View

స్పైడర్ మూవీ రివ్య్వూ

Wednesday,September27th,2017, 04:26 AM

చిత్రం - స్పైడర్
బ్యానర్ - ఎన్.వి.ఆర్ సినిమా
నటీనటులు - మహేష్ బాబు, భరత్, యస్.జె.సూర్య, ప్రియదర్శి పులికొండ, ఆర్.జె.బాలాజి తదితరులు
సినిమాటోగ్రఫీ - సంతోష్ శివన్
సంగీతం - హ్యారీస్ జైరాజ్
ఎడిటింగ్ - ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు - యన్.వి.ప్రసాద్, ఠాగూర్ ప్రసాద్, మంజులా స్వరూప్
రచన, దర్శకత్వం - ఎ.ఆర్.మురుగదాస్


మహేష్ బాబు కి ఓ స్టోరీ లైన్ నచ్చితే సినిమా చేసేస్తాడు. తన ఇమేజ్ గురించి అసలు పట్టించుకోడు. కమర్షియల్ వ్యాల్యూస్ ఉన్నాయా... కామెడీ ఉందా.. పాటలున్నాయా... ఇవన్ని పక్కన పెట్టేస్తాడు. రిస్క్ ఉంటుందని తెలిసినా ఒప్పేసుకుంటాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ ఓ సినిమా చేసాడంటే ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ ఉంటుంది. రమణ, గజని, స్టాలిన్, కత్తి అంటూ మంచి సినిమాలు చేసాడు మురుగదాస్. తమిళ్ ప్రేక్షకులకే కాదు... తెలుగు ఆడియన్స్, బాలీవుడ్ ఆడియన్స్ కి సైతం ఈ సినిమాలు కనెక్ట్ అయ్యాయి. అలాంటి టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా కమిట్ అయ్యాడు అనగానే... ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా ఎలా ఉంటుంది.. ఎలా ఉండాలి అనే అంచనాలు తెగ పెరిగిపోయాయి. ఎన్ని థాట్స్ ఉన్నా ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా ప్రేక్షకులను అలరించే విధంగానే ఉంటుంది, మంచి సినిమా చూడబోతున్నాం అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి అందరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
శివ (మహేష్ బాబు) ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ లో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికున్న క్వాలిటీస్, చదువుకు టాప్ చైర్ లో కూర్చోవచ్చు. కానీ టాప్ ఛైర్ లో కూర్చోవడం అతని టార్గెట్ కాదు. పబ్లిక్ ఫోన్స్ ని ట్యాప్ చేసి, ఆపదలో ఉన్నవారిని కాపాడి, క్రైమ్ రేట్ తగ్గించడం కోసం తనే రెండు సాఫ్ట్ వేర్స్ ని క్రియేట్ చేస్తాడు. దాని ద్వారా ఆపదలో ఉన్నవారిని ఎలాంటి ప్రమాదం జరగకముందే కాపాడతాడు. తనవల్ల కాపాడబడిన వారు ఆనందంగా ఉండటం శివకు చాలా సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే ఆఫర్ ఇచ్చినా, అవకాశం ఉన్నా ఆ జాబ్ నుంచి బయటికిరాడు. ఇలాంటి సిట్యువేషన్ లో శివ ఓ అమ్మాయి ఫోన్ కాల్ వినడం, ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేరు, బయపడుతుందని తెలుసుకుని లేడీ కానిస్టేబుల్ ని తనతో పాటు తోడుగా ఉండమని పురమాయిస్తాడు. తెల్లారేసరికి ఆ అమ్మాయిలిద్దరూ కిరాతకంగా హత్య చేయబడతారు. షాక్ కి గురైన శివ ఆ హత్యలు చేసిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. కట్ చేస్తే...
భైరవుడు అనే సైకో ఈ హత్యలకు కారణం అని తెలుసుకుంటాడు. అతనిని ట్రేస్ అవుట్ చేయడానికి చేసిన ప్రయత్నంలో బయటపడిన విషయాలు విస్మయానికి గురి చేస్తాయి. సశ్మానంలో పుట్టి పెరిగిన భైరవుడు (యస్.జెజసూర్య) మనుషులు ఏడుస్తుంటే తను ఆనందపడతాడు. చిన్నప్పట్నుంచి ఇలాంటి ఓ డిసార్డర్ తో పెరుగుతాడు. తన ఆనందం కోసం మనుషులను చంపుతుంటాడు. ఇతనికి ఓ తమ్ముడు ఉంటాడు. అతనిని శివ ట్రేస్ అవుట్ చేస్తాడు. దాంతో బైరవుడు బయటికి వస్తాడు. భవిష్యత్తులో మనుషులను చంపడానికి భైరవ వేసుకున్న ప్లాన్స్ శివకి తెలుస్తాయి. ఓ హాస్పటల్ ని టార్గెట్ చేసి, అందులో ఉన్న అందరినీ చంపడానికి భైరవుడు ప్లాన్ చేస్తాడు. ఈ క్రిమినల్ భైరవుడుని శివ ఎలా ట్రేస్ చేస్తాడు... ఈ ప్రయత్నంలో శివ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేదే ఈ సినిమా కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
సమాజం గురించి ఆలోచించే వ్యక్తిత్వం, మానవత్వం నిండిన పర్ ఫెక్ట్ సిటీజన్ పాత్ర శివది. ఈ పాత్రకు మహేష్ బాబు అన్ని రకాలుగా సూట్ అయ్యాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో ఉద్యోగం అంటే ఎంతో బాధ్యాతయుతంగా ఉండాలి. షార్ప్ గా ఉండాలి. ఫిట్ గా ఉండాలి. వీటికి తోడు హ్యాండ్ సమ్ గా ఉంటే ఆ పర్సనాల్టీని కళ్లగప్పగించి చూడాల్సిందే. సరిగ్గా మహేష్ బాబు తెరపై నటిస్తుంటే, ప్రేక్షకులు అలానే చూస్తారు. పూర్తిగా పాత్రలో ఒదిగిపోయాడు. డైరెక్టర్ యస్.జె.సూర్య విలన్ గా నటించాడు. నటించాడు అనేకంటే జీవించాడు అనడం కరెక్ట్. రకుల్ ప్రీత్ సింగ్ పాటలకు పరిమితమయ్యింది. నటనకు స్కోప్ లేదు. గ్లామర్ గా ఉంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
సొసైటీలో సైకో కిల్లర్స్ ఉన్నారు. ఈ డిసార్డర్ తో ఉండేవాళ్ల ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి. ఇలాంటి ఓ సైకో కిల్లర్ ని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం చేస్తున్న కుర్రాడు, సొసైటీ గురించి ఆలోచించే కుర్రాడు ఎలా మట్టుబెట్టాడు అనే థాట్ ని తెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్ మురుగదాస్. సింఫుల్ స్టోరీ లైన్ అయినప్పటికీ, విలన్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు.. అతనిని హీరో ఎలా అడ్డుకుంటాడు అనే ఉత్కంఠత మెయింటెన్ చేసాడు. రేసీ స్ర్కీన్ ప్లే ఆకట్టుకుంటుంది. టెక్నికల్ గా సినిమా సూపర్బ్. సంతోష శివన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలం. ఐ ఫీస్ట్ మూవీ. హ్యారీస్ జై రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్. సీన్స్ ని ఎలివేట్ చేయడం, రేసీ స్ర్కీన్ ప్లేకి సరిపడా రీరికార్డింగ్ ఆడియన్స్ ని సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేసింది. నిర్మాణపు విలువలు సూపర్బ్. ఎక్కడా రాజీపడలేదు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
సొసైటీ నుంచి పుట్టిన కథ ఇది. బ్లేడ్ తో గొంతులు కోసిన సైకో... ఓ ఇంట్లో చొరబడి బయటికిరాని సైకో... సైకో వీరంగం... అంటూ వార్తలు వింటూనే ఉంటాం. అసలు సైకోలుగా ఎలా తయారవుతారు... ఈ డిసార్డర్ ఉన్న వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో చక్కగా చూపించాడు డైరెక్టర్ మురుగదాస్. ప్రస్తుతం నడుస్తున్న ఫాస్ట్ యుగంలో మనుషులు పక్కన వారిని పట్టించుకోవడం మానేసారు. షేస్ బుక్, ట్విట్టర్లలో లైక్ లు, షేర్ లు చేయడంతో సమయాన్ని గడిపేస్తున్నారు. స్వయంగా మనం ఆపదలో పడితే తప్ప మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అని పట్టించుకోవడంలేదు. మనుషుల్లో మానవత్వం ఉన్నప్పటికీ, అది బయటపెట్టే సిట్యువేషన్ లు, స్పందించే విధానంలో మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిది కాదు.. మనుషులు పక్క మనుషులను ప్రేమించాలి అనే మంచి మేసేజ్ ని ఈ సినిమా ద్వారా ఇచ్చాడు మురుగదాస్. ఈ పాయింట్ కి కమర్షియల్ హంగులు జోడించి చెడగొట్టలేదు. మహేష్ బాబు కూడా తన ఇమేజ్ ని పక్కన పెట్టేసాడు. మానవత్వం, ఇంటెలిజెన్స్ కలగలిసిన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు.. ఎంత అద్భుతం చేయగలుగుతాడు... ఇలాంటి వారివల్ల సొసైటీకి ఎంత ఉపయోగం.. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందో సరిగ్గా అలా నటించాడు మహేష్ బాబు. రోలర్ కోస్ట్ ఫైట్ థ్రిల్ కి గురి చేస్తుంది. తల్లిని చంపడానికి విలన్ ప్లాన్ చేస్తే... తల్లిని కాపాడుకోవడం, లేడీస్ బలం ఏంటీ... వారిని మోటివేట్ చేస్తే, ఎంత ధైర్యంగా ముందడుగు వేస్తారు వంటి సీన్స్ ఆడియన్స్ లో ఓ రకమైన ఎమోషన్ ని క్రియేట్ చేస్తాయి. క్లయిమ్యాక్స్ సీన్స్ లో మహేష్ బాబు నటన వావ్ అనిపించకమానదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు... ఉత్కంఠభరితమైన సన్నివేశాలకు కామెడీ సీన్స్ స్టాపర్స్ అవ్వడం, ఐటమ్ పాటలు ఇలాంటివేవీ ఈ సినిమాలో లేవు. నీట్ ఫిలిం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే సినిమా. ఇంటెలిజెన్స్ థ్రిల్లర్. మంచి సినిమా చూసామన్న ఫిలింగ్ తప్పకుండా కలుగుతుంది. డోంట్ మిస్ ఇట్... డైరెక్టర్ ని నమ్మి ఇలాంటి మంచి కథను అంగీకరించిన మహేష్ బాబుని అభినందించకుండా ఉండలేము. డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ థాట్ ని కూడా ప్రశంసించకుండా ఉండలేము.


ఫైనల్ గా చెప్పాలంటే... ఇలాంటి సినిమాలు అందరూ చేయలేరు. మంచి సినిమాలు రావాలి అని ఆడియన్స్ కోరుకుంటే మాత్రం సరిపోదు... మంచి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించాలి. అప్పుడే స్టార్ హీరోలు సైతం కాన్ఫిడెంట్ గా మంచి సినిమాలు చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి సినిమా స్పైడర్.


ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3.5/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !