View

Kai Raja Kai Movie Review

Thursday,April23rd,2015, 12:51 PM

చిత్రం - కాయ్ రాజా కాయ్
నటీనటులు - రామ్ ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య, షామిలి, హరి, డి.యం.కె, రాఘవ, టార్జాన్, రోజా తదితరులు
సంగీతం - జె.బి
సినిమాటోగ్రఫీ - దేవ్
ఎడిటింగ్ - ఉద్ధవ్ ఎస్.బి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ - శ్రీనివాస్ అడ్డాల
నిర్మాత - సతీష్ రాజు వేగేశ్న
నిర్మాణం - పుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం - శివగణేష్
విడుదల తేదీ - 23.4.2015

డైరెక్టర్ మారుతి ఏ సినిమాకైనా బ్యాక్ బోన్ గా ఉన్నాడంటే ఆ సినిమాపై ఎంతో కొంత ఆసక్తి నెలకొంటోంది. దానికి కారణం అతను యూత్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తుండమే. తాజాగా మారుతి టాకీస్ సమర్పణలో ఫుల్ మూల్ ఎంటర్ టైన్స్ మెంట్స్ నిర్మించిన చిత్రం 'కాయ్ రాజా కాయ్'. ఈ సినిమా ద్వారా శివ గణేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్ ఖన్నా, మానస్, షామిలి, శ్రావ్యలు హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు (23.4.2015) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్, కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో 'కాయ్ రాజా కాయ్' ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥
గోల్డ్ బిజినెస్ చేసే వ్యక్తిని చంపేసి, అతని దగ్గర నుంచి బంగారు నగల పెట్టెను దోచుకెళతారు కొంతమంది దుండగులు. ఆ నగల పెట్టెను ఓ కారులో పెట్టి పాడుబడిన గ్యారేజ్ లో ఉంచుతారు. భట్టూ అనే గ్యాంగ్ స్టర్ ఈ దుండగులను పట్టుకుని ఆ నగల పెట్టెను సొంతం చేసుకుంటాడు. ఈ కథతో పాటు ముగ్గురు యువకులు మానస్ (ఆనంద్), కన్నా (రామ్ ఖన్నా), చిట్టి (జోష్ రవి) కథ కూడా జరుగుతుంటుంది. ఆనంద్ ఉద్యోగం సంపాదించాలనే టార్గెట్ తో తిరుగుతుంటాడు. మెకానిక్ షాపులో పని చేస్తుంటాడు కన్నా. కష్టపడకుండా, తప్పుడు దారుల్లో వెళ్లయినా సరే డబ్బులు సంపాదించాలనే లక్ష్యంలో ఉంటాడు చిట్టి.
ఈ ముగ్గురి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరగడంతో ఇబ్బందుల్లో ఉన్న ఈ ముగ్గురూ కలిసి ఓ కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా భట్టూ చేతికి చిక్కిన నగల పెట్టే వీరి సొంతమవుతుంది. దాంతో భట్టూ వీరి వెనకాల పడతాడు. ఈ ముగ్గురూ కలిసి కిడ్నాప్ చేసిన ఆనంద్ గర్ల్ ఫ్రెండ్ కోసం కొంతమంది వెతుకుతుంటారు. అసలు ఈ ముగ్గురూ కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎవరు వెతుకుతుంటారు... బంగారం పెట్టె గురించి భట్టూకి తెలిసిన నిజమేంటీ? ఈ ముగ్గురు కుర్రాళ్లు తమ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ చిత్ర కథ.

నటీనటుల పెర్ ఫామెన్స్
ఈ సినిమాలో మానస్, రామ్ ఖన్నా హీరోలుగా నటించారు. ఇద్దరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఆనంద్ పాత్రలో మానస్ చక్కగా ఒదిగిపోయాడు. వంద శాతం తన పాత్రకు న్యాయం చేసాడు. మానస్ కి ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ వచ్చే అవకాశముంది. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. రామ్ ఖన్నా కూడా తన పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. జోష్ రవి తన పాత్ర ద్వారా ప్రేక్షకుల్లో జోష్ నింపడానికి చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది. హీరోయిన్లు శ్రావ్య, షామిలి చక్కగా ఉన్నారు. తమ పాత్రలకు న్యాయం చేసారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం
సింఫుల్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిన్న సినిమాని విజువల్ గా చక్కగా ఆవిష్కరించిన సినిమాటోగ్రాఫర్ దేవ్ ని అభినందించాల్సిందే. చక్కటి లైటింగ్ స్కీమ్ ని ప్లాన్ చేసుకుని కనులవిందుగా సినిమాని తెరకెక్కించారు. డైరెక్టర్ శివగణేష్ ఎంచుకున్న స్టోరీ లైన్ కొత్తది కాదు. ఇక ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే కూడా చేయలేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. కానీ టేకింగ్ పరంగా దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. క్రైమ్, కామెడీ సినిమాకి టేకింగ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే అందరికీ సినిమా కనెక్ట్ అవుతుంది. ఆ పరంగా దర్శకుడు అవుట్ ఫుట్ ని మెచ్చుకోవాల్సిందే. జె.బి అందించిన సంగీతం ఫర్వాలేదనిపించేలా ఉంది. టైటిల్ సాంగ్ అందరికీ నచ్చుతుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. ఈ జానర్ సినిమాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేస్తుంది. కానీ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్సే అని చెప్పాలి. ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలను తొలిగించి ఉంటే, కొంతమేర నిడివి తగ్గి సినిమా త్వరగా పూర్తయిన ఫీలింగ్ కలిగి ఉండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
క్రైమ్ జానర్ సినిమాకి స్ర్కీన్ ప్లే ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ సినిమాలో పూర్తిగా లీనమవుతారు. కానీ ఈ సినిమాలో సన్నివేశాలు ఊహించే విధంగా ఉండటం నిరాశపరిచే విషయం. కాకపోతే సీన్స్ విసుగు తెప్పించకపోవడం ఈ సినిమాకి ప్లస్. కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులకు బాగా రిలీఫ్ ఇస్తాయి. నిడివి కూడా ఈ సినిమాకి మైనస్. విలన్ పాత్ర పెద్ద ఇంపాక్ట్ ఇవ్వదు. లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలు, క్రైమ్ పార్ట్ అంతా ఏదో సినిమాలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 140నిముషాల నిడివి కూడా ఈ సినిమాకి మైనస్సే.

ఫైనల్ గా చెప్పాలంటే... కొంచెం కామెడీ, కొంచెం క్రైమ్, కొంచెం లవ్ లాంటి అంశాలతో తెరకెక్కిన సినిమా చూసి శాటిస్ ఫై అయిపోయేవారికి ఈ 'కాయ్ రాజా కాయ్' కనెక్ట్ అవుతుంది. మిగతావారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !