చిత్రం - లైఫ్ అనుభవించు రాజా
నటీనటులు - రవితేజ (జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ, శ్రేణిసాల్మన్ తదితరులు
సంగీతం - రామ్
సినిమాటోగ్రఫీ - రజిని
నిర్మాతలు - రాజారెడ్డి కండల
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సురేష్ తిరుమూర్
రవితేజ, శృతిశెట్టి, శ్రావణి నిక్కీ నటించిన చిత్రం 'లైఫ్ అనుభవించు రాజా'. ఎఫ్ & ఆర్ సమర్పణలో తిరుమూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (14.2.2020) థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించే విధంగా ఉందా... రివ్య్వూ మీ కోసం.
కథ
జీవితంలో సక్సెస్ అవ్వాలనుకునే టార్గెట్ తో ఉండే కుర్రాడు రాజా (రవితేజ). కానీ ప్రతి విషయంలో ఫెయిల్యూర్ అవుతుంటాడు. అలాంటి సమయంలో నిత్యహారతి (శ్రావణి నిక్కీ) పరిచయం అవ్వడం, ఆమె ప్రేమలో రాజా పడటం జరుగుతుంది. కానీ వీరి పెళ్లికి నిత్యహారతి తండ్రి అసలు అంగీకరించడు. సంపాదనలేని రాజా అంటే నిత్యహారతి తండ్రికి అసలు పడదు. ఈ నేఫద్యంలో హిమాలయాలకు వెళతాడు రాజా. అక్కడ శ్రియ (శృతి శెట్టి) తో పరిచయం అవుతుంది. హిమాలయాల్లో వచ్చిన ఓ ఆలోచన వల్ల రాజా కోటీశ్వరుడు అవుతాడు. కోటీశ్వరుడు అయిన రాజా నిర్ణయం ఎలా ఉంటుంది. నిత్యహారతితో జీవితాన్నిపంచుకోవాలనుకుంటాడా... శ్రియ ఏమయ్యింది... ఈ ఇద్దరిలో రాజాకి దగ్గరయ్యింది ఎవరు తెలుసుకోవాలంటే 'లైఫ్ అనుభవించు రాజా' సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన రవితేజ చక్కగా నటించాడు. రాజా పాత్రలో ఒదిగిపోయాడు. సంపాదన లేని కుర్రాడిగా, ప్రేమలో పడిన కుర్రాడిగా రవితేజ నటన ఆడియన్స్ ని మెప్పిస్తుంది. సెకండాఫ్ లో సాల్మాన్ కామెడీ చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్లు ఇద్దరు శృతి శెట్టి, శ్రావణి నిక్కీ పోటీ పడి నటించారు.
టెక్నీషియన్స్
డైరెక్టర్ సురేష్ తిరుమూరు ఆసక్తికరమైన పాయింట్ తో కథ రెడీ చేసుకున్నాడు. స్ర్కీన్ ప్లే, మాటలు తనే రాసుకున్నాడు కాబట్టి ఎక్కడా తడబాటు కనిపించలేదు. తను అనుకున్న స్టోరీని చక్కగా తెరకెక్కించాడు. డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రాము అందించిన సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ రజిని తన విజువల్స్ ని ఆకట్టుకుంటారు. ఎడిటింగ్ బాగుంది.
విశ్లేషణ
కథ బాగుడటం, స్ర్కీన్ ప్లే కొత్తగా ఉండటం సినిమాకి ప్లస్ పాయింట్. తమ నటనతో నటీనటులు ఆకట్టుకుంటారు. యూత్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యాలెంటైన్స్ డే రోజున విడుదలైన ఈ సినిమా పక్కా కమర్షియల్ సినిమా. అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించగలదు.
ఫైనల్ గా ... ఈ వీకెండ్ (లైఫ్ అనుభవించు రాజా) తో ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5