View

OK Bangaram Movie Review

Friday,April17th,2015, 09:32 AM

చిత్రం - ఓకే బంగారం
బ్యానర్స్ - మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు - దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, లీలా శ్యామ్ సన్, ప్రభు లక్ష్మణ్, రమ్య సుబ్రమణ్యం, కనిక (గెస్ట్ అపియరెన్స్), బి.వి.దోషి (గెస్ట్ అపియరెన్స్) , బేబి రక్షణ తదితరులు
సంగీతం - ఏ.ఆర్.రహమాన్
సినిమాటోగ్రఫీ - పి.సి.శ్రీరామ్
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సహ నిర్మాతలు - శిరీష్, లక్ష్మణ్
నిర్మాత - దిల్ రాజు
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మణిరత్నం
విడుదల తేదీ - 17.4.2015

మామూలుగా ఏ దర్శకుడైనా ఒక్క ఫ్లాప్ లేక వరుసగా ఫ్లాప్ లు ఇస్తే.. ప్రేక్షకుల మైండ్ లో అతని పేరు డిలీట్ అయిపోతుంది. కానీ, కొంతమంది దర్శకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అలాంటి దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఈ మధ్య కాలంలో ఆయన్నుంచి వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా సంతృప్తిపరచకపోయినా మణిరత్నం మీద అభిమానం పోలేదు. అందుకే ఆయన తాజా చిత్రం 'ఓకే బంగారం'పై భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్హర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించారు. ఈ చిత్రం ఆడియో విజయోత్సవంలో 'దిల్ రాజు' పట్టుకున్నదల్లా బంగారం అవుతుందనీ, ఆ మ్యాజిక్ 'ఓకే బంగారం'కి వర్కవుట్ అవుతుందనీ మణిరత్నం అన్నారు.. మరి.. మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు తోడు, 'దిల్' రాజు మిడాస్ టచ్ మిరాకిల్ చేస్తుందా? చూద్దాం...

à°•à°¥
ఆది (దుల్కర్ సల్మాన్) వీడియో గేమ్స్ క్రియేటర్. వివాహ వ్యవస్థపై పెద్ద నమ్మకంలేని కుర్రాడు. ముంబయ్ లో జాబ్ చేస్తుంటాడు. యు.యస్ వెళ్లాలనే టార్గెట్ తో ఉంటాడు. తన అన్నయ్య ఫ్రెండ్ గణపతి (ప్రకాష్ రాజ్) ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటాడు. గణపతి భార్య భవాని (లీలా శ్యామ్ సన్) అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతుంటుంది. మెల్లగా మెల్లగా జ్ఞాపకశక్తి కోల్పోతున్న భార్యను ఓ చిన్నపిల్లను చూసుకున్నట్టు చూసుకుంటుంటాడు గణపతి.
ఆదిలానే వివాహ వ్యవస్థపై నమ్మకంలేని తార (నిత్యామీనన్) లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదనుకుంటుంది. తను ఆర్కిటెక్ గా చేస్తుంటుంది. ప్యారిస్ వెళ్లాలన్నది తార లక్ష్యం. వివాహ వ్యవస్థపై నమ్మకం లేని ఆది, తార ఓ సంఘటనలో కలుసుకోవడం, ఇద్దరూ సహజీవనం సాగించడానికి సిద్ధపడటం జరుగుతుంది. గణపతిని ఒప్పించి ఆదితో పాటు అతని రూమ్ లోనే ఉంటుంది తార. ఫిజికల్ గా దగ్గరైన ఆది, తార ఎవరి జీవితాలు వారివి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఉండొచ్చనే ధోరణిలో ఉంటారు. ప్యారిస్ వెళ్లడానికి ట్రై చేస్తున్న తారకు లైన్ క్లియర్ అవుతుంది. యు.యస్ వెళ్లాలనుకుంటున్న ఆదికి కూడా లైన్ క్లియర్ అవుతుంది. కానీ ఆదిని వదిలి వెళ్లలేనంతగా తార మైండ్ సెట్ మారుతుంది. ఆది కూడా తారను ప్రేమించడం మొదలుపెడతాడు. సహజీవనం మాత్రమే సాగించి, ఎవరి లైఫ్ వారు లీడ్ చేద్దామనుకున్న ఆది, తార చివరికి పెళ్లి చేసుకున్నారా? వివాహ వ్యవస్థపై వారికి నమ్మకం కలిగిందా? గణపతి, భవాని జీవితాలు ఎలాంటి స్ఫూర్తిని కలిగించాయనేదే ఈ చిత్రం కథ.

నటీనటులు
ఈ చిత్రం మొత్తం దుల్హర్, నిత్యామీనన్ ల పాత్రల చుట్టూ తిరుగుతుంది. దుల్కర్ కన్నా నిత్యాకు ఎక్కవు హావభావాలు కనబర్చే స్కోప్ ఉంది. తార పాత్రను అద్భుతంగా చేసింది. దుల్హర్ చూడ చక్కగా ఉన్నాడు. పాత్ర పరిధి మేరకు నటించాడు. గణపతి పాత్రను ప్రకాష్ రాజ్ చాలా బాగా చేశాడు. ఆయన భార్యగా చేసిన లీలా సామ్సన్ నటన బాగుంది. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవృద్ధురాలిగా ఆమె కనబర్చిన హావభవాలు మనసుని హత్తుకుంటాయి. ఇంకా ఇతర పాత్రధారులందరూ తమ తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
మణిరత్నం మాస్ సినిమాలు తీయగలడు... క్లాస్ సినిమాలు తీయగలడని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సినిమా కథ హై క్లాస్ సొసైటీకి దగ్గరగా ఉంటుంది. వాళ్లకి తగ్గట్టుగా మణిరత్నం ఈ సినిమా తీశారు. సినిమా మొత్తం మంచి మంచి ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. పీసీ శ్రీరామ్ కెమెరా సూపర్బ్. సినిమా కనువిందుగా ఉంది. ఎ.ఆర్. రెహ్మాన్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. 'మన మన మన మెంటల్ మదిలో...' పాట చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కిరణ్ రాసిన సంభాషణలు పొడి పొడిగా ఉన్నాయి. హృదయానికి హత్తుకునే సంభాషణలంటూ ఏవీ లేవు. దుల్హర్ కి హీరో నాని డబ్బింగ్ చెప్పాడు. నాని వాయిస్ చాలా బాగుంది. వాయిస్ లో చక్కటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగలిగాడు నాని.

ఫిల్మీబజ్ విశ్లేషణ
సహజీవనం అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విదేశాల్లో ఈ సంప్రదాయం చాలా జోరుగా సాగుతుంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే మొదలైంది. అది కూడా ముంబయ్ లో అక్కడక్కడా సాగుతోందని చెప్పుకుంటారు. ఆ మాటలు విని, 'ఇదేం పాడు పని' అని పెదవి విరిచేవాళ్ల సంఖ్యే ఎక్కువ. అందుకని ఆ పాయింట్ తో సినిమా అంటే రిస్కే. అయినప్పటికీ మణిరత్నం రిస్క్ తీసుకున్నారు. పెళ్లంటే పడని ఓ యువతీ యువకుడు సహజీవనం చేయాలనుకుంటారు. ఇద్దరి మధ్య అప్పుడే కుదిరిన స్నేహం పడక పంచుకునే వరకూ వెళ్లడం ఈ సినిమాలో ముఖ్యంగా మింగుడుపడని విషయం. మణిరత్నం పరిశీలనలో నేటి తరం అంత ఫాస్ట్ గా ఉందా? మనసులు కలిసిన ప్రేమలను చూపించిన మణిరత్నం ఇప్పుడు శరీరాలు కలిసిన తర్వాత ప్రేమ ఏర్పడటం చూపించడంతో 'ఈ నగరానికి ఏమైంది...' అని ఓ యాడ్ లో వచ్చినట్లుగా 'ఈ మణిరత్నంకి ఏమైంది...' అనాలనిపిస్తుంది. రోజా, బొంబాయి, నాయకుడు, సఖి.. లాంటి హృదయానికి హత్తుకునే కథాంశాలతో సినిమాలు తీసిన మణిరత్నమేనా? ఈ కథాంశాన్ని ఎన్నుకున్నది? అని ఆశ్చర్యం కలగక మానదు. పైగా హీరో, హీరోయిన్ దాదాపు ప్రతి ఫ్రేమ్ లోనూ శారీరక వాంఛను ఎక్స్ ప్రెస్ చేయడం ఇరిటేట్ చేస్తుంది. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసిన మణిరత్నం తీసిన ఈ చిత్రంలో అసహజత్వం ఎక్కువ ఉంది.
సహజీవనంతో మొదలై, చివరికి హీరో, హీరోయిన్ కి పెళ్లి చేసి, ఆ విధంగా వివాహ బంధం గొప్పది అని మణిరత్నం చూపించారు. కానీ, ఆ పాయింట్ ని ఇంకా డెప్త్ గా చూపించి ఉంటే బాగుండేది. నాయకుడు, దళపతి, రోజా, బొంబాయి, సఖి... ఇలా మణిరత్నం తీసిన అద్భుత చిత్రాలను ఇష్టపడినవాళ్లకి ఈ చిత్రం ఓ నిరాశే. ఓహో అనే విధంగా కాకుండా జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ చిత్రాన్ని 'దిల్' రాజు మిడాస్ టచ్ వసూళ్ల వర్షం కురిసేలా చేస్తుందేమో చూడాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !