View

మలుపు మూవీ రివ్య్వూ

Friday,February19th,2016, 11:08 AM

చిత్రం - మలుపు
బ్యానర్ - ఆదర్శ్ చిత్రాలయ ప్రై.లిమిటెడ్
నటీనటులు - ఆది పినిశెట్టి, మిథున్ చక్రవర్తి, నిక్కి గల్రాని, రిచా పల్లోడ్, పశుపతి, ప్రగతి, నాజర్, కిట్టి, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం - ప్రసన్, ప్రవీణ్, శ్యామ్
సినిమాటోగ్రఫీ - షణ్ముగ సుందరం
ఎడిటింగ్ - సాబు జోసెఫ్
నిర్మాత - రవిరాజా పినిశెట్టి
రచన, దర్శకత్వం - సత్య ప్రభాస్ పినిశెట్టి


ఎంతో మంది హీరోలను పలు రకాల పాత్రల్లో తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు రవిరాజా పినిశెట్టిది. ఆయన తనయుడు ఆది పినిశెట్టిలో మంచి నటుడు ఉన్నాడు. మిరుగం, ఈరమ్, అరవాన్, కోచడయాన్ తదితర చిత్రాలతో తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. 'గుండెల్లో గోదారి' ద్వారా తెలుగు ప్రేక్షకులతో కూడా భేష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు 'మలుపు'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఓ కొత్త రకం సినిమా తీయాలనే ఆకాంక్షతో ఆది సోదరుడు సత్యప్రభాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఒక కొడుకు హీరోగా, మరో కొడుకు దర్శకుడిగా రవిరాజా పినిశెట్టి నిర్మించిన ఈ 'మలుపు' ఎలా ఉందో చూద్దాం...


à°•à°¥
డిసెంబర్ 31 అర్ధరాత్రి ఓ అమ్మాయి తను చనిపోయే ముందు ఎమర్జన్సీ హాట్ లైన్ కి హెల్ప్ అడుగుతూ ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి మర్డర్ అయిన విషయాన్ని ఎవరో దాచడానికి ప్రయత్నిస్తారు.. కట్ చేస్తే...


సగ అలియాస్ సతీష్ గణపతి (ఆది) వైజాగ్ నుంచి ముంబయ్ వస్తాడు. ముంబయ్ లోని మాఫియా డాన్ ముదలయార్ (మిధున్ చక్రవర్తి) ని కలవడానికి సగ ప్రయత్నాలు చేస్తుంటాడు. కట్ చేసి 4 నెలల క్రితంలోకి వెళితే..


సగ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తనకు ముగ్గురు ఫ్రెండ్స్. నలుగురు కలిసి ఆ యేడాది ఎగ్జామ్స్ ని ఎగొట్టేసి ఓ ఆరు నెలల పాటు లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్ లో లాస్య (నిక్కి గల్రాని) ప్రేమలో పడతాడు సగ. వీరి ప్రేమకు హెల్ప్ చేస్తారు సగ ఫ్రెండ్స్. సగ ఓ బాధ్యతలేని కుర్రాడని సగ తండ్రి ఎప్పుడు తిడుతుంటాడు. సగ తల్లి మాత్రం సగ ఆటకాయితనంగా ఉంటాడేకానీ బాధ్యతకల కుర్రాడని నమ్ముతుంది. సరిగ్గా ఆ సమయంలో సగ అక్కకి పెళ్లి కుదురుతుంది. సగ తల్లిదండ్రులు ఊరికి వెళుతూ సగకి పెళ్లి పనులు పురమాయించి జాగ్రత్తగా చేయాలని చెబుతారు. అదే రోజు డిసెంబర్ 31 కావడంతో సగ, అతని ఫ్రెండ్స్ పార్టీ లో పాల్గొని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోయిన తర్వాత లాస్యను తీసుకుని సగ వెళ్లిపోతాడు. ఆ తర్వాత రెస్టారెంట్ లో సగ ప్రెండ్స్ తాగుతూ పార్టీ చేసుకుంటుంటారు. తాగిన మత్తులో సగ ఫ్రెండ్ రెస్టారెంట్ లో ఉన్న ప్రియ (రిచా పల్లడ్) ని టీజ్ చేస్తాడు. దాంతో ప్రియ ఫ్రెండ్ సూర్య వీరితో గొడవపడతాడు. ఆ గొడవ పెద్దదవ్వడం సూర్యను సగ ఫ్రెండ్స్ కొట్టడం జరుగుతుంది. తన ఫ్రెండ్ తాగి కంట్రోల్ లేకుండా ఉన్నాడని మరో ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న సగ రెస్టారెంట్ కి వస్తాడు. అప్పడికే తన ఫ్రెండ్స్ తో సూర్య గొడవపడుతుంటాడు. సగ గొడవ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈలోపు పోలీసులు వచ్చి సగ ఫ్రెండ్ లో ఒక కుర్రాడు కమీషన్ కొడుకు అవ్వడంతో సూర్య, ప్రియతో దురుసుగా ప్రవర్తించి సగ, ఫ్రెండ్స్ ని అక్కడ్నుంచి వెళ్లిపొమ్మంటారు పోలీసులు. సూర్యను అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే...


ప్రియ ముంబయ్ డాన్ ముదలయార్ కూతురని తెలుస్తుంది. కమీషనర్ కి ఈ గొడవ తెలియడంతో తన కొడుకును, మిగతా ప్రెండ్స్ ని కొన్నాళ్ల పాటు ఊరి నుంచి పంపించేయడానికి ప్లాన్ చేస్తాడు. కానీ తన ఇంట్లో అక్క పెళ్లి ఉండటంతో సగ మాత్రం ఊరి వదిలి వెళ్లడానికి ఇష్టపడడు. కట్ చేస్తే...


ప్రియ, సూర్య ఇద్దరు కనబడకుండాపోతారు. వాళ్లు కనబడకుండా పోవడానికి కారణం ఎవరు? ఆది ఎందుకు ముదలయార్ ని కలవడానికి ముంబయ్ వెళ్లాడు.. ఊరి నుంచి వెళ్లిపోయిన సగ ఫ్రెండ్స్ ఏమవుతారు.. తన కూతురితో గొడవపడింది సగ అతని ఫ్రెండ్స్ అని ముదలయార్ కి తెలుస్తుందా.. సగ అతని ఫ్రెండ్స్ ని ముదలయార్ ఏం చేస్తాడు... ఈ ప్రాబ్లమ్ నుంచి సగ సేఫ్ గా బయటపడతాడా.. ముదలయార్ చేతిలో చిక్కకున్న తన ఫ్రెండ్స్ ని సగ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
మంచి ఫిజిక్, చక్కని యాక్టింగ్ తో ఆది ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయే సినిమా ఇది. ఆది అనే విషయం మర్చిపోయి తెర మీద ఉన్నది సగ అనే కుర్రాడు అని ప్రేక్షకులు ఫీలయ్యే రేంజ్ లో ఆది ఆ పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి దగ్గర చివాట్లు తినేటప్పుడు అమాయకంగా, తల్లి దగ్గర గారాల కొడుకుగా, ప్రేయసి దగ్గర మంచి ప్రియుడిగా, స్నేహం కోసం ప్రాణాలివ్వడానికి సైతం వెనకాడని స్నేహితుడిగా ఇలా సగ పాత్రలో ఉన్న పలు వేరియేషన్స్ ను అద్భుతంగా ఆవిష్కరించాడు. నిక్కీ గల్రాని క్యూట్ గా ఉంది. హెవీ బైక్ నడిపి, తాను డ్యాషింగ్ అని నిరూపించుకుంది. ముదలియార్ పాత్రలో మిథున్ చక్రవర్తి నటన సుపర్బ్. హరీశ్ ఉత్తమన్ తన టాలెంట్ నిరూపించుకోవడానికి పనికొచ్చిన మరో సినిమా. నాజర్, ప్రగతి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాలా గ్యాప్ తర్వాత రిచా పల్లోడ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. పాత్ర పరిధి మేరకు నటించింది.


సాంకేతిక వర్గం
దర్శకుడు సత్య ప్రభాస్ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ద్వారా రాసుకున్న కథ ఇది. స్ర్కీన్ల ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలం. స్టార్టింగ్ టు ఎండింగ్ ఉత్కంఠగా సాగే స్ర్కీన్ ప్లేతో తీశాడు. మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తీసిన సత్య ప్రభాస్ కి ఇది తొలి సినిమా కావడం విశేషం. ప్రేక్షకులు కుర్చీల్లోంచి కదలకుండా చూసేట్లు తీశాడు. ముఖ్యంగా ఇటు ఎ సెంటర్ అటు బి, సి అన్ని వర్గాలవారికీ నచ్చేలా ఈ సినిమా ఉంది. ట్విస్ట్ లు ఆసక్తిగా ఉంటాయి. అంతే ఆసక్తిగా ఆ ట్విస్ట్ లను రివీల్ చేసిన విధానం బాగుంది. అలా కొన్ని సినిమాలకే కుదురుతుంది. సినిమా పరిశ్రమకు దొరికిన మరో టాలెంటెడ్ దర్శకుడు సత్యప్రభాస్. ప్రసన్-ప్రవీణ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ముఖ్యంగా 'వాడు వీడు ఎవడైనా...' పాట చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి ఓ బలం. శ్యామ్ ఫొటోగ్రఫీ బాగుంది. ఒక కొడుకుని దర్శకునిగా పరిచయ్ చేస్తూ, మరో కొడుకు హీరోగా రవిరాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. మేకింగ్ వేల్యూస్ బాగున్నాయి. హ్యామ్ బ్యానర్ అయినప్పటికీ, సీన్లని ఆది మీదే కాకుండా, కథ ప్రకారం అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలకు డిఫరెంట్ గా సాగే చిత్రం ఇది. మొదటి సినిమాతోనే తనలో మంచి టెక్నీషియన్ ఉన్న విషయాన్ని సత్యప్రభాస్, 'గుండెల్లో గోదారి'లోనే తనలో మంచి నటుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్న ఆది మరోసారి పాత్రకు తగ్గట్టుగా మౌల్డ్ కాగలననే విషయాన్ని నిరూపించుకున్నారు. మొత్తం మీద తండ్రి రవిరాజా పినిశెట్టి గర్వించదగ్గ కొడుకులనే చెప్పాలి. ఫస్టాఫ్ సరదాగా, సెకండాఫ్ ఉత్కంఠగా సాగే ఈ చిత్రాన్ని అన్ని వర్గాలవారూ చూడొచ్చు. గంటా యాభై తొమ్మిది నిమిషాలు సాగే ఈ చిత్రంలో ఒక్క సీన్ కూడా వేస్ట్ అనిపించదు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ ప్రేకకులకు కలగడం ఖాయం. హీరోగా ఆది ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు.. దర్శకుడిగా సత్యప్రభాస్ కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పాలి.


ఫైనల్ గా చెప్పాలంటే.. ప్రతి మలుపూ ఆసక్తికరంగా సాగే ఈ 'మలుపు'ని మిస్ కావొద్దు. కొనుక్కునే టికెట్ కీ, వెచ్చించే టైమ్ కీ పూర్తి న్యాయం చేసే సినిమా.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !