View

Mukundha movie Review

Wednesday,December24th,2014, 07:40 AM

చిత్రం - ముకుంద
బ్యానర్ - లియో ప్రొడక్షన్స్
నటీనటులు - వరుణ్ తేజ్, పూజా హెగ్డే, నాజర్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, శేఖర్ కమ్ముల (గెస్ట్ అపియరెన్స్), పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ తదితరులు
సంగీతం - మిక్కీ జె.మేయర్
కెమెరా - వి.మణికందన్
ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాతలు - నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీకాంత్ అడ్డాల

సెలబ్రిటీ కుటుంబం నుంచి ఓ హీరో పరిచయం అవుతున్నాడంటే భారీ అంచనాలు ఉంటాయి. అలాగే, చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ పరిచయం అయినప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వంతు. మంచి ఎత్తు, చక్కని ఫిజిక్ తో చూడచక్కగా ఉన్నాడని ఈ చిత్రం ఫోటోలు, టీజర్ చూసినవాళ్లు అన్నారు. మరి.. నటనపరంగా వరుణ్ ప్రతిభ ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. అది తెలుసుకోవాలనే ఆసక్తితో మెగాభిమానులు, సినీ లవర్స్ థియేటర్స్ కి వస్తారు. మరి.. వచ్చిన ప్రేక్షకులును ఈ చిత్రం సంతృప్తిపరుస్తుందా? తొలి, మలి రోజులు ఆసక్తితో ఎలాగూ వసూళ్లు బాగుంటాయి.. మరి.. తదుపరి వసూళ్లు కూడా అలా ఉండే విధంగా శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్నితెరకెక్కించాడా... ఆ విషయాల్లోకే వెళదాం.

Mukundha movie Review

à°•à°¥
ముకుంద (వరుణ్ తేజ్), అర్జున్ చిన్నప్పట్నుంచి స్నేహితులు. అర్జున్ మీద ఈగ వాలకుండా చూసుకునే ఫ్రెండ్ ముకుంద. 25యేళ్లుగా సర్పంచ్ గా ఉంటూ ఊరికి ఏమీ చేయకుండా, ఆధిపత్యం కొనసాగించడం కోసం తనకు అడ్డం పడిన ప్రతివాడిని చంపించేంత దుర్మార్గుడు రావు రమేష్. అతని తమ్ముడు కూతురిని అర్జున్ ప్రేమిస్తాడు. అది తెలుసుకున్న రావు రమేష్, అతని కొడుకు అర్జున్ ని కొట్టడం, భయపెట్టడం చేస్తారు. కానీ అర్జున్ మీద ఈగ కూడా వాలనివ్వని ముకుంద ప్రతిసారి రావురమేష్ గ్యాంగ్ కి అడ్డంపడి అర్జున్ ని కాపాడతాడు.
ఈ నేపధ్యంలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ పరంగా కూడా రావు రమేష్ ని ఓడించి, ఊరికి మంచి చేయాలనే తపన ఉన్న ప్రకాష్ రాజ్ ని గెలిపిస్తాడు ముకుంద. తనకు ప్రతి విషయంలోనూ అడ్డంపడుతున్న ముకుంద అంటే రావురమేష్ ఆగ్రహంతో రగలిపోతుంటాడు. కానీ రావురమేష్ కూతురు (పూజాహెగ్డే)ని సైతం తన ప్రేమలో పడేలా చేస్తాడు ముకుంద.
మరి ముకుందను దాటుకుని అతని స్నేహితుడు అర్జున్ ని సర్పంచ్ ఏమైనా చేయగలిగాడా? లేక తన తమ్ముడు కూతురిని అర్జున్ కి ఇచ్చి పెళ్లి చేసాడా? ముకుందను ప్రేమిస్తున్న తన కూతురు ప్రేమను సర్పంచ్ అంగీకరించాడా అనేదే మిగతా కథాంశం.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఒక మాస్ హీరోకి కావాల్సిన ఫిజిక్ వరుణ్ తేజ్ కి ఉంది. అందులో నో డౌట్. లవర్ బోయ్ పాత్రలకూ పనికొస్తాడు. ఈ చిత్రంలో ఈ రెండు షేడ్స్ తనలో కనిపిస్తాయి. వాకింగ్ స్టయిల్ గా ఉంది, ఫైట్స్ బాగా చేశాడు. రెచ్చిపోయి నటించడానికి స్కోప్ లేని ముకంద పాత్రలో ఏ ఎమోషనూ లేదు. పవర్ ఫుల్ డైలాగులు చెప్పే స్కోప్ లేదు.. కామెడీ చేసే ఆస్కారం లేదు.. సెంటిమెంట్ పండించే సీన్సూ లేవు.. ఉన్నంతలో నటించాడు. పూజా హెగ్డే బాగుంది. మంచి ఆర్టిస్ట్ కూడా. పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేశ్, నాజర్, ప్రకాశ్ రాజ్, అలీ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. క్లయిమాక్స్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల కనిపిస్తారు.

సాంకేతిక వర్గం
డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి... ముందు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి చెప్పాలి. ఈ చిత్రంలో పెద్దగా కథ లేదు. ఇలా కథ లేని సినిమాలను స్ర్కీన్ ప్లేతో మేజిక్ చేస్తారు. శ్రీకాంత్ అదీ చేయలేదు. 'కొత్త బంగారు లోకం' వంటి యూత్ ఫుల్ సినిమా తీసిన శ్రీకాంత్ వరుణ్ తేజ్ లాంటి కొత్త హీరోని పరిచయం చేస్తున్నప్పుడు.. యూత్ ఫుల్ సీన్స్ పెట్టాలి. అలాంటివి అక్కడక్కడా మాత్రమే ఉంటాయి. డైరెక్టర్ ఇక్కడ బాగా చేశాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మాటలు బాగున్నాయి. కానీ, ఆ మాటలు పొడి పొడిగా సాగడం విసుగు తెప్పిస్తుంది. పాటలు బాగున్నాయి. కానీ.. కథలో వాటికి పెద్దగా స్కోప్ లేదు. పాటలుండాలి కాబట్టి, పెట్టి ఉంటారు. కెమెరా పనితనం ఓకె. నిర్మాణ విలవులు కథానుసారం ఉన్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
తమ అభిమాన కుటుంబం నుంచి ఓ హీరో వస్తున్నాడంటే.. ఆ హీరో నుంచి అభిమానులు చాలా ఎదురు చూస్తారు. ముఖ్యంగా అతను మాట్లాడే డైలాగులు వినాలనుకుంటారు. కానీ, ఈ చిత్రంలో వరుణ్ తో ఎక్కువగా మాట్లాడించలేదు. అది అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ఫస్టాఫ్ వరుణ్ తక్కువ మాట్లాడతాడు. పోనీ.. సెకండాఫ్ లో అయినా అతని మాటలు ఎక్కువ వినొచ్చని మొదలయ్యే ఎదురు చూపులు క్లయిమాక్స్ వరకూ కొనసాగుతాయి. ఓ కొత్త హీరోని జనాలకు దగ్గరయ్యేలా చేయడం ఓ మంచి మేజిక్. ఆ మేజిక్ శ్రీకాంత్ కి తెలియదేమో అనిపించడం ఖాయం. ప్రతి సీన్ పేలవంగా సాగుతుంది. మనసుని హత్తుకునే బలమైన సన్నివేశం ఉందా? అని వెతికితే.. ఒక్కటి కనిపించదు. పరుచూరి వెంకటేశ్వరరావు చనిపోయే సీన్ హత్తుకునీ హత్తుకున్నట్లుగా ఉంటుంది.
పైగా.. హీరో చొక్కా మీద రక్తంతో ఇంటర్వ్యూకి వెళితే.. కుర్రాళ్లు ఇలానే ఉంటారని అధికారులతో డైలాగ్ చెప్పించడం ఏమాత్రం హర్షణీయం కాదు. అలాగే, పరుచూరి వెంకటేశ్వరరావు పాత్ర తన కొడుకు గురించి చెబుతూ.. కుర్రాడే కదా.. అలానే ఉంటాడు.. మంచేదో చెడేదో వాడే తెలుసుకుంటాడు. అప్పటివరకు నేనేం చెప్పననడం ఆమోదనీయం కాదు. పిల్లలకు మంచీ, చెడులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వాళ్లంతటి వాళ్లే తెలుసుకుంటారులే అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదేమో. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ వాగ్ధానాలతో రెచ్చిపోయి ప్రచారం చేస్తుంటే... హీరో వర్గం మాత్రం మౌనాన్ని ప్రచారాస్ర్తంగా చేసుకుంటుంది. పోనీ.. అంతకుముందు హీరో, అతను నిలబెట్టిన వ్యక్తి ఏమైనా మంచి పనులు చేసి, ఊళ్లో గుర్తింపు తెచ్చుకున్నారా? అంటే.. అలాంటి సన్నివేశాలేవీ లేవు. కానీ, మౌనంగా ప్లకార్డులు పట్టుకుని తిరిగితే జనాలు ఓటేస్తారు. విచిత్రంగా ఉంది కదూ..
ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమా మొత్తం తేలికగా సాగిపోతుంది. ప్రేక్షకులు కూడా సినిమాని అంతే తేలికగా తీసుకుంటారు. ఏ ఎమోషన్ మనసు వరకూ వెళ్లదు. వరుణ్ ఎత్తు, చూపులో ఉన్న షార్ప్ నెస్ తన ప్లస్ పాయింట్స్. వాటిని మాత్రమే ఎలివేట్ చేయాలని డైరెక్టర్ ఫిక్స్ అయినట్లున్నాడు. పట్టుమని నాలుగు డైలాగులు చెప్పించడం, జోష్ గా స్టెప్పులు వేయించడం, హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ సీన్స్ చేయించలేదు. హీరో, హీరోయిన్ మధ్య మంచి లవ్ సీన్స్ లేవు. హీరో, హీరోయిన్ కలుసుకునే అతి తక్కువ సీన్స లో కూడా కెమిస్ర్టీ వర్కవుట్ అవ్వలేదు. ఇవన్ని ప్రేక్షకులను నిరాశపరిచే విషయాలు. ఇక మెగాభిమానులు సైతం తమ హీరో జోష్ గా డైలాగులు చెప్పాలని, డ్యాన్సులు చేస్తే చూడాలనుకుంటారు కాబట్టి వారిని కూడా ఈ సినిమా నిరాశపరుస్తుందనే చెప్పాలి. ఈ చిత్రం విజయం సాధిస్తే.. లక్ ఫేవర్ చేసినట్లే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !