View

మనవూరి రామాయణం మూవీ రివ్య్వూ

Wednesday,October05th,2016, 07:40 PM

చిత్రం - మనవూరి రామాయణం
నటీనటులు - ప్రకాశ్ రాజ్, ప్రియమణి, పృథ్వీ, సత్యదేవ్, రఘుబాబు
కథ - జాయ్ మాథ్యూ
మాటలు - రమణ గోపిశెట్టి, ప్రకాశ్ రాజ్
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - ముకేశ్
సంగీతం - మాస్ట్రో ఇళయరాజా
నిర్మాతలు - ప్రకాశ్ రాజ్, రామ్ జీ
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - ప్రకాశ్ రాజ్


తెరపై కనిపించే పాత్రలు అనుభవించే ఆనందం, బాధ.. చూసే ప్రేక్షకులు ఫీలైతే ఆ సినిమా వారి మనసుకి దగ్గరైనట్లే. 'మన ఊరి రామాయణం' అలాంటి సినిమానే. స్టోరీ లైన్ చిన్నది. కానీ, మనసుపై గాఢమైన ముద్ర వేస్తుంది. థియేటర్ నుంచి వచ్చాక కూడా వెంటాడుతుంది. ఇప్పటికే ధోని, ఉలవచారు బిర్యాని వంటి చిత్రాల ద్వారా తనలో మంచి టేస్ట్ ఫుల్ డైరెక్టర్ ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు ప్రకాశ్ రాజ్. నటుడిగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక.. తాజాగా ప్రకాశ్ రాజ్ నటించి, దర్శకత్వం వహించిన 'మన ఊరి రామాయణం' కథ గురించి చెప్పాలంటే...


à°•à°¥
భుజంగయ్య (ప్రకాశ్ రాజ్) దుబాయ్ లో బాగా సంపాదించి తన ఊరిలో స్థిరపడిన వ్యక్తి. కుటుంబం అంతా తన కంట్రోల్లో ఉండాలనుకునే వ్యక్తి. పరువు కోసం ప్రాకులాడుతుంటాడు. చదువుకోవాలనుకునే కూతురి ఇష్టానికి సైతం అడ్డంపడి పెళ్లి చేసేయాలనుకుంటాడు. భుజంగరావుకి నమ్మినబంటు ఆటోడ్రైవర్ శివ (సత్యదేవ్). ఓ సందర్భంలో శివ ఆటోలో వెళుతూ బస్టాండ్ దగ్గర ప్రియమణిని చూస్తాడు భుజంగరావు. ఆమెపై మోజు పడతాడు. తను వేశ్య అని తెలియకపోయినా శివ ద్వారా తనతో వస్తుందేమో అడగమని చెబుతాడు భుజంగరావు. ఆ రాత్రి భుజంగరావుతో గడపడానికి అంగీకరిస్తుంది ప్రియమణి, పరువు కోసం ప్రాకులాడే భుజంగరావు ఎవరి కంటపడకుండా ఆమెతో గడపాలనుకుంటాడు. ఎక్కడ ఆమెతో గడపాలో తికమకపడుతున్న భుజంగరావును, అతని ఇంటి ముందు ఉన్న కొట్టులాంటి రూమ్ లో ఉండమని చెబుతాడు శివ. భుజంగరావును, ప్రియమణిని ఆ రూమ్ లో వదిలేసి, ఎవరికి అనుమానం రాకుండా ఆ రూమ్ కి తాళం వేసి, ఓ గంట తర్వాత వస్తానని చెప్పి బయటికి వెళతాడు శివ. పోలీస్ డ్రంక్ డ్రైవ్ లో దొరికిపోయి ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన పరిస్థితి శివకు ఏర్పడుతుంది. దాంతో ప్రకాశ్ రాజ్, ప్రియమణి రూమ్ లోపల ఇరుక్కుపోతారు. భుజంగరావు మొబైల్ కి ఫోన్ చేస్తాడు శివ. మొబైల్ ఇంట్లో ఉంటుంది. ఆ విషయం తెలీని శివ ఫోన్ లో అంతా చెప్పేస్తాడు. తర్వాత విషయం అర్ధం చేసుకుని తన అన్న భుజంగరావు ఇంట్లో అంతా తెలిసిపోయిందని, అన్నయ్య పరువు పోయిందని తెగ బాధపడిపోతాడు శివ. మరో వైపు రూమ్ లోపల ఇరుక్కున్న భుజంగరావు ఈ విషయం బయటపడి తన పరువు పోతుందేమోనని తెగ టెన్షన్ పడిపోతుంటాడు. అతనితో పాటు రూమ్ లోపల ఉన్న ప్రియమణి అతను బేసిక్ గా మంచివాడనే విషయాన్ని అర్ధం చేసుకుంటుంది.


మరి ఫైనల్ గా ఆ రూమ్ తలుపులు ఎవరు తీస్తారు.. భుజంగరావు పరువు పోతుందా... భుజంగరావు ఇంట్లో ఎవరికి భుజంగరావు తమ ఇంటిముందు ఉన్న రూమ్ లో ఓ అమ్మాయితో ఉన్నాడన్న సంగతి తెలుస్తుంది.. రూమ్ లో ఉన్న భుజంగరావు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది.. రూమ్ లోంచి బయటపడిన తర్వాత అతని ప్రవర్తన లో వచ్చిన మార్పేంటి అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి పాత్ర దొరకాలే కానీ తన సత్తా చాటుకుంటారు ప్రకాశ్ రాజ్. భుజంగరావు పాత్రలో నటించారు అనేకంటే జీవించారు అనడం కరెక్ట్, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ కూడా మనసును టచ్ చేసే విధంగా ఉంటాయి. పరువు కోసం ప్రాకులాడే వ్యక్తిగా తన బాడీ లాంగ్వేజ్ సూపర్బ్. ప్రియమణి అద్భుతంగా నటించింది. ఓ వేశ్యగా ఎలాంటి బెరుకులేని తత్వం, మరోవైపు ఎదుటి మనిషి భావాలను అర్దం చేసుకోగల వ్యక్తిత్వం... ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది ప్రియమణి. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఫృథ్వీ ది. ఒకప్పుడు పేరున్న డైరెక్టర్, ఓ స్ర్కిఫ్ట్ రెడీ చేసుకుని తను పరిచయం చేసిన హీరోకి కథ చెప్పి మళ్లీ దర్శకత్వం వహించడానికి తపనపడే వ్యక్తిగా పృథ్వీ క్యారెక్టర్ సాగుతుంది. ఈ క్యారెక్టర్ ని అద్భుతంగా చేసాడు ఫృథ్వీ. భుజంగరావు నమ్మినబంటుగా సత్యదేవ్ చేసిన శివ పాత్ర బాగుంటుంది. శివ పాత్ర హుషారుగా సాగుతుంది. తన యజమాని పరువు ఎక్కడ పోతుందనే టెన్షన్ పడే వ్యక్తిగా సత్యదేవ్ చక్కటి అభినయాన్ని కనబర్చాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
సింఫుల్ స్టోరీ లైన్. à°† స్టోరీ లైన్ ని చక్కటి స్ర్కీన్ ప్లే తో మలిచిన విధానం బాగుంది. సినిమాలోని సీన్స్ నాటకీయంగా కాకుండా, రియల్ à°—à°¾ à°“ మనిషి జీవితాన్ని చూస్తున్న ఫీల్ కలగజేస్తుంది. à°† పరంగా స్ర్కీన్ ప్లే అద్భుతంగా సమకూర్చిన ప్రకాశ్ రాజ్ ని అభినందించాల్సిందే. దర్శకుడిగా కూడా కథకు న్యాయం చేసారు. టేకింగ్ బాగుంది. డైలాగ్స్ సూపర్బ్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చక్కగా కుదిరాయి. à°ˆ చిత్రానికి ఇళయరాజా సంగీతమందించారు. à°ˆ సినిమాలోని సీన్స్ ఎలివేట్ అవ్వడానికి ముఖ్య కారణం à°°à±€-రికార్డింగ్. ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి అయువుపట్టు. ఆడియన్స్ ని సీన్స్ లో ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తుంది. కథకు సరిపడా బడ్జెట్ ని సమకూర్చుకుని à°ˆ సినిమాని తెరకెక్కించారు.  à°¤à±†à°²à±à°—ు రాష్ట్రాల్లో అభిషేక్ పిక్చర్స్ à°ˆ చిత్రాన్ని విడుదల చేస్తోంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
అందరూ మంచివాళ్లే. సందర్భాన్ని బట్టి వాళ్లల్లో చెడు బయటకు వస్తుందన్నది ఈ సినిమా కథాంశం. పడుపు వృత్తిలో ఉన్న అమ్మాయి ఓ వ్యక్తికి ఆర్థిక సహాయం చేయడం, పరువు పోతుందని భయపడిన పెద్ద మనిషి మనసు తెలుసుకోవడం వంటి సన్నివేశాలు హత్తుకునే విధంగా ఉన్నాయి. చిన్న తప్పు చేయబోయి, చివరకి పరువు పోగొట్టుకునే పరిస్థితిలో ఇరుక్కుని భుజంగరావు పడే బాధ ప్రేకకుడూ అనుభవిస్తాడు. భుజంగరావు పరువు పోకూడదని ప్రేకకుడు కోరుకుంటాడు. ఆ స్థాయిలో ప్రకాష్ రాజ్ నటన, సీన్స్ ఉన్నాయి. బోర్ కొట్టే సీన్స్ ఉండవు. కథకు అతకని పాటలు వినిపించవు. కథానుగుణంగానే అన్నీ ఉంటాయి. అందుకే సినిమా చూస్తున్నట్లుగా అనిపించదు. కళ్ల ముందు జరుగుతున్న వాస్తవంలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఏదో బయటకు చెప్పలేని ఎమోషన్ చూసేవాళ్లకు కలుగుతుంది. సినిమాని సాగదీయకుండా సడన్ గా ముగించేస్తాడు. దాంతో ఇంకాసేపు సినిమా ఉంటే బాగుండేదనే ఫీల్ కలగక మానదు. ఆ ఫీల్ కలిగించిన ఏ సినిమా అయినా హిట్ అవడం ఖాయం. ఇది మన ఊరి రామాయణం. అందుకే మనందరం చూడాలి.


ఫైనల్ గా చెప్పాలంటే... మంచి సెన్సిబుల్ మూవీ. వండర్ ఫుల్ ఎమోషనల్ జర్నీ. ఈ జర్నీ తియ్యని అనుభూతిని మిగులుస్తుంది. రొటీన్ ఫార్ములాతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా మంచి రిలీఫ్.

 

ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !