View

లోఫర్ మూవీ రివ్య్వూ

Thursday,December17th,2015, 08:24 AM

చిత్రం - లోఫర్
సమర్పణ - సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్
బ్యానర్ - శ్రీ శుభశ్వేత ఫిలింస్
నటీనటులు - వరుణ్ తేజ్, దిశా పాట్నీ, పోసాని కృష్ణమురళి, రేవతి, బ్రహ్మానందం, అలీ, ముకేష్ రుషి, సప్తగిరి, పవిత్రా లోకేష్, చరణ్ దీప్, వంశీ, ధనరాజ్ తదితరులు
సంగీతం - సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ - పి.జి.వింద
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
నిర్మాతలు - సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - పూరి జగన్నాధ్


ఇడియట్, పోకిరి వంటి టైటిల్స్ తో సినిమాలు తీసి, బంపర్ హిట్ కొట్టాడు పూరి జగన్నాథ్. ఆ తర్వాత కూడా పూరి చేసిన చిత్రాల టైటిల్స్ వెరైటీగా ఉండటంతో పాటు, ఎక్కువ శాతం విజయం సాధించాయి. ఇప్పుడు పూరి 'లోఫర్' అన్నాడు. తొలి చిత్రం 'ముకుంద'తో మాస్ ప్రేక్షకులకు ఫుల్ గా రీచ్ కాలేదు వరుణ్ తేజ్. మలి చిత్రం 'కంచె'లో క్లాస్ గా కనిపించాడు. పూరీతో సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి.. వరుణ్ ని పూరి మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశాడా? 'లోఫర్' ఎలా ఉన్నాడు?.. తెలుసుకుందాం.


à°•à°¥
కోట్ల ఆస్థిని, కుటుంబాన్నివదిలేసుకుని తను ప్రేమించిన మురళి (పోసాని కృష్ణమురళి) ని పెళ్లి చేసుకుంటుంది లక్ష్మీ (రేవతి). ఓ బిడ్డ రాజా (వరుణ్ తేజ్) కు జన్మనిస్తుంది. లక్ష్మీ ఆస్థిపై కన్నేసిన మురళి ఆమెను ఆస్థి తీసుకు రావాల్సిందిగా పీడించుకు తింటాడు. తను భర్త ఓ లోఫర్ అని తెలుసుకున్న లక్ష్మీ కొడుకుతో సహా అతనికి దూరమవ్వడానికి సిద్ధపడుతుంది. అయితే చిన్న పిల్లాడు అయిన తన కొడుకును భార్యకు దూరం చేసి జోధ్ పూర్ పారిపోతాడు. తల్లి చచ్చిపోయిందని కొడుకుకి చెబుతాడు మురళి. చిన్నప్పట్నుంచి... డబ్బు కోసం ఏమైనా చేయాలి అని చెప్పి తనలాగే ఓ లోఫర్ లా పెంచుతాడు. దాంతో మోసం చేయడం, దొంగతనం చేయడం అలవాటు చేసుకుంటాడు రాజా. కట్ చేస్తే...


తన తండ్రి చెప్పిన మాటలనే వేదంగా భావించి ఓ లోఫర్ లానే బ్రతుకుతుంటాడు రాజా. తండ్రి, కొడుకు దొంగతనాలు, మోసాలు చేసి జోధ్ పూర్ లో బ్రతికేస్తుంటారు. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్న కారణంగా ఇంటి నుంచి పారిపోయి జోధ్ పూర్ కి చేరుకుంటుంది పారిజాతం అలియాస్ మోని (దిశా పాట్నీ). తొలి పరిచయంలోనే మోని ఫోన్ ని కొట్టేస్తాడు మురళి . రాజా ఆమె పెట్టెను కొట్టేస్తాడు. రెండుమూడుసార్లు కలుసుకున్న రాజా, మోని ప్రేమలో పడతారు. తన ప్రేమ గురించి తన మేనత్త లక్ష్మీకి చెబుతుంది మోని. ఈలోపు కూతురిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న మోని తండ్రి (ముకేష్ రుషి) జోధ్ పూర్ లో కూతురు ఉన్న సంగతి తెలుసుకుని తన పెద్ద కొడుకు, చిన్న కొడుకుకు కూతురిని తీసుకురావాల్సిందిగా పురమాయిస్తాడు. జోధ్ పూర్ లో తమకు తెలిసిన ఓ రౌడీ, పోలీసులకు ఈ విషయం చెప్పి తమ చెల్లెల్ని తీసుకురావాల్సిందిగా పురమాయిస్తారు. తన ఫ్రెండ్ సహాయంతో టూరిస్ట్ గైడ్ గా చేస్తున్న మోని జోధ్ పూర్ కోటకు తన మేనత్తను రమ్మని చెబుతుంది. అక్కడ తన ప్రేమికుడిని చూపిస్తానని చెబుతుంది. అదే కోటకు మోనిని తీసుకెళ్లడానికి రౌడీ, పోలీసులు వస్తారు. మోనిని వారికి అప్పజెప్పడానికి బేరం కుదుర్చుకుంటాడు రాజా. ఈ సిట్యువేషన్ ని చూసిన మోని మేనత్త లక్ష్మీ అతను మోసగాడు అనుకుంటుంది. మోని కూడా రాజా మోసగాడు అనుకుంటుంది. అక్కడ తన కన్నతల్లి లక్ష్మీని చూసిన రాజా షాక్ అవుతాడు. తన తల్లే మోని మేనత్త అని తెలుసుకుని ఇంకా షాక్ అవుతాడు. తన తండ్రి... తల్లి చనిపోయిందని చెప్పడం అబద్ధమని తెలుసుకుంటాడు. ఈ ట్విస్ట్ లతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.


తల్లి చనిపోయిందని చెప్పినందుకు తండ్రిని రాజా ఏం చేస్తాడు... తన మేనకోడలు ఓ లోఫర్ ని ప్రేమించిందనుకున్న లక్ష్మీకి ఆ లోఫరే తన కొడుకు అని తెలిస్తే ఎలా ఫీలవుతుంది... రాజా తన తల్లికి ఎలా దగ్గరవుతాడు... తన మేనమామ ఊరి ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలా అడ్డుకున్నాడు.. ఫైనల్ గా తను ప్రేమించిన మోని ని రాజా సొంతం చేసుకున్నాడా... లక్ష్మీ, మురళి కలుసుకున్నారా అనేదే ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పర్ఫార్మెన్స్
లోఫర్ గా వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. ఈ పాత్రకు మంచి హైట్, బాడీ లాంగ్వేజ్ కేర్ లెస్ గా ఉండాలి. ఈ రెండూ వరుణ్ లో ఉన్నాయి కాబట్టి, వంద శాతం నప్పాడు. మదర్ సెంటిమెంట్ సీన్స్ లో వరుణ్ నటన బాగుంది. 'సువ్వి సువ్వాలమ్మా..' పాటలో వరుణ్ కనబర్చిన నటన ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలుగుతాడనిపించేలా ఉంది. కథానాయిక దిశా పాట్నీ చూడచక్కగా ఉంది. నటనపరంగా తన పాత్రకు పెద్దగా స్కోప్ లేదు కానీ, తెర మీద తను కనిపించినంతసేపూ ఐ-ఫీస్ట్ అనిపిస్తుంది. లోఫర్ తండ్రిగా పోసాని ఇరగదీసేశాడు. మంచి తల్లిగా రేవతి సుపర్బ్. ఇంకా ముఖేష్ రుషి, అలీ, బ్రహ్మానందం తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం
పూరి రాసుకున్న కథ మామూలుగా ఉన్నా స్ర్కీన్ ప్లే సూపర్ గా ఉంది. ఫిలాసఫీని టచ్ చేస్తూ, పూరి రాసే షాట్ అండ్ స్వీట్ డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. రియల్ లైఫ్ లో మాట్లాడుకునే సహజమైన మాటల్లా డైలాగ్స్ ఉండటం ప్లస్ పాయింట్. సునిల్ కశ్యప్ అందించిన పాటల్లో అమ్మ పాట బాగుంది. మిగతా పాటలు మనసుని హత్తుకోకపోయినా తెరపై చూసినంతసేపూ హుషారుగా ఉంటాయి. 'జియా జిలే..' పాట చిత్రీకరణ యువతను గిలిగింతలు పెట్టే విధంగా ఉంటుంది. ఆ పాట లొకేషన్ కనువిందు. పీజీ విందా కెమెరా వండర్ ఫుల్. కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. తేలికపాటి సీన్స్ తో తను ప్రేమించిన అమ్మాయి మేనత్త తనే తల్లే అని హీరోకి తెలిసిపోయే ట్విస్ట్ తో ఫస్టాప్ ముగుస్తుంది. సెకండాఫ్ లో ఉన్న మదర్ ఎమోషన్ ప్రేక్షకులను టచ్ చేస్తుంది. సెకండాఫ్ లో కూడా ఎంటర్ టైన్ మెంట్ ఉన్నప్పటికీ ఎమోషన్ డామినేట్ చేయడంతో ప్రేక్షకులు లీనమై చూసే అవకాశం ఉంది. మదర్ క్యారెక్టర్ కి రేవతిని ఎంపిక చేయడం, ఫాదర్ గా పోసానిని సెలక్ట్ చేయడం బాగుంది. ఎమోషన్ సీన్స్ లో వరుణ్ నుంచి పూరి మంచి నటన రాబట్టాడు. ఈ చిత్రం నటుడిగా వరుణ్ కి మరింత మంచి మార్కులు తెచ్చిపెడుతుంది. ఒక అప్ కమింగ్ హీరోని ఎలా చూపిస్తే అతనిలోని నటుడికి ప్లస్ అవుతుందో, ఎలాంటి సినిమా చేస్తే అతని తదుపరి కెరీర్ కి మంచి స్టెప్ అవుతుందో సరిగ్గా అలాంటి సినిమానే చేశాడు పూరి.


ఓవరాల్ గా చెప్పాలంటే.. వరుణ్, పూరీ డైలాగ్స్, స్ర్కీన్ ప్లే హైలైట్. మాస్ ప్రేక్షకులకు 'లోఫర్' పండగలాంటి సినిమా. వరుణ్ ని మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసే సినిమా. 'లోఫర్'కి వెళితే, రెండు గంటల ఇరవై నిమిషాల వినోదం గ్యారంటీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !