చిత్రం – లవర్స్ క్లబ్
నటీనటులు - అనిష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి, ధీరజ్, చిత్రం బాష, వైజాగ్ ప్రసాద్, అజయ్ రత్నం తదితరులు
మ్యూజిక్ - రవి నిడమర్తి
డి ఓ పి – డి.వి.ఎస్.ఎస్.ప్రకాష్
ఎడిటింగ్ - కిరణ్ కుమార్
మాటలు - ధృవ్ శేఖర్, ప్రదీప్ ఆచార్య
పాటలు - రాంబాబు గోసాల,ధృవ శేఖర్
ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్ - మదన్ గంజికుంట, అవ్వారి ధను
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ - నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి
నిర్మాత - భరత్ అవ్వారి
రచన-దర్శకత్వం - ధృవ్ శేఖర్
లవర్స్ క్లబ్ – ఈ సినిమా గురించి చిత్ర పరిశ్రమలోని వారు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఎలా ఉందో చూడాలని భావిస్తున్నారు. ఇలా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణం ఉంది. ఐ ఫోన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఐ ఫోన్ తో సినిమా తీయడం సాధ్యమేనా.. క్వాలిటీ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. కంటెంట్ బలంగా ఉండటంతో ఈ చిత్ర దర్శకుడు ధృవ్ శేఖర్ ఐ ఫోన్ తో సినిమాని తీయడానికి వెనుకాడలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. చెప్పడమే కాదు.. గ్రాండ్ గా ఈ రోజు (17.11.2017) ఈ సినిమా విడుదల చేసారు. ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ రోజు విడుదలైన ఈ ‘లవర్స్ క్లబ్’ అందరినీ ఆకట్టుకునే విధంగా చూద్దాం.
కథ
ప్రేమ జంటలను కలపడం, ప్రేమికులకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని తీర్చడం, లవర్స్ కి పెళ్లి చేయడం వంటి వ్యవహారాలను తన ‘లవర్స్ క్లబ్’ ద్వారా చేస్తుంటాడు రిషి (అనిష్ చంద్ర). దీనివల్ల యూత్ లో అతనికి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు. అయితే ఇలా పెళ్లిళ్లు చేయడం వల్ల రిషి ఇబ్బందుల్లో పడతాడు. కొన్ని ఫ్యామిలీలు రిషిని టార్గెట్ చేస్తాయి. మరోవైపు గీత (పావని) అనే అమ్మాయి రిషి ఇంట్లో అద్దెకు దిగుతుంది. తనకు పెళ్లయ్యిందని చెబుతుంది. కానీ గీత పై మనసు పడతాడు రిషి. మరి గీతకు పెళ్లయ్యిందా… గీత, రిషి ప్రేమ సఫలమయ్యిందా.. ఇదొక స్టోరీ అయితే, మరొక స్టోరీ ఆటో డ్రైవర్ రాజు, రాణిది.
ఊర్లో పెద్దింటి కుటుంబానికి చెందిన రాణి (పూర్ణ) ని ఆటో డ్రైవర్ రాజు (ఆర్యన్) ప్రేమిస్తాడు. రాణి కూడా ఇతగాడిని ప్రేమిస్తుంది. ఈ ఇద్దరి ప్రేమను రాణి అన్నయ్య మల్లి (ధీరజ్) వ్యతిరేక్తిస్తాడు. లవర్స్ ని కలుపుతున్న రిషిని చంపమని మల్లికి సుపారి ఇస్తారు. అసలు రిషిని చంపమని మల్లికి చెప్పింది ఎవరు… రాజు, రాణి ప్రేమ సఫలమయ్యిందా… రిషి, గీత ఒకటయ్యారా… రిషి ఎందుకు ప్రేమికులను కలుపుతుంటాడు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
రిషి పాత్రలో అనీష్ చంద్ర ఒదిగిపోయాడు. లవర్స్ క్లబ్ నడిపే కుర్రాడు, యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కుర్రాడిగా రిషి నటన చాలా బాగుంది. మాస్ లుక్ రిషి ని యూత్ కి దగ్గరయ్యేలా చేస్తుంది. గీత పాత్ర చేసిన పావని లో రెండు షెడ్య్స్ కనబడతాయి. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే, మరోవైపు మోడ్రన్ డ్రెస్సుల్లో ఒదిగిపోయింది. ఆర్యన్ కు చాలా మంచి పేరు వస్తుంది. ఆటో డ్రైవర్ రాజుగా చక్కగా నటించాడు. పూర్ణ పాత్రలో అందంగా కనిపించిన రాణి నటన పరంగా కూడా వావ్ అనిపించింది. ఇక ఇందులో చెప్పుకోవాల్సిన పాత్ర మల్లిది. ఈ పాత్రను ధీరజ్ చేసాడు. ఆకట్టుకునే బాడీతో నెగటివ్ షేడ్ క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించి విలన్ పాత్రలకు తను సూట్ అవుతానని నిరూపించుకున్నాడు, అజయ్ రత్నం, భాషా, ఇందు, వైజాగ్ ప్రసాద్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఐ ఫోన్ తో తీసిన సినిమా ఇంత క్వాలిటీగా ఉంటుందాని అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. రన్నింగ్ షాట్స్, యాక్షన్ సీన్స్ లో కూడా క్వాలిటీ లోపించలేదు. ఈ రకమైన టెక్నాలజీతో సినిమా తీసి, కొత్త టెక్నాలజీని పరిచయం చేసినందుకు డైరెక్టర్ ధృవ్ శేఖర్ ని, కెమెరామ్యాన్ ప్రకాష్ ని అభినందించాల్సిందే. ఇక డైరెక్టర్ ధృవ్ మంచి కంటెంట్ ని సమకూర్చుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ కంటెంట్ కనెక్ట్ అవుతుంది. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన కమల్ పూర్తి న్యాయం చేసారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
పెదవి ముద్దులు, హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ యూత్ ని కట్టిపడేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సన్నివేశాలు కూడా ఉన్నాయి. దాంతో టోటల్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఆల్ మోస్ట్ సీన్లు రియలిస్టిక్ గా అనిపిస్తాయి. కాలు పోగొట్టుకున్న వ్యక్తి స్టోరీ ఎమోషనల్ గా, డిడిఎల్ జే గెటప్స్ లో వచ్చే స్కూల్ లవర్స్ జంట సీన్స్ కామెడీగా, పోలీసాఫీసర్ కు లవర్స్ క్లబ్ టీం కు మధ్య జరిగే సీన్ పవర్ ప్యాక్ డ్ గా... ఫేస్ బుక్ లో రాజు పెట్టే వీడియోతో సినిమా గ్రాఫ్ అమాంతం పెరిగింది. కమర్షియల్ కంటెంట్ ని వినోదాత్మకంగా చెప్పడంతో పాటు కొన్ని సీన్స్ ఆడియన్స్ ని ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేయగలగడం ఈ సినిమాకి మెయిన్ హైలైట్. కంటెంట్ ని నమ్ముకుని, ఐ ఫోన్ తో చేసిన ప్రయోగం సక్సెస్ అవుతుందనే నమ్మకం ఈ చిత్రం యూనిట్ లో బలంగా కనిపించింది. వీరి టార్గెట్ నెరవేరుతుందని చెప్పొచ్చు.
ఫైనల్ చెప్పాలంటే… ఈ ‘లవర్స్ క్లబ్’ ని ఈ వీకెండ్ లో అందరూ ఎంజాయ్ చెయ్యొచ్చు. కొత్త ప్రయత్నాన్ని ప్రోత్సహించవచ్చు.
ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ – 3/5