎప్పుడు ఇండియాకి వస్తాడా అని ఎదురుచూస్తుంటారు. గ్రహాలు బాగోలేదని ఇండియాలో అడుగుపెడితే కృష్ణకు ప్రాణ గండం ఉందని సిద్ధాంతితో కుటుంబ సభ్యులకు చెప్పించి కృష్ణ ఇండియా ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాడు.


అయితే పెదనానతో చెప్పకుండా అమెరికా నుంచి ఇండియా బయలుదేరతాడు కృష్ణ. ఫైట్ లో డాక్టర్ అజయ్ (అజయ్) తో పరిచయం ఏర్పడుతుంది. అజయ్ ది కూడా కృష్ణ సొంతూరు చిత్తూరు దగ్గర ఉండే ఓ గ్రామం. అజయ్, అతని కొడుకు, కృష్ణ, అతని ఫ్రెండ్ గిరి (సప్తగిరి) ఇండియా వస్తారు. ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే ఓ మర్డర్ ని చూసిన అజయ్ తనని, తన కొడుకుని తమ ఊరికి చేర్చమని కృష్ణను అడుగుతాడు. ఆ జర్నీలో ఓ గ్యాంగ్ వీరి వెనుక పడుతుంది. ఆ అటాక్ లో అజయ్ గాయపడి కోమాలోకి వెళతాడు. దాంతో అజయ్ ని హాస్పటల్లో చేర్పించి అతని అత్త ఇంటికి అజయ్ కొడుకుని చేర్చడానికి వెళతాడు కృష్ణ.
ఇంటికి వచ్చిన కృష్ణని తమ అల్లుడు అని కుటుంబం మొత్తం భావిస్తుంది. అక్కడ పరిస్థితుల వల్ల కృష్ణ ఆ ఇంటి అల్లుడు అజయ్ గా నటిస్తూ ఉంటాడు. అయితే ఆ కుటుంబం ఓ వ్యక్తి మీద పగతో రగిలిపోతోందని, అది తనేనని తెలియడంతో కృష్ణ షాక్ అవుతాడు. తన పెదనాన తనను ఇండియా రాకుండా ఎందుకో ఆపేస్తున్నాడో కూడా అర్ధం చేసుకుంటాడు కృష్ణ.


అసలు కృష్ణకి అజయ్ కుటుంబానికి సంబంధం ఏంటీ... కృష్ణ మీద అజయ్ మామయ్యకు ఉన్న పగ ఏంటీ.. కృష్ణను ఇండియా రానివ్వకుండా పెదనాన ఎందుకు ఆపేస్తుంటాడు. తన మీద పగతో రగిలిపోతున్న కుటుంబం మధ్యలోనే ఉంటూ అక్కడి నుంచి కృష్ణ ఎలా బయటపడతాడు.. తాము పగ తీర్చుకోవాల్సింది కృష్ణపైనే అని అజయ్ అత్తింటి వారికి తెలుస్తుందా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
కృష్ణ వరప్రసాద్ గా సునీల్ బాగా నటించాడు. ముఖ్యంగా ఓ హీరో క్యారెక్టర్ క్యారీ చేసే లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ... అన్ని చేసి ప్రేక్షకులను మెప్పించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ఫిజిక్ బాగుంది. డ్యాన్స్ లు బాగా చేసాడు. కాకపోతే ఎక్కువ సీన్స్ లో కళ్లద్దాలు పెట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిక్కి గల్రాని, డింఫుల్ చోపడే ఇద్దరూ గ్లామర్ గా నటించారు. డింపుల్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో, కాస్త ఎక్స్ పోజింగ్ తో చిలిపి మరదలిగా ఆకట్టుకుంటుటంది. పల్లవి పాత్రలో నిక్కి బాగుంది. నటన పరంగా కూడా నిక్కికి మార్కులు పడతాయి. ముఖేష్ రుషి, ఆశుతోష్ రానా, తులసి, పవిత్రా లోకేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. సెల్పీలు ఎఫ్.బి లో పోస్ట్ చేసి లైక్ లు కోసం తాపత్రయపడే బ్రహ్మానందం కామెడీ కొన్ని చోట్ల పండింది.


సాంకేతిక వర్గం
రోటీన్ స్టోరీ. స్ర్కీన్ ప్లే కూడా రొటీన్ ఫార్మెట్ లోనే సాగుతుంది. డైరెక్టర్ వాసూవర్మ కొత్తదనం చూపించడానికి ఏ మాత్రం ట్రై చెయ్యలేదు. ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్. దినేష్ ఈ చిత్రానికి పాటలందించారు. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. సునీల్ కి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించుకోవడానికి ఆస్కారమున్న ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. సునీల్ హీరోగా చేసిన గత చిత్రాల బడ్జెట్ ని పోలిస్తే, ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువగానే అయ్యుంటుంది. సినిమా మేకింగ్ విషయంలో నిర్మాత దిల్ రాజు నో కాంప్రమైజ్. సినిమా రిచ్ గా ఉంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
పగతో రగిలిపపోతున్న కుటుంబానికి జీవితాన్ని ఆనందంగా గడపాలని తెలియజేప్పి, వారిని మారేలా చేయడం మన తెలుగు హీరోలు చాలా సినిమాల్లో చేసారు. ఈ సినిమాలో హీరో కూడా అదే పని చేసాడు. పగతో రగిలిపోతున్న భర్తలు ఒక్కసారిగా భార్యలపై ప్రేమ చూపించడం, ఆ ఆనందంలో భార్యలు కంటతడి పెట్టడంలాంటి ఈ సినిమాలోని సీన్లు 'రెడీ', 'లౌక్యం' తదితర సినిమాలను గుర్తుకు తెస్తాయి. అయితే 18యేళ్ల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్న హీరో తన కుటుంబాన్ని చూడాలని, ఇండియా రావాలని పడే తాపత్రయం, ఆ క్రమంలో వచ్చే ఎమోషన్స్ సీన్స్ బాగుంటాయి. అలాగే తమ కొడుకు ఇంటికారావాలని ఓ అమ్మ పడే తపన కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.


కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్. ప్రీ ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఛేజింగ్ సీన్ మేకింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. కాకపోతే ఈ సినిమాలోని పగ, హీరో ప్రేమ, సెకండ్ హీరోయిన్ తో పెళ్లి అంశాలు అసలు బలంగా లేవు. పాటలు కూడా సరైన సిట్యువేషన్ లో రావు. దాంతో ఆడియన్స్ విసుగు చెందుతారు.


ఫైనల్ గా చెప్పాలంటే.. పరమ రోటీన్ మూవీ.. ఏదో చేయాలనుకుని ఏదో చేసినట్టు, ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అనిపించకమానదు. ఏ వర్గాన్ని ఈ చిత్రం మెప్పించే అవకాశంలేదు. హీరోగా నిలదొక్కుకోవడానికి సునీల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ సినిమా అతని ప్రయత్నానికి ప్లస్ అయ్యే సినిమా కాదు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !