View

కుమారి 21ఎఫ్ మూవీ రివ్య్వూ

Friday,November20th,2015, 01:37 PM

చిత్రం - కుమారి 21ఎఫ్
బ్యానర్ - సుకుమార్ రైటింగ్స్, పీఏ మోషన్ పిక్చర్స్
నటీనటులు - రాజ్ తరుణ్, హేభా పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, జోగి బ్రదర్స్ తదితరులు
సంగీతం - దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ - రత్నవేలు
ఎడిటింగ్ - అమర్ రెడ్డి
సమర్పణ - సుకుమార్.బి
నిర్మాతలు - విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి
స్టోరీ, స్ర్కీన్ ప్లే - సుకుమార్.బి
దర్శకత్వం - పల్నాటి సూర్యప్రతాప్


విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ à°“ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ సొంత బ్యానర్ ఆరంభించి నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా ‘కుమారి 21 ఎఫ్’ à°ˆ చిత్రానికి ఆయనే స్వయంగా à°•à°¥, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందించాడు . 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ' చిత్రాల ద్వారా యూత్ à°•à°¿ బాగా దగ్గరై సక్సెస్ ఫుల్ à°—à°¾ కెరియర్ సాగిస్తున్న హీరో రాజ్‌తరుణ్ à°ˆ చిత్రంలో కథానాయకుడు. హేభా పటేల్ కథానాయిక. సుకుమార్ తో ఉన్న అనుబంధంతో à°ˆ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తే, సినిమాటోగ్రాఫర్ à°—à°¾ ప్రముఖ కెమెరా మ్యాన్ రత్నవేలు వ్యవహరించడం విశేషం. à°ˆ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ సినిమాలో ఏదో విషయం ఉందని తెలియజేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తన అసిస్టెంట్, 'కరెంట్' చిత్రదర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ à°•à°¿ à°ˆ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చి అప్ కమింగ్ డైరెక్టర్స్ ని, కొత్త వారిని తన సంస్థ ద్వారా ఎంకరేజ్ చేస్తానని సుకుమార్ నిరూపించారు. మరి నిర్మాతగా సుకుమార్ చేసిన తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.


à°•à°¥
సిద్ధు (రాజ్ తరుణ్) హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసి సింగపూర్ లో స్టార్ క్రూస్ లో చెఫ్ గా చేయాలనే ప్రయత్నంలో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందని కుర్రాడు. తన తండ్రికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని తల్లి అతనిని దూరంగా పెట్టేయడంతో సిద్ధుకి కూడా తండ్రి అంటే కోపం. అమ్మ నర్సు. అదే కాలనీకి చెందిన శంకర్ (నోయెల్), ఫోటోల సురేష్ (నవీన్), సొల్లు శీను (సుదర్శన్) సిద్ధుకి ఫ్రెండ్స్. ఆ కాలనీ ఎటియంలో డబ్బు డ్రా చేసుకునే వారి దగ్గర్నుంచి డబ్బులు కొట్టేసి తమకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ప్లేస్ లో సరదాగా గడుపుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు ఈ నలుగురు. కొట్టేసిన డబ్బును పంచుకుంటుంటారు. అదే కాలనీలో సి బ్లాక్ లో ఓ అమ్మాయి రేప్ కు గురవుతుంది. పోలీసులు ఆ కేసును ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటారు.


అదే కాలనీలో ముంబయ్ నుంచి వచ్చిన మోడల్ కుమారి (హేభా పటేల్) తన తాతయ్యతో కలిసి ఉంటుంది. తొలి చూపులోనే సిద్ధును చూసి ప్రేమలో పడుతుంది. కుమారిది అందరితోనూ ఓపెన్ గా మాట్లాడుతూ, బోల్డ్ గా ఉండే స్వభావం. తను ప్రేమిస్తున్న సిద్ధుకి లిప్ లాక్ ఇవ్వడం, అతనితో కలిసి తాగడం, పబ్ ల్లో ఎంజాయ్ చేయడం చేస్తుంటుంది. ఆ స్వభావం సిద్ధుకి కాస్త తికమకగా అనిపించినప్పటికీ, ఆమె అంటే ఇష్టపడతాడు. ప్రేమించడం మొదలుపెడతాడు. సిద్ధు ఫ్రెండ్స్ మాత్రం ఆమె ఓ మోడల్ అని, బోల్డంతమంది బోయ్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారని, ఒక్క రోజు ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొచ్చే ఆమెను ప్రేమించడం సరికాదని చెబుతుంటారు. దానికి తగ్గట్టు కుమారి కూడా తన బోయ్ ఫ్రెండ్స్ తో బైక్ మీద తిరగడం, లేట్ నైట్స్ ఇంటికి రావడం చేస్తుంటుంది. దాంతో సిద్ధుకి ఆమెపై అనుమానం పెరుగుతుంది. కుమారిని నిలదీసి తను తిరుగుతున్న బోయ్ ఫ్రెండ్స్ తో ఆమెకున్న సంబంధం ఏంటని అడుగుతాడు. కుమారి వాళ్లు ఫ్రెండ్స్ అని చెబుతుంది. అయినా సరే తన ఫ్రెండ్స్ ద్వారా ఆమె క్యారెక్టర్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు సిద్ధు. ఇది తెలిసిన కుమారి తనను ప్రేమించేంత మెచ్యూర్టీ సిద్ధూకి లేదని, తన మీద సిద్ధుకి ఉన్నది ప్రేమకాదని తేల్చేస్తుంది. అయినా సరే కుమారిపై తనకు ఉన్నది ప్రేమేనని తెలియజేయడానికి సిద్ధు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు కుమారిపై సిద్ధు ఫ్రెండ్స్ కన్ను కూడా పడుతుంది. ఆమెను దక్కించుకోవాలనే దురుద్ధేశ్యం వారికి ఉంటుంది. ముంబయ్ లో కుమారి పేరు మీనా అని, తను వ్యభిచార నేరం కింద పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లి వచ్చిందని వీడియో ద్వారా సిద్ధుకి తెలియజేస్తారు అతని ఫ్రెండ్స్. దాంతో తాగేసి కుమారిని చాలా అసహ్యంగా మాట్లాడతాడు సిద్ధు. కట్ చేస్తే...


కేవలం తన తల్లి అనుమానం వల్లే తండ్రి తమకు దూరం అయ్యాడని, తండ్రికి ఎవరితోనూ సంబంధంలేదని సిద్ధుకి తెలుస్తుంది. అనుమానంతో నేను చేసిన తప్పుని నువ్వు చెయ్యొద్దని సిద్ధుకి తల్లి చెప్పడంతో కుమారిపై అనవసరంగా అనుమానం పెంచుకున్నానని రియలైజ్ అవుతాడు. ఆమెకు తన ప్రేమను తెలియజేసి తన దానిని చేసుకోవాలని డిసైడ్ అవుతాడు సిద్ధు.


అదే సమయంలో సిద్ధు ఫ్రెండ్స్ కుమారి ఇంటికి వెళ్లి ఆమెకు జ్యూస్ లో మత్తు మందు కలిపి ఇచ్చి రేప్ చేస్తారు. వాళ్లని కుమారి ఇంట్లో చూసిన సిద్ధు షాక్ అవుతాడు. స్పృహలోలేని కుమారిని చూసి సిద్ధు చాలా బాధపడిపోతాడు. ఆమెకు స్ఫృహ రాకముందే అన్ని సరిచేసి, అక్కడ ఏమీ జరగనట్టు క్రియేట్ చేస్తాడు సిద్ధు. స్పృహ వచ్చిన తర్వాత తనకు ఏదో జరిగిందని బాధపడుతున్న కుమారికి ఏమీ జరగలేదని చెప్పి, ఆమెను పెళ్లి చేసుకుంటాడు సిద్ధు.


మరి కుమారిని రేప్ చేసిన తన ఫ్రెండ్స్ కి సిద్ధు ఎలాంటి శిక్ష విధిస్తాడు... ఆ కాలనీలోని ఓ అమ్మాయిని రేప్ చేసింది ఎవరు? అనేది ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
సిద్ధు పాత్రలో రాజ్ తరుణ్ పూర్తిగా ఒదిగిపోయాడు. తన గత చిత్రాలను పోలిస్తే రాజ్ తరుణ్ ఈ చిత్రంలో కాస్త బరువైన పాత్రనే పోషించాడు. ఓ ప్రేమికుడిగా, గర్ల్ ఫ్రెండ్ మీద అనుమానం ఉన్న బోయ్ ఫ్రెండ్ గా, ఓ కొడుకుగా, ఓ ఫ్రెండ్ గా, రేప్ కి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకునే మెచ్యుర్టీ ఉన్న వ్యక్తిగా రాజ్ తరుణ్ పెర్ ఫామెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తన గత చిత్రాల్లో ఒకే రకమైన స్లాంగ్, డైలాగ్ డెలివరీతో మొనాటినీ అనిపించుకునే దిశగా సాగిన రాజ్ తరుణ్ ఈ చిత్రంలో స్లాంగ్, డైలాగ్ డెలివరీ మార్చి నిరూపించుకున్నాడు. హేభా పటేల్ సినిమా మొత్తం దాదాపు గ్లామరస్ గా కనిపిస్తుంది. స్ర్కిప్ట్ డిమాండ్ చేసిన మేరకు మొహమాట పడకుండా విజృంభించింది. రాజ్ తరుణ్ స్నేహితుల పాత్రల్లో నోయల్, నవీన్, సుదర్శన్ భేష్ అనిపించుకున్నారు. మామూలుగా హేమ అంటే ఒక గ్లామరస్ ఆంటీ క్యారెక్టర్స్ చేస్తుంటుంది. ఈ చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా హోమ్లీ మదర్ క్యారెక్టర్ చేసింది హేమ. హుందాగా ఉంది. సినిమాలో ఇతర పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం
సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సుకుమార్ గురించే మాట్లాడుకోవాలి. తను à°ˆ సినిమాకి నిర్మాత మాత్రమే కాదు... à°•à°¥, స్ర్కీన్ ప్లే, మాటలు అందించి సినిమాకి సంబంధించిన కీలక బాధ్యతలను తనే మోసాడు. చాలా బోల్డ్ స్టోరీ లైన్ ని తీసుకుని, à°† స్టోరీని ఎలివేట్ చేసే ప్రాసెస్ లో అంతకంటే బోల్డ్ à°—à°¾ సీన్స్ అల్లాడు సుకుమార్.  à°¬à±‹à°²à±à°¡à± సన్నివేశాల్లో  à°‡à°ªà±à°ªà±à°¡à± యూత్ ఎలా మాట్లాడుకుంటున్నారో అలానే డైలాగులను రాయడం ట్రెండ్ ని సుకుమార్ పాలో అవుతున్న వైనాన్ని తెలియజేసింది. టేకింగ్ పరంగా డైరెక్టర్ సూర్యప్రతాప్ à°•à°¿ ప్లస్ మార్కులే పడతాయి. ఇక à°ˆ సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ప్రతి ఫ్రేమూ బాగుంది. విజువల్ à°—à°¾ సినిమా బాగుంది. పాడుబడిన బిల్డింగ్, à°“ మిడిల్ క్లాస్ కాలనీ, పబ్.. ఇలా ప్రతి లొకేషన్ ని చక్కగా ఆవిష్కరించాడు రత్నవేల్. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి, క్యాచీ ట్యూన్స్ తో దేవిశ్రీప్రసాద్ పాటలందించాడు. అంతేకానీ వెరైటీ పాటలు చేయడానికి మాత్రం ట్రై చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. à°† à°°à°•à°‚à°—à°¾ à°ˆ సినిమాకి పూర్తి న్యాయం చేసాడు దేవి. ఎడిటింగ్ కూడా బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ తో సినిమాని నిర్మించి నిర్మాతగా కూడా భేష్ అనిపించుకున్నాడు సుకుమార్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
అబ్బాయిలు అమ్మాయిలతో ఎంత చనువుగానైనా ఉండొచ్చు కానీ.. అమ్మాయిలు మాత్రం అబ్బాయిలతో ఫ్రెండ్లీగా ఉంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచి కాదనుకోవడం తప్పని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఈ పాయింట్ ని చాలా బోల్డ్ గా చూపించడం యూత్ కి నచ్చుతుంది. హీరోయిన్ సిగరెట్ కాల్చడం, వోడ్కా తాగడం వంటి దృశ్యాలు యూత్ కి నచ్చుతాయి కానీ, పెద్దవాళ్లకి ఇబ్బందికరంగా ఉంటాయి. అబ్బాయిల్లానే అమ్మాయిలకు కూడా ఫ్రెండ్లీగా ఉండే స్వేచ్ఛ ఉంటుంది. అంత మాత్రాన వాళ్లని తప్పుగా అనుకోకూడదని చెప్పడానికి హీరోయిన్ తో ఇలాంటివన్నీ చేయించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమాకి సుకుమార్ పేరు ఉండి ఉండకపోతే ఇలా ఫీల్ కావల్సిన అవసరంలేదు. సుకుమార్ మంచి చిత్రాలు తీస్తాడు.. క్లాస్, మాస్ మిక్స్ తో దాదాపు నీట్ సినిమాలే తీస్తాడు. అలాంటి సుకుమార్ అసలు ఈ పాయింట్ తో ఎందుకు సినిమా తీయాలనుకున్నాడనే ప్రశ్న తలెత్తక మానదు. బహుశా సుకుమార్ కూడా తనను తాను ప్రశ్నించుకుని, ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ తీయడం తనకు సరికాదని భావించి, వేరే దర్శకుడికి ఇచ్చాడేమో అనిపిస్తుంది. హీరోయిన్ చెడు తిరుగుళ్లు తిరిగిందని అనిపించి, తనను ప్రేమించాలో వద్దో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న హీరో.. చివరకు ఆ అమ్మాయి రేప్ కి గురైనప్పుడు అంతకుముందు ఆ అమ్మాయి ఎవరితోనూ ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని గ్రహిస్తాడు. రేప్ కి గురైనా పెళ్లి చేసుకుంటాడు. క్లయిమ్యాక్స్ లో వచ్చే ఈ సీన్ టచింగ్ గా ఉంటుంది. కానీ, ఈ సీన్ కోసం అల్లిన మిగతా కథ అంతా కొంచెం బోల్డ్ గా ఉంటుంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. ఇది బోల్డ్ సినిమా అని దర్శక-నిర్మాతలు చెప్పుకుంటూ వచ్చారు. పవిత్రమైన సినిమా తీశాం.. చూడ్డానికి థియేటర్ కి రండి అని లేనిపోని కహానీలు చెప్పలేదు. నిజంగానే బోల్డ్ గా ఉంది. సో.. యూత్ కి కనెక్ట్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !