View

క్షణం మూవీ రివ్య్వూ

Friday,February26th,2016, 08:16 AM

చిత్రం - క్షణం
బ్యానర్స్ - పివిపి, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ తదితరులు
ఎడిటింగ్ - అర్జున్ శాస్త్రి
సంగీతం - శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్, స్ర్కిఫ్ట్ గైడెన్స్ - అబ్బూరి రవి
నిర్మాత - పరమ్ .వి.పొట్లూరి, కెవిన్ అన్నె
కథ, స్ర్కీన్ ప్లే - అడవి శేష్
దర్శకత్వం - రవికాంత్ పేరెపు

 

డిఫరెంట్ పాయింట్ తో సినిమాలు తీయడం పీవీపీ సంస్థ పొట్లూరి వి. ప్రసాద్ కి ఇష్టం. ఆ మధ్య 'సైజ్ జీరో' అంటూ వినూత్న కథాంశంతో సినిమా నిర్మించిన పీవీపీ ఇప్పుడు 'క్షణం' అనే థ్రిల్లర్ ను అందించారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో అడివి శేష్, అదా శర్మ, యాంకర్ అనసూయ నటించిన ఈ చిత్రం పోస్టర్స్ పరంగా అందర్నీ ఆకట్టుకుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఓ మంచి థ్రిల్లర్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ ను ప్రేక్షకులకు కలగజేసింది. మరి.. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం...

 

à°•à°¥
రిషి (అడవి శేష్) ఎన్నారై. అమెరికాలో సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతుంటాడు. తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమైన అమ్మాయిని కూడా ఇంట్రెస్ట్ లేదని పక్కన పెట్టేస్తాడు రిషి. బిజినెస్ చూసుకుంటూ సోలోగా లైఫ్ లీడ్ చేస్తున్న రిషికి ఓ రోజు తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ అతని జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. నాలుగేళ్ల క్రితం దూరమైన శ్వేత (ఆదాశర్మ) తనను కలవాలంటూ రిషికి మెసేజ్ కి పెడుతుంది. వెంటనే ఇండియాలో ఉన్న శ్వేతను కలుసుకోవడానికి బయలుదేరి వస్తాడు రిషి. కట్ చేస్తే...


శ్వేతను కలిసిన రిషికి ఆమెకు కార్తీక్ (సత్యదేవ్) తో పెళ్లయ్యిందని తెలుస్తుంది. తనకు ఓ పాప రియా ఉందని, ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసారని, తనకు హెల్ప్ చేయమని రిషిని అడుగుతుంది శ్వేత.


తను ఎంతో గాఢంగా ప్రేమించి, పెళ్లి చేసుకుందామనుకున్న శ్వేత పెళ్లి చేసుకోవడం, ఓ పాపకు తల్లవ్వడం, ఆ పాప కిడ్నాప్ కి గురయ్యిందని హెల్ప్ చేయమని అడగడంతో రిషి షాక్ అవుతాడు. తన కోసం పాపను వెతకడం మొదలుపెడతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, శ్వేత ఉంటున్న అపార్ట్ మెంట్ లోని కొంతమంది ద్వారా అసలు శ్వేతకు పిల్లలే లేరని తెలుస్తుంది. దాంతో రిషి మరింత షాక్ అవుతాడు. శ్వేత భర్త కార్తీక్ కూడా తమకు పిల్లలు లేరని, ఓ యాక్సిడెంట్ లో శ్వేత కొన్ని రోజుల పాటు కోమాలో ఉందని, కోమాలోంచి బయటికి వచ్చిన తర్వాత తనకు కూతురు ఉందని చెబుతోందని చెబుతాడు. దాంతో రియా గురించి శ్వేత చెబుతున్నది నిజంకాదని నమ్మి శ్వేతను నిలదీస్తాడు రిషి. కట్ చేస్తే...


తను చెప్పే మాటలు ఎవ్వరూ నమ్మడంలేదని బాధపడి, చివరికి రిషి కూడా నమ్మడంలేదని డిప్రెషన్ కి గురైన శ్వేత... రిషి ముందే తన ఫ్లాట్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు శ్వేత నిజం చెబుతుందని అందరూ కావాలనే పాప లేనట్టు అబద్ధం చెబుతున్నారని, శ్వేతను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారని అర్ధం చేసుకుంటాడు రిషి. ఇందులో పోలీసులు హస్తం ఉందని కూడా గ్రహిస్తాడు.


మరి ఫైనల్ గా రిషి ఎలా రియాని కనుక్కున్నాడు.. అసలు పాపే లేదని శ్వేత భర్త, పోలీసులు ఎందుకు నమ్మించడానికి ట్రై చేసారు.. నాలుగేళ్ల క్రితం విడిపోయిన రిషికే ఎందుకు ఫోన్ చేసి పాప విషయంలో సహాయం చేయమని శ్వేత అడుగుతుంది అనేదే ఈ చిత్రం కధ.

 

నటీనటులు
ఓ ఎన్నారైగా, మెడికల్ స్టూడెంట్ గా, ప్రేమికుడిగా రిషి పాత్రను అద్భుతంగా చేసాడు అడవి శేష్. ఎమోషన్, లవ్... ఇలాంటి ఎమోషన్స్ ని చక్కగా పలికించాడు. ఓ ప్రేమికురాలిగా, తన పాప కిడ్నాప్ కు గురైతే ఓ తల్లి పడే ఆవేదన శ్వేత క్యారెక్టర్ లో ఉన్నాయి. ఈ క్యారెక్టర్ ని ఆవిష్కరించడానికి తనవంతు కృషి చేసింది ఆదాశర్మ. ఎసిపి గా అనసూయ భరద్వాజ్ ఓ సీరియస్ రోల్ ని చేసింది. ఎసిపి రోల్ కి సరిపడా పిజిక్, బాడీ లాంగ్వేజ్ తో అనసూయ ఆకట్టుకుంటుంది. సత్య, రవివర్మ, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధిమేరకు నటించాడు. సత్యం రాజేష్ అక్కడడక్కడా సెటైర్లతో నవ్వించడంతో పాటు, పోలీస్ ఆఫీసర్ గా బాగున్నాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

 

సాంకేతిక వర్గం
ఈ స్టోరీ లైన్ అడవి శేష్ ది. లైన్ బాగుంది. సింఫుల్ స్టోరీ లైన్ అయినప్పటికీ గ్రిప్పింగ్ స్ర్కిన్ ప్లే ఇవ్వడంలో అడవి శేష్ సక్సెస్ అయ్యారు. ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేసినప్పటకీ, తడబాటు లేకుండా, సినిమాని ప్రజెంట్ చేయడంతో రవికాంత్ పేరెపు సూపర్బ్, ఇలాంటి సస్పెన్స్ థ్లిల్లర్స్ కి పాటలకంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఆ పరంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పూర్తి న్యాయం చేసారు సంగీత దర్శకుడు చరణ్ పాకాల. అబ్బూరి రవి రాసిన డైలాగులు షార్ట్ అండ్ స్వీట్ గా బాగున్నాయి. కథ డిమాండ్ మేరకు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు నిర్మాతలు.

 

పిల్మీబజ్ విశ్లేషణ
సింఫుల్ స్టోరీ లైన్. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే. ఫస్టాప్ అంతా పాప కిడ్నాప్ అవ్వడం, పాపను కనిపెట్టే ప్రాసెస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు శ్వేతకు కూతురు లేదనే ట్విస్ట్ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని కలుగుజేస్తుంది. ఇంటర్వెల్ కి శ్వేత చనిపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెకండాఫ్ లో పాపను కనిపెట్టడానికి రిషి చేసే ఇన్విస్టిగేషన్ బాగుంటుంది. ఫైనల్ గా ఆ పాప తనకు, శ్వేతకు పుట్టిన కూతురు అని తెలియడం మరింత షాకింగ్. మొత్తం మీద సింఫుల్ స్టోరీ లైన్ ని ఆసక్తిగా మలచడంలో సక్సెసక అయ్యారు. అయితే ఓ ఎసిపి తన స్వార్ధం కోసం ఎంతమందినైనా చంపడానికి వెనుకాడకపోవడం సజెస్టివ్ గా లేదు. ఓ పాపను పెంచుకోవడం కోసం తను పడే తపన.. కన్నతల్లి పడుతున్న బాధను సైతం ఓ లేడీ ఎసిపి గ్రహించకపోవడం, భార్యను మానసికంగా భర్త హింస్తోంటే ఏసిపి సహకరించడం కూడా ఆమోదించ విధంగా ఉండదు. అయితే రియల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ నుంచి పుట్టినకొచ్చిన స్టోరీ లైన్ కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మొత్తం మీద క్షణం క్షణం ఉత్కంఠతకు గరి చేస్తూ, సస్పెన్స్ మెయింటెన్ చేయడంలో మాత్రం సక్సెస్ సాధించారు. అసలేం జరుగుతుంది, అని పాయింట్ రివీల్ చేసేంతవరకూ ఊహకు అందకుండా కథను చెప్పడంలో అడివి శేష్ మలిచిన స్ర్కీన్ ప్లేని మెచ్చుకోవాల్సిందే.


ఫైనల్ గా చెప్పాలంటే... రొటీన్ కి భిన్నంగా ఉన్న ఈ సినిమాని ఓసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఎక్కడా బోర్ ఫీలవ్వరు. క్షణం టైటిల్ కి తగ్గట్టు, తర్వాత క్షణం ఏం జరుగుతుందనే సస్పెన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !